ఇటలీ ప్రధానితో డేటింగ్‌? స్పందించిన మస్క్‌ | Is Musk Dating Meloni What He Said On Viral Pic With Italy PM | Sakshi
Sakshi News home page

మస్క్‌, ఇటలీ ప్రధాని ఫొటో వైరల్‌.. డేటింగ్‌పై ప్రపంచ కుబేరుడి స్పందన

Published Wed, Sep 25 2024 5:12 PM | Last Updated on Wed, Sep 25 2024 7:41 PM

Is Musk Dating Meloni What He Said On Viral Pic With Italy PM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌,  ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమ‌ర్లు గుప్పుమ‌న్నాయి. ఇద్ద‌రూ డేటింగ్‌లో ఉన్న‌ట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘వీరు డేట్‌కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్‌ పెట్టారు.  ఈ నేప‌థ్యంలో మ‌స్క్ త‌న ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు. త‌మ మ‌ధ్య డేటింగ్ జ‌ర‌గ‌డం లేదంటూ ఆయ‌న పోస్టు చేశారు.

కాగా మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో..  అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబ‌ల్ సిటిజ‌న్ అవార్డును మస్క్‌ మెలోనీకి అంద‌జేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. 

ఇట‌లీ ప్ర‌ధానికి అవార్డును అంద‌జేయ‌డం గ‌ర్వంగా భావిస్తున్న‌ట్లు మ‌స్క్ అన్నారు. క‌నిపించే అందం క‌న్నా..ఆమె మ‌న‌సు మ‌రింత అంద‌మైంద‌ని ఆయ‌న  పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement