'ఇలాన్ మస్క్' (Elon Musk).. ఈ పేరుకు పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన దిగ్గజ కంపెనీల సారధిగా మాత్రమే కాదు.. ప్రపంచ కుబేరుడు కూడా. ఇటీవలే మస్క్ 400 బిలియన్ డాలర్లను దాటేసి.. సంపదలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. నేడు లక్షల కోట్ల సంపదకు అధినేత అయిన మస్క్ ఒకప్పుడు కేవలం ఓ సూట్ మాత్రమే కలిగి ఉండేవారని 'మాయే మస్క్' పేర్కొన్నారు.
కొడుకు 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన సందర్భంగా మస్క్ తల్లి మాయే మస్క్.. తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఒకప్పుడు తాము ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను గురించి ప్రస్తావించారు. 1990లో మస్క్ బ్యాంకులో ఉద్యోగం చేసే సమయంలో రోజూ ఒకే సూట్ ధరించేవాడు. ఎందుకంటే అప్పట్లో నేను రెండో సూట్ కొనే స్తోమతలో లేదని మాయే మస్క్ పేర్కొన్నారు. ఆ సూట్ ధర 99 డాలర్లు. ఆ సూట్‌లో మస్క్ తీసుకున్న ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నా పిల్లల చిన్న తనంలో కొత్త బట్టలు కొనివ్వడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, అందుకే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనిచ్చేదాన్ని అని.. మాయే మస్క్ వెల్లడించారు. తినడానికి ఆహారం లేని సమయంలో.. కేవలం బ్రేడ్ మాత్రమే పెట్టాను. దాన్నే వారు ఇష్టంగా తినేవారు. అయితే తన తెలివితో నేడు ప్రపంచ కుబేరుడుగా ఎదిగాడు. మస్క్‌ను ధనవంతుడు అనడం కంటే.. మేధావి అంటే చాలా సంతోషిస్తాను అని ఆమె పేర్కొన్నారు.
మాయె మస్క్ తన భర్త ఎర్రోల్ మస్క్ (Errol Musk) నుంచి విడాకులు తీసుకున్న తరువాత ముగ్గురు పిల్లలను చాలా కష్టపడి పెంచినట్లు వెల్లడించారు. ఎన్నో సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటూ.. ముగ్గురు పిల్లలను గొప్పవారిగా తీర్చిదిద్దారు. మస్క్ ఫ్యామిలీ మొదట సౌత్ ఆఫ్రికా నుంచి కెనడాకు వెళ్ళింది. ఆ తరువాత అమెరికాలో స్థిరపడింది.
ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!
400 బిలియన్ డాలర్లు దాటేసిన మస్క్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్‌ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం. అంతే కాకుండా టెస్లా షేర్లు బుధవారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది మస్క్ ఆర్థిక స్థితిని మరింత పెంచింది.
This photo was taken in our rent-controlled apartment in Toronto, with my mom‘s painting on the wall. The suit cost $99 which included a free shirt, tie and socks. A great bargain! He wore this suit every day to his bank job in Toronto. I couldn’t afford a second suit. We were… https://t.co/jh2SHOXwpe
— Maye Musk (@mayemusk) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment