ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల మరో బిడ్డకు తండ్రి అయ్యారు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్.. మస్క్ మూడో భార్య శివోన్ జిలిస్ (Shivon Zilis) ఇటీవల బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మస్క్ ఇప్పుడు 12మంది పిల్లలకు తండ్రయ్యారు. ఇంతకీ జిలిస్ ఎవరు? ఈమెకు భారతదేశానికి సంబంధం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మస్క్, జిలిస్ బిడ్డకు జన్మనివ్వడం రహస్యంగా జరిగిందని కొన్ని వార్తలు తెరమీదకు వచ్చాయి. దీనికపైన మస్క్ స్పందిస్తూ.. ఇదేమీ రహస్యం కాదని నా సన్నిహితులకు అందరికి ఈ విషయం తెలుసనీ, పేపర్ ప్రకటన ఇవ్వకపోతే అదేమీ రహస్యం కాదని అన్నారు. నవంబర్ 2021లో మస్క్, జిలిస్ కవలలకు (స్ట్రైడర్, అజూర్) జన్మనిచ్చారు. కాగా ఇప్పుడు వీరు మరో బిడ్డకు జన్మనిచ్చారు.
ఎవరీ శివోన్ జిలిస్?
ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చిన శివోన్ జిలిస్ కెనడాలో జన్మించినప్పటికీ ఆమె తల్లి శారద భారతదేశానికి చెందిందని 2015లో యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జిలిస్ అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జిలిస్ మస్క్ బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్. అంతకు ముందు ఈమె సుదీర్ఘకాలం ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ హోదాలో పనిచేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment