మస్క్ కూతురు అలా మెసేజ్ చేసిందా! తండ్రికి తెలియకూడదని.. | I am transgender dont tell my father elon musk daughter | Sakshi
Sakshi News home page

Elon Musk: మస్క్ కూతురు అలా మెసేజ్ చేసిందా! తండ్రికి తెలియకూడదని..

Published Sun, Sep 3 2023 9:08 PM | Last Updated on Sun, Sep 3 2023 9:14 PM

I am transgender dont tell my father elon musk daughter - Sakshi

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తన భార్యా జస్టిస్‌కి  2008లో విడాకులిచ్చిన విషయం అందరికి తెలుసు. అప్పటికే వారికి 'జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్' అనే ఇద్దరు కుమారులుండేవారు. విడిపోయిన తరువాత అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి 'వివియన్ జెన్నా విల్సన్'గా మారింది.

నిజానికి అమ్మాయిగా మారిన తరువాత ఆ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ అలెగ్జాండర్ తన అత్తకు గతంలోనే మెసేజ్ చేసింది. అయితే అది ఆ తరువాత చాలా రోజులకు ఈ విషయం బయటపడినట్లు సమాచారం. దీనిని ఎలాన్ మస్క్ జీవిత చరిత్రలో వాల్టర్ ఐజాక్సన్ వెల్లడించాడు.

ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!

అలెగ్జాండర్ తన తండ్రి మీద కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మస్క్ ప్రవర్తన ట్రాన్స్‌జెండర్లకు వ్యతిరేకంగా ఉంటుందని ఇలా చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ధనవంతులంతా చెడ్డవాళ్ళని ఆ అమ్మాయి బలంగా విశ్వసిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటికి కూడా తన తండ్రిని (మస్క్) కలుసుకోవడానికి అంగీకరించలేదు. ఇది ఎలాన్ మస్క్‌ని ఎంతగానో బాధించిందని చెబుతాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement