
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇందులో మస్క్ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్నట్లు చూడవచ్చు.
ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న మస్క్ ఫోటో షేర్ చేస్తూ.. శత్రువులను ఓడించడానికి అని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఓహ్ మిమ్మల్ని మీరు జోకర్ అని పిలుచుకుంటున్నారా?.. అయితే జోక్ ఎందుకు జోక్ చెప్పడం లేదు.. ఇదెంత హాస్యాస్పదం అని కూడా అన్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మస్క్‌ని తదుపరి ఐరన్ మ్యాన్‌గా ఊహించారు. మరికొందరు ఐరనీ మ్యాన్: మీమ్ వార్ త్వరలో థియేటర్‌లలోకి రానుంది అని కామెంట్ చేశారు. ఇంకొకరు కామెంట్ చేస్తూ నువ్వెప్పుడూ ఒక్క జోక్ కూడా చెప్పలేదు అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తరువాత.. మస్క్ సంపద భారీగా పెరిగింది. టెస్లా స్టాక్ కూడా ఏకంగా 40 శాతం పెరిగిందని, దీంతో ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పెరిగి.. మొత్తం మీద 340 బిలియన్ డాలర్లు దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో కూడా మస్క్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
I will use the power of irony to defeat villains!
“Oh you call yourself “The Joker”, then why can’t you tell a joke! How ironic …” pic.twitter.com/6HZ1sLkBAj— Elon Musk (@elonmusk) November 24, 2024