రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్‌ఫేక్ కంటెంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్‌లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్‌లోడ్ అయ్యాయి. ఓ పోర్న్‌స్టార్ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను అప్‌లోడ్ చేశారు ఇద్దరు. ఆ వీడియోలను అమెరికాలో గత కొన్ని నెలలుగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆమె సత్వరమే స్పందించారు.
ఆ ఇద్దరిపై లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయల దాకా) పరువు నష్టం దావా వేశారామె. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జులై 2వ తేదీన ఆమె కోర్టుకు హాజరు కానున్నారు. ఇక.. ప్రధాని లాంటి ఉన్నత పదవిలో ఉన్న తానే డీప్‌ఫేక్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చానని, బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోరాడాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి తీసుకునే పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు విరాళంగా మెలోనీ ఇస్తారని ప్రధాని లీగల్ టీం ప్రకటించింది.
నిందితులను తండ్రీ కొడుకులుగా(40, 72 ఏళ్లు) గుర్తించిన దర్యాప్తు అధికారులు.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు నిర్ధారించారు. అయితే.. మెలోనీ ప్రధాని కాకముందే 2022లో ఆ వీడియోలు అప్‌లోడ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇటలీ చట్టాల ప్రకారం ఇలాంటి పరువు నష్టం దావాలు తీవ్రంగా నేరాలుగా పరిగణించబడ్తాయి. బాధితులకు పరిహారం ఇప్పించడంతో పాటు నిందితులకు జైలు శిక్ష విధిస్తారు కూడా.
సంబంధిత వార్త: ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలు!
Comments
Please login to add a commentAdd a comment