ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం.
టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు.
వందల కోట్లు విరాళంగా ఇచ్చిన 'మస్క్' మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు.
పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.
మస్క్ సంపద
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్‌ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.
2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment