అపర కుబేరుడు & టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలియని వారు ఉండరు. అయితే త్వరలోనే ఈయన జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ ఒకటి విడుదలకానున్నట్లు సమాచారం. అందులో మస్క్ గురించి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఆయన కుమార్తె 'జెన్నా'తో ఉన్న విభేదాలను గురించి వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి ఎలాన్ మస్క్ మాజీ భార్య 'జస్టిస్ విల్సన్' ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు. వారు 'జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్'. అయితే మస్క్ 2008లో జస్టిస్‌కి విడాకులిచ్చాడు. ఆ తరువాత జేవియర్ అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి 'వివియన్ జెన్నా విల్సన్'గా మారింది. తండ్రి మీద ఉన్న కోపంలో ఇలా చేసుకున్నట్లు గతంలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. మస్క్ జెన్నాను కలుసుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆమెకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండటం. దీంతో డబ్బున్నవారందరూ చెడ్డవాళ్లే అని దృడంగా నమ్మి తనకు దూరంగా ఉంటోంది. జెన్నా ఎప్పుడూ నాతో కొంచెం సమయం కూడా గడపడానికి ఇష్టపడలేదు, ఇది తనను ఎంతో బాధకు గురిచేసినట్లు వెల్లడించాడు.
ఇదీ చదవండి: మొదటి సారి నా భార్యను అక్కడే కలిసాను - ఆనంద్ మహీంద్రా
ఇది నా మొదటి కుమార్తె 'నెవాడా' (Nevada) మరణం కంటే కూడా చాలా బాధించిందని తెలిపాడు. ఇవన్నీ కూడా మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో ఉన్నట్లు సమాచారం. ఈ బుక్ ఈ నెల 12న (2023 సెప్టెంబర్ 12) విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment