బర్త్‌డే స్పెషల్.. 30 ఏళ్ల ఫోటో షేర్ చేసిన మస్క్ | Elon Musk Shares 30 Year Old Picture On 53rd Birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌డే స్పెషల్.. 30 ఏళ్ల ఫోటో షేర్ చేసిన మస్క్

Published Fri, Jun 28 2024 7:12 PM | Last Updated on Fri, Jun 28 2024 9:03 PM

Elon Musk Shares 30 Year Old Picture On 53rd Birthday

ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఇలాన్ మస్క్ నేటితో 53ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మస్క్ తన 30వ ఏట తీసుకున్న ఒక ఫోటోను తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

టెస్లా అండ్ స్పేస్ఎక్స్ సీఈఓ ఇలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో మే మస్క్ & ఎర్రోల్ మస్క్‌లకు జన్మించారు. ఈయన తన పుట్టినరోజు సందర్భంగా 1994 నాటి ఫోటో షేర్ చేస్తూ.. '30 సంవత్సరాల క్రితం' అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు టెస్లా చీఫ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ కూడా తన చిన్నప్పటి ఫోటో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే @elonmusk అంటూ.. మీ అత్త లిన్ నీ కోసం తయారు చేసిన కేక్‌ని చూసి.. 4వ పుట్టినరోజున నవ్వినట్లుగా ఈ రోజు కూడా నవ్వుతారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement