బీబీసీకి కేంద్రం నోటీసులు | Government serves legal notice to BBC over documentary | Sakshi
Sakshi News home page

బీబీసీకి కేంద్రం నోటీసులు

Published Thu, Mar 5 2015 9:10 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

బీబీసీకి కేంద్రం నోటీసులు - Sakshi

బీబీసీకి కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: నిర్భయ  గ్యాంగ్ రేప్ కు సంబంధించి వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్ డాటర్’ను బీబీసీ ప్రసారం చేయడంతో ప్రభుత్వం ఆ సంస్థకు నోటీసులు అందజేసింది. ఆ సంస్థ ఎలాంటి బెరుకు లేకుండా లండన్‌లో డాక్యుమెంటరీని ప్రసారం చేసి భారత ప్రభుత్వ హెచ్చరికలను పక్కకు పెట్టింది.  పైగా ఆ వీడియోను యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేసింది. కాగా బీబీసీ భారత్‌లో మాత్రం ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోమని వెల్లడించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది.  బీబీసీకి లీగల్ నోటీసులు పంపింది. ఒప్పందానికి విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకున్నందున చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందిగా నోటీసులో స్పష్టంచేసింది.

 

‘‘డాక్యుమెంటరీని వ్యాపార అవసరాలకు వాడుకునేందుకు ముందు బీబీసీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే నోటీసు ఇచ్చాం. స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఆ వీడియోను ప్రసారం చేయడానికి బీబీసీ ప్రణాళిక రచించింది. అయితే   ముందుగానే మార్చి నాల్గో తేదీనే ఆ డాక్యుమెంటరీ ప్రసారం చేయడం ఆశ్చర్యాన్ని కల్గించిందని హోం శాఖ తెలిపింది. దీనిలో భాగంగానే ఆ సంస్థకు నోటీసులు పంపినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా యూ ట్యూబ్ లో పెట్టిన ఆ వివాదస్పద వీడియోను తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement