Iron man
-
ఐరన్ మ్యాన్ డ్రెస్‌లో మస్క్: ఫోటో వైరల్
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇందులో మస్క్ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్నట్లు చూడవచ్చు.ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న మస్క్ ఫోటో షేర్ చేస్తూ.. శత్రువులను ఓడించడానికి అని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఓహ్ మిమ్మల్ని మీరు జోకర్ అని పిలుచుకుంటున్నారా?.. అయితే జోక్ ఎందుకు జోక్ చెప్పడం లేదు.. ఇదెంత హాస్యాస్పదం అని కూడా అన్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మస్క్‌ని తదుపరి ఐరన్ మ్యాన్‌గా ఊహించారు. మరికొందరు ఐరనీ మ్యాన్: మీమ్ వార్ త్వరలో థియేటర్లలోకి రానుంది అని కామెంట్ చేశారు. ఇంకొకరు కామెంట్ చేస్తూ నువ్వెప్పుడూ ఒక్క జోక్ కూడా చెప్పలేదు అని అన్నారు.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తరువాత.. మస్క్ సంపద భారీగా పెరిగింది. టెస్లా స్టాక్ కూడా ఏకంగా 40 శాతం పెరిగిందని, దీంతో ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పెరిగి.. మొత్తం మీద 340 బిలియన్ డాలర్లు దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో కూడా మస్క్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.I will use the power of irony to defeat villains!“Oh you call yourself “The Joker”, then why can’t you tell a joke! How ironic …” pic.twitter.com/6HZ1sLkBAj— Elon Musk (@elonmusk) November 24, 2024 -
సాహసానికి సై యామి... భయమా... డోంట్ ఖేర్
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన చిరకాల స్వప్నం ‘ఐరన్ మ్యాన్ 70.3’ గురించి చెప్పినప్పుడు అభినందించిన వాళ్ల కంటే అపహాస్యం చేసిన వాళ్లే ఎక్కువ. ‘సినిమాల్లోలాగా అక్కడ డూప్‌లు ఉండరు’ అని నవ్వారు కొందరు. అయితే ఇవేమీ తన సాహసానికి అడ్డుగోడలు కాలేకపోయాయి.ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేస్‌గా ‘ట్రయథ్లాన్: ఐరన్‌మ్యాన్’ రేస్ గురించి చెబుతారు. 1.9 కిలోమీటర్ల స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల బైసికిల్ రైడ్, 21.1 కిలోమీటర్ల పరుగుతో ‘ఐరన్ మ్యాన్’ రేసు పూర్తి చేసిన తొలి బాలీవుడ్ నటిగా సయామీ ఖేర్ చరిత్ర సృష్టించింది.ఫ్రెండ్స్‌కు తన కల గురించి సయామీ ఖేర్ చెప్పినప్పుడు ‘నీలాగే చాలామంది కలలు కంటారు. రేస్ పూర్తి చేయని ఫస్ట్ టైమర్లు ఎందరో ఉన్నారు’ అన్నారు వాళ్లు. వెనక్కి తగ్గిన వారిలో తాను ఒకరు కాకూడదు అనుకుంది ఖేర్. ఫిబ్రవరిలో ‘ఐరన్ మ్యాన్’ రేస్ కోసం ట్రైనింగ్ మొదలైంది. మొదట్లో 3 కిలోమీటర్లు పరుగెత్తడం, ఈత ‘అయ్య బాబోయ్’ అనిపించేది. త్వరగా అలిసి పోయేది. సాధన చేయగా... చేయగా... కొన్ని నెలల తరువాత పరిస్థితి తన అదుపులోకి వచ్చింది. అప్పుడిక కష్టం అనిపించలేదు. ముఖ్యంగా క్రమశిక్షణ బాగా అలవాటైంది.రోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి శిక్షణ కోసం సిద్ధం అయ్యేది. ట్రైనింగ్‌లో తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి లోతుగా ఆలోచించేది. ‘శిక్షణ బాగా తీసుకుంటే వాటిని అధిగమించడం కష్టం కాదు’ అని కోచ్ చెప్పిన మాటను అనుసరించింది.‘ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మారథాన్లలోపాల్గొంటున్నాను. అయితే నా దృష్టి మాత్రం ఐరన్ మ్యాన్ రేస్ పైనే ఉండేది. నా కలను నెరవేర్చుకోడానికి సన్నద్ధం అవుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. దీంతో నా కల తాత్కాలికంగా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికైనా నా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటుంది సయామీ ఖేర్.ఖేర్ మాటల్లో చెప్పాలంటే ‘ఐరన్ మ్యాన్ రేస్ అనేది శారీరక సామర్థ్యం, సహనానికి పరీక్ష.‘ఆటలు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మనసును ప్రశాంతం చేస్తాయి. ఐరన్ మ్యాన్ రేస్ పూర్తి చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఆత్మవిశ్వాసం నా నట జీవితానికి ఉపయోగపడుతుంది’ అంటుంది 32 సంవత్సరాల సయామీ ఖేర్.ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‘ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్’ అనేది వరల్డ్ ట్రయథ్లాన్ కార్పొరేషన్(డబ్ల్యూటిసి) నిర్వహించే రేసులలో ఒకటి. దీనిని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్పోర్ట్ ఈవెంట్‌గా చెబుతారు. ఈ రేసు సాధారణంగా ఉదయం ఏడుగంటలకు మొదలై అర్ధరాత్రి ముగుస్తుంది. ఓర్పు, బలం, వేగానికి సంబంధించి ట్రయథ్లెట్లు రేసుకు కొన్ని నెలల ముందు కఠిన శిక్షణ తీసుకుంటారు.అయిననూ ఛేదించవలె...గత సంవత్సరం బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డాను. కొన్ని నెలల రెస్ట్. మరోవైపు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ‘ఇలాంటి పరిస్థితుల్లో సాహసాలు అవసరమా!’ అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించలేదు సరి కదా ఎలాగైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. ‘ఏదైనా చేయాలి అని మనసు బలంగా అనుకుంటే దానికి అనుగుణంగా శరీరం కూడా సన్నద్ధం అవుతుంది’ అంటారు. ఇది నా విషయంలో అక్షరాలా నిజం అయింది.అయితే ప్రతికూల పరిస్థితులు మళ్లీ ముందుకు వచ్చాయి. రేసుకు వారం ముందు కెనడాకు నా ప్రయాణం (వర్క్ ట్రిప్) పీడకలగా మారింది. విమానాలు ఆలస్యం కావడం నుంచి కాంటాక్ట్స్ కోల్పోవడం వరకు ఎన్నో జరిగాయి. నా బ్యాగ్‌లు మిస్ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం సహకారంతో ఆ సమస్య నుంచి ఎలాగో బయటపడ్డాను. ఇక ‘ఐరన్ మ్యాన్ రేస్’లో నా గేర్ మొదలైనప్పుడు గాలులు తీవ్రంగా వీచడం మొదలైంది. అయినప్పటికీ ఈత కొట్టడానికి, రైడ్ చేయడానికి వెళ్లాను. నా మార్గంలో వచ్చిన ప్రతిదాన్ని ఆస్వాదించాలని గట్టిగా అనుకున్నాను. నీరు గడ్డకట్టినప్పటికీ రేసును ఒక వేడుకలా భావించాను. కోల్డ్వాటర్లో 42 నిమిషాలు ఈదాను. – సయామీ ఖేర్ -
రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్!
నటులడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ విడుదలైనప్పటి నుంచి ఆ క్యారక్టర్‌కి విశేష ప్రజాధరణ లభించింది. ఆ క్యారక్టర్‌కి స్ఫూర్తిగా చాలామంది పలు రకాలుగా ఐరన్ సూట్లు రూపొందించారు. అయినప్పటికీ, రష్యన్ కంటెంట్ సృష్టికర్త ఇంజనీర్ అలెక్స్ బుర్కాన్ సృష్టి వేరుగా ఉంది, అతను మొదటి నుంచి ఐరన్ మ్యాన్ సూట్‌ను జాగ్రత్తగా జీవం పోసాడు. అతను రూపొందించిన సూట్ సౌందర్యానికి మించి, ఆధునాతన లక్షణాలతో నిండిన సాంకేతిక అద్భుతం. ఇతరులు రూపొందించినట్లుగా కాకుండా యూట్యూబర్సూ అలెక్స్ బుర్కాన్ సూట్లో సెల్ఫ్ పవర్డ్ హైడ్రోజన్ రియాక్టర్, రిపల్సర్ అప్‌గ్రేడ్, బుల్లెట్ ప్రూఫ్ ఆర్మర్ వంటి సాకేంతికత ఉంది.ఈ రష్యన్ ఇంజినీర్, యూట్యూబర్ అలెక్స్ బుర్కాన్ రూపొందించిన రియల్ ఐరన్ మ్యాన్ సూట్ ఆన్లైన్ కమ్యూనిటీని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘రియల్–లైఫ్ ఐరన్ మాన్ సూట్ విత్ ఏ రిపల్సర్ బ్లాస్ట్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘క్లిష్టమైన డిజైన్‌తో రూపొందించిన ఐరన్ మ్యాన్ సూట్‌కు సంబంధించి అలెక్స్ బుర్కాన్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు. తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి అలెక్స్ ఎదుర్కొన్న సాంకేతిక సవాళ్లు, టెస్టింగ్ దశలను తెలియజేసేలా ఉంటాయి ఈ వైరల్ వీడియోలు. ‘రియల్ లైఫ్ టోనీ స్టార్క్’ అంటూ అలెక్స్‌ను ఆకాశానికెత్తాడు ఒక నెటిజెన్. నిజానికి సైన్స్–ఫిక్షన్ టెక్కు సంబంధించి అలెక్స్‌కు ఇది ఫస్ట్ ఎక్స్పరిమెంట్ ఏమీ కాదు. గతంలో కూడా ఆశ్యర్యం కలిగించే ఎన్నో పరికరాలను తయారు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. View this post on Instagram A post shared by Factpro (@thefactpro) (చదవండి: చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!) -
'ఉక్కు మనిషి' సర్దార్ అని ఎందుకు అంటారంటే..?
ఉక్కు మనిషిగా అందరికీ సుపరిచితమైన సర్దార్ వల్లభాయ్ పటేల్, క్లిష్ట పరిస్థితుల్లో గట్టి నిర్ణయాలు తీసుకుని మెరుగైన పాలన అందించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేరు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల్లో కూడా పటేల్ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఆయనలో ఉన్న లక్షణాలను అలవరుచుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు మోదీ. బహుశా ఆ ఇష్టమే ఆయన కోసం అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసేందుకు కారణమయ్యిందేమో!. అంతటి మహోన్నత వ్యక్తి పటేల్‌ని ఎందుకు 'ఉక్కుమనిషి' అని పిలుస్తారో తెలుసుకుందామా!. స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి బర్డోలీ వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సరిగ్గా స్వాతంత్రం వచ్చే సమయానికి పటేల్ వయసు 72 ఏళ్లు. అయితే దేశంలో స్వాతంత్ర అనంతరం ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పటేల్ పరిష్కరించారు. తొలి నుంచి విభజించు పాలించు అనే సూత్రంతో ఆంగ్లేయులు అఖండ భారతావనిని మత ప్రాతిపదికన రెండు ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ.. వెళ్తూ.. దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్‌లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అవసరమైతే భారత్‌లో లేదా... పాకిస్థాన్‌లో కూడా విలీనం కావచ్చే లేదంటే మీకు మీరు సొంతంగా రాజ్యాలు ఏలుకోవచ్చు’ అనే స్వేచ్ఛను కూడా ఇచ్చేశారు. దీంతో సంస్థానాధీశులకు ఎక్కడలేని శక్తి వచ్చింది. ఎవరికివారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. అన్నింటికీ మించి హైదరాబాద్, జూనాగఢ్, కశ్మీర్ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్థాన్ కన్నేసింది. ఒకవేళ అవి పాక్‌లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణే. ఒకే ఇల్లులా ఉండాల్సిన దేశంలో ఇన్ని వేరు కుంపట్ల మంటలు భరించాలా? ఇలా కుదరదు.. పిల్ల రాజ్యాలన్నింటి తల్లి భారతి ఒడిలో చేర్చాలి... దేశమంతా ఒక్కటిగా ఉండాలి.. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి. అదే సమయంలో పటేల్‌కు వయోభారం, అనారోగ్య సమస్యలు ఒక సవాలుగా ఉన్నా వాటిని పక్కన పెట్టి మరి బారతేశాన్ని నిర్మించే పనికి ఉపక్రమించారు. రాష్టాల శాఖకు ఇన్ఛార్జ్ మంత్రిగా దాదాపు 565 రాజరికి రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం వాటి పరిపాలన, సైన్యం వ్యవస్థలను యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏకీకృతం చేసే స్మారక పనిని భుజానకెత్తుకున్నారు. వాటిలో వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా భారత సమాఖ్యలో అంతర్భాగమయ్యాయి. ఇక మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి పటేల్ అసాధారణమైన పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంతంగా కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటం వల్ల హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక ఆయనది. కానీ పైకి మాత్రం స్వాతంత్య్రం అనంతరం మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని చెప్పేవాడు. కానీ నిజాం వైఖరిపట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అలా హైదరాబాద్ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కలిగించారు పటేల్. ఇక కాశ్మీర్‌ది మరో విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్‌లో కశ్మీర్‌ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే దాయాది పాకిస్థాన్ కశ్మీర్‌లోని వేర్పాటువాదులను ప్రోత్సహించి దీన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ 370, 35ఏ. దాదాపు 75 ఏళ్లుగా రావణకష్టానికి ఆజ్యం పోసింది. మోదీ ప్రభుత్వం దీనిపై 2019లో సాహసోపేత నిర్ణయం తీసుకుని, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి పూర్తిగా భారత్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఆయన భారత్‌లోని రాజులను అంత చేయకుండా వారి సంస్థనాలను భారత్‌లో వీలినం చేసే సంకల్పాన్ని నేరవేర్చడంలో దృఢంగా వ్యవహరించడంతో ఉక్కుమనిషి సర్థార్ అని ప్రశంసలందుకున్నారు. అలా ఆయన అవిశ్రాంతంగా దేశం కోసం తాను చేయగలిగినంత వరకు పనిచేశారు. సరిగ్గా నవంబర్ 1950లో, పటేల్ పేగు సంబంధిత రుగ్మత, అధిక రక్తపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తదుపరి చికిత్స కోసం అతన్ని బొంబాయికి తరలించారు. కానీ అతను హార్ట్ స్ట్రోక్‌తో 1950 డిసెంబర్ 15న కన్నుమూయడం జరిగింది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి, రాజేంద్ర ప్రసాద్, ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ వంటి ఇతర నాయకులు కదిలి వచ్చారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఏకంగా ఆరు మైళ్ల ఊరేగింపుగా ప్రజలు తరలి వచ్చారు. బొంబాయిలోని క్వీన్స్ రోడ్‌లోని శ్మశానవాటికలో పటేల్ కుమారుడు దహ్యాభాయ్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. అంతా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారనే చెప్పాలి. ధైర్య, విశ్వాసంలో పటేలో ఎందరికో స్ఫూర్తి, ఆయనలాంటి వ్యక్తిన మళ్లీ చూడలేం అని సి రాజగోపాలాచారి అన్నారు. ఇక మౌలానా ఆజాద్ పటేల్ శౌర్యాన్ని పర్వతాల ఎత్తతోనూ, ఆయన దృఢ సంకల్పాన్ని ఉక్కుతోనూ పోల్చారు. ఇక నెహ్రు కూడా ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ నూతన భారతదేశ నిర్మాత, సంఘటితుగా పిలిచారు. దటీజ్ ఉక్కు మనిషి పటేల్..!. (చదవండి: కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?) -
ఐరన్ మ్యాన్ కలను నిజం చేసిన ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల విజయాల గురించి ప్రత్యేక కథనాలను తన ట్విట్టర్ వేదికగా పంచుకునే విషయం మనకు తేలిసిందే. కొన్నిసార్లు, అతను ప్రతిభ ఉన్న వారి గుర్తించి ప్రోత్సహించడంలో ముందుంటారు. గ్రామీణ యువతీయువకుల్లో ఉండే ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ఆనంద్ మహీంద్రా ముందుకు వస్తారు. తాజాగా నేడు గతంలో ఒక కుర్రాడికి ఇచ్చిన మాటను మహీంద్రా నిలబెట్టుకున్నారు. మణిపూర్ రాష్ట్రం థౌబల్ జిల్లా హెయిరోక్ గ్రామానికి చెందిన నింగోంబమ్ ప్రేమ్.. చెత్త కుప్పల వెంట దొరికే ఎలక్ట్రానిక్ వేస్టేజ్‌ను సేకరించి కార్డ్బోర్డ్ సాయంతో ఐదేళ్లు కష్టపడి ఐరన్‌మ్యాన్ సూట్‌ని తయారు చేశాడు. ఈ సూట్‌తో పాటు మధ్య మధ్యలో కొన్ని ఆవిష్కరణలు చేశాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో చెల్లిని సైతం చదివిస్తున్నాడు. అతనికి మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు చేయాలని ఉందట. కానీ, డబ్బుల్లేక ఆగిపోయాడు. ఈ విషయం ఓ వీడియో ద్వారా వ్యాపారదిగ్గజం ఆనంద్ మహీంద్రాకు చేరింది. టోనీ స్టార్క్ (మార్వెల్ ఐరన్‌మ్యాన్)ను పక్కకి తప్పుకోమంటూ.. ప్రేమ్‌ను రియల్ ఐరన్ మ్యాన్‌గా పొడిగారు ఆనంద్ మహీంద్రా. అంతేకాదు అతనికి, అతని సోదరికి సాయం అందిస్తానని మాటిచ్చారు. Remember Prem, our young Indian Ironman from Imphal? We promised to help him get the engineering education he wanted and I’m delighted to share that he has arrived at @MahindraUni in Hyderabad. Thank you Indigo for taking such good care of him.. https://t.co/7Z6yBi39yi pic.twitter.com/Hw7f0c5lGW — anand mahindra (@anandmahindra) November 16, 2021 ఇప్పుడు ప్రేమ్‌కు ఇచ్చిన మాటను నిజం చేస్తూ హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. "ఇంఫాల్ కు చెందిన మా యువ భారతీయ ఐరన్ మాన్ ప్రేమ్ గుర్తున్నాడా? అతను కోరుకున్న ఇంజనీరింగ్ విద్యను పొందడానికి అతనికి సహాయం చేస్తానని మేము వాగ్దానం చేస్తున్నాము. అతను హైదరాబాద్‌లోని @MahindraUni మహీంద్రా విశ్వవిద్యాలయం వచ్చిన విషయాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. అలాగే ప్రేమ్ ప్రయాణానికి సహకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు" ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. -
అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్
సినిమాల ప్రభావం మిగతావాళ్ల మీద ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ఆ కుర్రాడి మీద మాత్రం భలేగా చూపించింది. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఆ పేదింటి బిడ్డ ఆవిష్కరణలకు ప్రయత్నించాడు. కన్నతల్లి అందించిన ప్రొత్సాహంతో ఐదేళ్లు కష్టపడి రియల్ ఐరన్‌మ్యాన్ సూట్ తయారు చేశాడు. ఆ కష్టమే అతని చెల్లి చదువుకు సాయపడింది. ఇప్పుడు తన కల నెరవేర్చుకునేందుకు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. నింగోంబమ్ ప్రేమ్.. వయసు 20. ఉండేది మణిపూర్ రాష్ట్రం థౌబల్ జిల్లా హెయిరోక్(2) గ్రామం. చదివేది ఇంఫాల్‌లో ఫైన్ ఆర్ట్స్ కోర్స్. ఆరేళ్ల క్రితం.. ఓరోజు స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఫోన్లో ఐరన్ మ్యాన్ సినిమా చూశాడట. మనోడికి ఆ సినిమా తెగ నచ్చేసింది. అప్పటి నుంచి వరుసగా హాలీవుడ్ సినిమాలు చూస్తూ.. మైండ్‌లో ప్రింట్ అయిన ‘ఐరన్‌మ్యాన్ సూట్’ బొమ్మను పేపర్‌పై గీసుకున్నాడు. ఎలాగైనా ఆ సూట్‌ను తయారు చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు ఆ కుర్రాడు. టెక్నికల్ నాలెడ్జ్ లేదు. అందుకోసం హాలీవుడ్ సినిమాలు, ఇంటర్నెట్ను ఆశ్రయించాడు. ఈ రెండూ అతని బుర్రను రాటుదేల్చాయి. Move over Tony Stark. Make way for the REAL Iron Man. And it would be a privilege to assist him & his siblings in their education. If someone can connect me to him, it will be a privilege for me & @KCMahindraEduc1 to support him. (🙏🏽 @jaavedjaaferi for forwarding the video) pic.twitter.com/sKs8V3H8xQ — anand mahindra (@anandmahindra) September 20, 2021 తల్లి అండ.. చెల్లికి దన్ను సూట్ తయారు చేయాలనే ఆత్మ విశ్వాసం ప్రేమ్‌లో నిండింది. కానీ, మెటీరియల్ కోసం డబ్బులు లేవు. మగదిక్కులేని ఆ కుటుంబానికి ప్రేమ్ తల్లి సంపాదనే ఆధారం. కానీ, ఆమె కొడుకును ‘ఏదో ఒకటి సాధించాలంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించింది. చెత్త కుప్పల వెంట తిరిగి ఎలక్ట్రానిక్ వేస్టేజ్‌ను సేకరించాడు. కార్డ్బోర్డ్ సాయంతో ఐదేళ్లు కష్టపడి ఐరన్‌మ్యాన్ సూట్‌కి ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ సూట్‌తో పాటు మధ్య మధ్యలో కొన్ని ఆవిష్కరణలు చేశాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో చెల్లిని సైతం చదివిస్తున్నాడు. తన ఆవిష్కరణలు మరికొందరిలో స్ఫూర్తి ఇస్తే చాలంటున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు చేయాలని ఉందట. కానీ, డబ్బుల్లేక ఆగిపోయాడు. ఈ విషయం రీసెంట్గా ఓ వీడియో ద్వారా వ్యాపారదిగ్గజం ఆనంద్ మహీంద్రాకు చేరింది. టోనీ స్టార్క్(మార్వెల్ ఐరన్‌మ్యాన్)ను పక్కకి తప్పుకోమంటూ.. ప్రేమ్‌ను రియల్ ఐరన్ మ్యాన్‌గా పొడిగారు ఆనంద్ మహీంద్రా. అంతేకాదు అతనికి, అతని సోదరికి సాయం అందిస్తానని మాటిచ్చారు. వాళ్లను సంప్రదించేందుకు సాయం చేయాలని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
‘ఐరన్‌మ్యాన్’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్‌మ్యాన్’ అలా..
ఐరన్‌మ్యాన్.. మార్వెల్ కామిక్స్‌లో పిల్లలకు ఓ ఫేవరెట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్నిసంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్ డానీ జూనియర్. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. రాబర్డ్ డానీ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొందరిని అన్‌ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్ నటులను అన్ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, స్పైడర్ మ్యాన్ ‘టామ్ హాలాండ్’ లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్‌ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్‌కు డానీ గుడ్‌బై చెప్పాడా? ఇక ఐరన్ మ్యాన్‌గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా. అయితే డానీ తన ఇన్‌స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్‌ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్‌లో.. ఏ ఒక్క యాక్టర్ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్ జాన్ డానీ జూనియర్. ముద్దులతో స్పైడర్‌మ్యాన్ టామ్దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హోలాండ్(25).. తన కో స్టార్ జెన్దయాతో రిలేషన్లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. కాగా, ఈ బ్రిటిష్ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్ నటి జెన్దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్‌మ్యాన్ హోంకమింగ్(2017) నుంచి పీటర్ పార్కర్-ఎంజే క్యారెక్టర్ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. I can’t breathe #TOMDAYA #TOMHOLLAND #ZENDAYA pic.twitter.com/bYLEf2YpBM — 🦖 (@8ncvrr) July 2, 2021 -
జనాన్ని హడలెత్తించిన ఏలియన్!?
నోయిడా : ఐరన్ మ్యాన్ సూట్‌ను పోలిన ఓ బెలూన్ నోయిడా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. అది ఏలియన్‌లాగా గాల్లోంచి నేలపై దిగటంతో జనం బిక్కచచ్చిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలోని దాన్‌కౌర్ ప్రాంతంలో నిన్న ఉదయం ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది. దాని చూసిన జనం అది అచ్చం ఏలియన్ లాగానే ఉందంటూ.. కాదు, కాదు ఏలియనే అంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ( స్వాతంత్య్ర సమర యోధుడికి తీవ్ర అవమానం ) ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దాన్‌కౌర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అనిల్‌కుమార్ పాండే అక్కడికి చేరుకున్నాక అసలు విషయం బయటపడింది. అది ఏలియన్ కాదని.. ఐరన్ మ్యాన్‌ను పోలి ఉన్న బెలూన్ అని ఆయన స్థానికులకు వివరించారు. బెలూన్ గాల్లోకి ఎగరటానికి ఆధారమైన గ్యాస్ తగ్గుతుండటంతో అది నేలపై పడిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. -
రజనీ ఐరన్‌మేన్.. సల్మాన్ హల్క్
.. పాత్రలకు బాగా సెట్ అవుతారని అభిప్రాయపడ్డారు ‘అవెంజర్స్’ దర్శకుడు జోయి రుస్సో. ‘అవెంజర్స్’ సిరీస్‌లో వస్తున్న చివరి చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది. ‘ఇన్ఫినిటీ వార్’ కేవలం ఇండియాలోనే సుమారు 200 కోట్లుపైగా వసూలు చేసింది. ‘ఎండ్ గేమ్’ ప్రమోషన్స్ కోసం ఇండియా వచ్చిన దర్శకుడు జోయి రుస్సో ఇండియన్ సినిమాల గురించి మాట్లాడుతూ – ‘‘కొన్నాళ్లుగా ‘అవెంజర్స్’ సినిమాలతోనే స్పెండ్ చేస్తున్నాను. ప్రపంచ సినిమా చూసే తీరక కూడా లేదు. ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్’ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశానికి రజనీకాంత్ నటించిన ‘యందిరన్’ (రోబో) క్లైమాక్స్ స్ఫూర్తినిచ్చింది’’ అన్నారు. మరి అవెంజర్స్ పాత్రల్లో రజనీకాంత్‌ను, సల్మాన్‌ఖాన్‌ను నటింపజేయాలనుకుంటే ఏ పాత్రలు వాళ్లకు సూట్ అవుతాయి అనే ప్రశ్న ఆయన ముందుంచితే– ‘‘రజనీ ఐరన్‌మేన్, సల్మాన్ హల్క్ పాత్రల్లో బావుంటారు’’ అన్నారు. -
మోస్ట్ అవెయిటెడ్ ట్రైలర్ వచ్చేసింది..!
హాలీవుడ్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవెంజర్స్ ఎండ్‌గేమ్ ట్రైలర్ వచ్చేసింది. ముందుగా ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని భావించినా సీనియర్ బుష్ మరణంతో రెండు రోజుల పాటు వాయిదా తరువాత శుక్రవారం విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్, బ్లాక్ విడో, హల్క్, హాక్ఐ లాంటి సూపర్ హీరోలు సందడి చేశారు. గతంలో వచ్చిన సినిమాలో థానోస్ స్పైడర్ మాన్, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ పాంథర్ లాంటి సూపర్ హీరోలను అందం చేశాడు. మరి ఈ చివరి భాగంలో మిగిలిన కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో, హల్క్, ఐరన్ మ్యాన్కూడా అంతం అవుతారా లేక థానోస్ సూపర్‌హీరోస్ చేతిలో చనిపోతాడు అన్నదే ఈ సినిమా క్లైమాక్స్ కానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతోంది. -
సూపర్ హీరోల సృష్టికర్త మృతి
ప్రపంచ వినోద రంగానికి స్పైడర్ మేన్, బ్లాక్ పాంతర్, ఐరన్ మేన్, ఎక్స్‌మేన్ లాంటి సూపర్‌హీరోలను అందించిన ప్రముఖ రచయిత స్టాన్లీ సోమవారం కన్నుమూశారు. మార్వెల్ కామిక్స్‌కు గాడ్‌ఫాదర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్లీ 1922 డిసెంబర్ 22న జన్మించారు. లీ తండ్రి ఎక్కువగా అడ్వంచర్ నవలలను చదివారు. ఆ ప్రభావమే లీని రచయితగా మార్చింది. డిగ్రీపూర్తి చేసిన తరువాత పలు నాటకాలను స్వయంగా రాసి, నటించారు కూడా. 1939లో మార్వెల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన లీ, రెండేళ్ల తరువాత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కెప్టెన్ అమెరికా పాత్ర కోసం ఓ కథను రెడీ చేశారు. తరువాత అదే కంపెనీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎడిటర్ స్థాయిలో దశాబ్దాల పాటు సేవలందించారు. 1961లో తొలిసారిగా ఫెంటాస్టిక్ ఫోర్ పేరుతో సూపర్‌హీరో టీంను సృష్టించిన లీ.. 2002లో తన ఆత్మకథను ‘ఎక్సెల్షియర్! ద అమేజింగ్ లైఫ్ ఆఫ్ స్టాన్ లీ’ పేరుతో విడుదల చేశారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు. -
వాళ్ల రాతల్లో నేనూ చనిపోయే ఉంటా!
‘‘నాకిప్పుడు 95 ఏళ్లు. నాకేమనిపిస్తోందంటే, రేపు పొద్దున నేను చనిపోతే, వెంటనే పేపర్లలో న్యూస్ వేసుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలామంది నేను చనిపోయినట్టు రాసి పెట్టుకొని ఉండొచ్చు. అయితే ఆ రోజు తొందరగా రావొద్దని కోరుకుంటా’’ అని గట్టిగా నవ్వారు స్టాన్లీ. చావు మీద స్టాన్లీ వేసిన జోక్ ఇది. డార్క్ జోక్. స్పైడర్‌మేన్, ఐరన్‌మేన్, ఎక్స్‌మేన్.. ఇలా సూపర్‌హిట్ మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్స్‌ను సృష్టించిన వారిలో ఒకరైన స్టాన్లీ.. మార్వెల్ కామిక్స్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. మొన్న డిసెంబర్ 28న తన 95వ పుట్టినరోజు జరుపుకున్న స్టాన్లీ, ఆ సందర్భంగానే పై జోక్ పేల్చారు. ఈ జోక్ వెనక ఒక విచిత్రమైన కథ ఉంది. కెరీర్ మొదట్లో స్టాన్లీ ఓ ప్రముఖ పత్రికలో పనిచేసేవారట. ఎవరైనా పేరున్న వ్యక్తి చనిపోతే, గంటలోపే మూడు పేజీల మ్యాటర్ రెడీ అయి బయటకొచ్చేదట. ఎలా? అని అడిగితే, పోతారనుకున్న వాళ్ల లిస్ట్ రెడీ చేస్కోవడం వల్లే అంటారు స్టాన్లీ. ‘‘ఇది ఇప్పటికీ జరుగుతుందని అనుకుంటున్నా. నా గురించి కూడా రాసి పెట్టుకొనే ఉంటారు. సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నేను ఈ స్థాయికి రావడం’’ అన్నారు స్టాన్లీ.. తత్వాన్ని, చమత్కారాన్ని ఒకే మాటలో కలిపేస్తూ! -
గిన్నిస్ రికార్డుకెక్కిన రియల్ లైఫ్ ‘ఐరన్ మ్యాన్’
-
గిన్నిస్ రికార్డుకెక్కిన రియల్ లైఫ్ ‘ఐరన్ మ్యాన్’
అచ్చం ఐరన్ మ్యాన్ సినిమాలో హీరోలానే జెట్ సూట్ వేసుకొని గాలిలో ప్రయాణించి బ్రిటిషర్ రిచర్డ్ బ్రౌనింగ్ రియల్ లైఫ్ ‘ఐరన్ మ్యాన్’ అనిపించుకున్నారు. రిచర్డ్ ప్రపంచంలోనే వేగంగే పయనించే రియల్ లైఫ్ ఐనన్ మ్యాన్. జెట్ ఇంజన్ పవర్ సూట్‌తో ఆయన గంటకు 51.53 కిలో మీటర్ల వేగంతో గాలిలో ప్రయాణించి గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కారు. ఈ ప్రయత్నం ఇంగ్లాండ్‌లోని రీడింగ్ సరస్సుపై చేశారు. సినిమాలో లాగే గాల్లో ప్రయాణించేందుకు సహకరించే విధంగా ఆ సూట్లో జెట్ ఇంజన్ ఉంటుంది. రిచర్డ్ బ్రౌనింగ్ చాలా సార్లు విఫలమైనా పట్టు వదలకుండా అనుకున్నది సాధించి రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అనిపించుకున్నాడు. -
అదంతా పటేల్ కృషి వల్లే: ప్రధాని మోదీ
-
ఉక్కు మనిషి కాదు.. మైనపు బొమ్మ
సందర్భం గమనించారా, ప్రధాని నరేం ద్రమోదిలో ఏదో మార్పు కని పిస్తోంది. కొన్ని ఉదాహర ణలు. ఇంతకుముందు ఆయ న విదేశీ గడ్డమీద నిలబడి ప్రతిపక్షాల మీద పదునైన వ్యంగ్యోక్తులు సంధించేవారు. ఇది మనకు కొత్త అనుభవం కనుక, సహజంగానే ఆక్షేప ణలు వెల్లువెత్తాయి. అయినా ఆయన పట్టించుకోలేదు. కానీ, తన తాజా విదేశీ పర్యటనల్లో ఆయన ఇలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. రెండో ఉదాహరణ... పార్లమెంటరీ వ్యవహారాల్లో ప్రతిష్టంభన దృష్ట్యా మోదీ చొరవ తీసుకుని ప్రతిపక్ష నేతలతో ఎందుకు మాట్లాడరన్న విమర్శ చాలా మాసాలుగా ఉన్నప్పటికీ, మోదీ అందుకు సిద్ధపడలేదు. కానీ ఇప్పు డాయన జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో మాట్లాడారు! మూడో ఉదాహరణ మరింత ఆసక్తికరం. గుజరాత్ సీఎంగా ఉన్న పన్నెండేళ్లలోనూ, ప్రధానిగా ఉన్న గత 18 మాసాల్లోనూ మోదీ మీడియాతో దూరం పాటిస్తూ వచ్చారు. ప్రధాని విదేశీ పర్యటనల్లో మీడియా కూడా భాగమయ్యే ఆనవాయితీని మోదీ పాటించక పోవ డమూ, మీడియాకు సమాచారం అందించకుండా ఆయా మంత్రిత్వ శాఖలపై అప్రకటిత నిషేధాన్ని విధిం చారన్న ఆరోపణా మొదట్లోనే చర్చకు వచ్చాయి. అలాం టింది.. ఆయన ఇటీవల మొదటిసారిగా జాతీయ మీడి యాతో సమావేశమై, ఫొటోలు దిగడం ఆశ్చర్యాన్నీ, ఆసక్తినీ కూడా కలిగించింది. ఈ ఉదాహరణలు కొంతవరకూ మోదీని మారిన మనిషిగా చూపిస్త్తున్నాయి. విదేశాలలో ఒక పార్టీ ప్రతి నిధిగా కాక దేశ ప్రతినిధిగా ప్రధాని పాటించవలసిన మర్యాదలను గుర్తించడం; అహం విడిచి ప్రతిపక్ష నేత లతో, మీడియాతో సమావేశం కావడం నిస్సందేహంగా సంతోషించవలసినవే. అయితే, ఇంత వైవిధ్యవంతమైన దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి, కేవలం ఒక్క రాష్ర్టంలోని ఎన్నికల ఫలితాలే గీటురాయిగా తన నడకను మార్చు కున్నట్టు కనిపించడం ఎంతైనా నిరాశ కలిగిస్త్తుంది. తను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, ప్రధానిగా ఉన్న ఈ పదహారు మాసాల్లో కానీ తన ప్రభుత్వంపై వచ్చిన విమర్శలు ఆయనలో మార్పు తీసుకురాలేదు. మతతత్వ పూరితమైన అసహనం పెద్ద ఎత్తున పడగవిప్పి భిన్న భావజాలం కలిగిన వ్యక్తులను కాటేసి చంపుతున్నా ఆయనలో మార్పు కనిపించలేదు. కవులు, రచయితలు, కళాకారులు, చరిత్రకారులు సహా ఎందరో ఈ అసహ నాన్ని ఎత్తి చూపుతూ అవార్డు వాపసీ వంటి తీవ్ర చర్యకు పూనుకున్నా ఆయనలో మార్పు రాలేదు. వారి నిరసనను కృత్రిమ నిర్మాణంగా తీసిపారేస్తూ పార్టీ శ్రేణులు ఈ దేశపు సామూహిక అంతశ్చేతనను మొరటు మాటలతో కుళ్లబొడుస్త్తున్నా ఆయన మాట్లాడలేదు. అలాంటిది, వక్రించిన ఒకే ఒక్క ఎన్నికల ఫలితం ఆయ నలో కలవరపాటు కలిగించి మార్పు తీసుకురావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?! ఇన్నేళ్లుగా అభిమానులకు ఉక్కుమనిషిగా, ఇతరు లకు రాతిబొమ్మగా కనిపించిన నరేంద్రమోదీ గత 18 మాసాల ప్రధాని హోదాలో ఒక మైనపు బొమ్మలా కనిపి స్తున్నారు. మామూలుగా అయితే విమర్శల పిడుగులు పడినా ఆయన చలించరు. కానీ రాజకీయంగా పరిస్థితి తమకు ప్రతికూలంగా ఉందని అనిపించినప్పుడు కాస్త లొంగుబాటు ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు, దాద్రీ హత్య మీద ప్రధాని నోరు విప్పరేమని ప్రతిపక్షాలూ, మీడియా రోజుల తరబడి నిలదీస్తున్నా ఆయన మౌనం పాటించారు. కానీ 15 రోజుల తర్వాత, బిహార్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో పరోక్షంగా దానిని ప్రస్తావించి ఊరు కున్నారు. తన మౌనం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్న భయమే అందుకు కారణం. ఇక్కడ కుంగదీసే విషాదం ఏమిటంటే; ఈ దేశ ప్రధానికి ఎన్నికల విజయాలు తప్ప మరే విలువలూ పట్టవని రోజురోజుకూ రుజువు కావడం. ఈ దేశ మౌలిక స్వభావమూ, తాత్వికతా ఎలాంటివో ప్రధాని అయ్యే దాకా ఆయనకు తెలియకపోవడం. గుజరాత్లో తన ఏకచ్ఛత్రాధిపత్యంలో వైవిధ్యవంతమైన ఈ దేశపు రాజ కీయ వ్యాకరణాన్ని నేర్చుకోవలసిన అవసరం ఆయనకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ అవసరాన్ని గుర్తిస్తున్న అప్రెంటిస్ ప్రధానిగానే ఆయన రూపుగడుతున్నారు. ఇలా ఈ గుజరాత్ ఉక్కు బొమ్మ కాస్తా జాతీయ వేదిక మీదికి వచ్చేసరికి, తప్పనిసరి ఒత్తిడులకు తలవంచే మైనపు బొమ్మ కావడం ఏం చెబుతుంది? అయితే, మోదీ వ్యవహారశైలికి సంబంధించిన వేళ్లు ఆయనను తీర్చిదిద్దిన భావజాలంలో బలంగా నాటుకుని ఉన్నాయి కనుక, ఆయనలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు కేవలం పైపూత కావచ్చు. విశేషమేమిటంటే, ఆయన ఆ పైపూతను ఆశ్రయిం చడంలోనే భారతదేశం మొత్తం గర్వించవలసిన లోతైన అంతస్సత్యం ఉంది. నాకు అరవై మాసాలు అధికారమి వ్వండి, దేశం రూపురేఖలే మార్చేస్తానని మోదీ ఎన్నికల ముందు చెప్పుకున్నారు. కానీ, దేశం తన స్వాభావిక మైన ఉనికిని ఉద్యమస్థాయిలో చాటుకుంటూ, మోదీని మార్చడానికి తనకు 18 మాసాలే చాలని నిరూపించు కుంది. ఆవిధంగా మోదీ పెనుగులాట రాజకీయ ప్రత్యర్థులతో కాదు; భారతదేశం అనే ఒక మౌలిక వాస్తవంతో! 2014 ఎన్నికల్లో మోదీ అద్భుత విజయం సాధించిన మాట నిజమే. కానీ ఇప్పుడు భారతదేశం ప్రతిరోజు, ప్రతి క్షణం మోదీ అనే ఉక్కు బొమ్మను మైనపు ముద్దగా మార్చుతూ తన అఖండ విజయాన్ని అప్రతిహతంగా స్థాపించుకుంటోంది! - కల్లూరి భాస్కరం వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. 9703445985 -
శ్రీకారాలు - శ్రీమిరియాలు
- శ్రీరమణ సూర్యచంద్రులు వంగ సాహిత్యాకాశంలో రవీంద్రుణ్ణి, శరత్‌బాబుని సూర్యచంద్రులుగా అభివర్ణిస్తారు. ఇద్దరూ లబ్ధప్రతిష్టులే. వారిరువురికీ అసంఖ్యాక పాఠకులు, అభిమానులు ఉన్నారు. ఒకసారి కలకత్తాలో (ఇప్పటి కోల్‌కతా) శరత్చంద్రకి, రవీంద్రనాథ్ ఠాగోర్‌కి ఒకే వేదిక మీద సన్మానం ఏర్పాటు చేశారు. సభా నిర్వాహకులు మొదటగా ఠాగోర్‌ని సత్కరించడంతో శరత్ అభిమానులు నొచ్చుకున్నారు. దాన్ని గమనించిన శరత్చంద్ర తన అభిమానులనుద్దేశించి- ‘‘మిత్రులారా! గురుదేవులు నాలాంటి వారికోసం రచనలు చేస్తారు. నేను మీలాంటి సామాన్య పాఠకుల కోసం రాస్తాను. రచయితల రచయితగా ప్రథమ తాంబూలం వారికి దక్కడమే ధర్మం. అందుకే నిర్వాహకులు తొలుత వారిని సత్కరించారు’’ అనడంతో జనం చల్లబడ్డారు. సభ దిగ్విజయంగా జరిగింది. ఇప్పుడైతే?- లాటరీ తీసి, టాస్ వేసి గెలిచిన వారికి ప్రథమ తాంబూలం ఇచ్చేవారు. లేకపోతే జనం ఊరుకున్నా మీడియా ఊరుకోదు. ఎవరు ప్రథమం, ఎవరు అధమం అంటూ ఎస్సెమ్మెస్ పోల్సు, చర్చలు నడిచేవి. మూలాల్లోకి వెళ్ళిపోయి ఈ పాయింటు మీద వంగదేశం బీట వేసేది. వచన కవులు ప్రపంచవ్యాప్తంగా ఎలా అణగదొక్క బడ్డారో తెరమీదకు వచ్చేది. తొలినాళ్ల వంగ వచన కవుల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు జరిగేవి. మిగతావి మీ ఊహకే వదిలేస్తున్నా. తాజావార్త మోదీ ప్రభుత్వం ‘‘స్వచ్ఛభారత్’’ని ప్రతిష్టాత్మకంగా, గాంధీ సాక్షిగా, ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయాలని సంకల్పించింది. వెనకటికి సాయిబాబా ఉత్తరాల్లాగా (ఒక ఉత్తరం అందినవారు దాని నకలుని తిరిగి పదకొండుమందికి రాసి పోస్ట్ చెయ్యాలి. అలా చెయ్యకపోతే అనర్థం వస్తుందని హెచ్చరిక ఉంటుంది. ఈ టైపులో కొన్ని వ్యాపారాలు కూడా నడుస్తాయి) ఇప్పుడు తొమ్మిది మందిని స్వచ్ఛభారత్ దూతలుగా నియమిస్తారు. తిరిగి ఒక్కొక్కరు తొమ్మిది మంది పేరుగల వారిని... అలాగా తొమ్మిదో ఎక్కం నడుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తారని హస్తినలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ శాఖమంత్రిని చెత్తమంత్రిగా కాకుండా స్వచ్ఛమంత్రిగా పిలిచేలాగా జాగ్రత్తపడాలని ఇప్పటికే సూచనలు అందినట్టు వార్త. నిరాశావాది ఈ మెట్రోరైలు అలా పై నుంచి దడదడా వెళ్లిపోతుంటే ఏమి బావుంటుందండీ. ఏదో ఆకాశంలో వెళ్తున్నట్లుంటుంది. పైగా అంత స్పీడుగా వెళ్తుంటే సినిమా పోస్టర్లూ అవీ అలుక్కుపోయినట్లు కనిపిస్తాయి కూడాను! కలర్స్! కలర్స్! ‘‘మేష్టారూ! ఇది సాదావాకర్కి రెట్టింపు - జానీవాకర్ రెడ్ లేబిల్’’ ‘‘తెలుసు... తెలుసు’’ ‘‘ఇది జానీవాకర్ బ్లాక్ లేబిల్ - రెడ్‌కి రెట్టింపు’’ ‘‘చూశాం... చూశాం’’ ‘‘ఇది రెడ్ లేబిల్కి రెట్టింపు - జానీవాకర్ బ్లూ’’ ‘‘విన్నాం... విన్నాం’’ ‘‘ఇది బ్లూ లేబిల్కి రెట్టింపు-....’’ ‘‘చాలు బాబోయ్...! ఇంకా ఎన్నిరంగులు తాగాలో ఏవిటో...’’ ఏం తేడా పడింది? స్వతంత్రం వచ్చిందని తెలిసి ఆబాలగోపాలం తెగ సంబరపడిపోయారు. ‘‘ఇన్నాల్టికి కష్టం ఫలించింది’’ అనుకున్నది బామ్మ. ఆ మర్నాడు గారెలకి పప్పు నానపోయాల్సి వచ్చింది. ఎటూ స్వతంత్రం వచ్చింది కదా, రాత్రే దేనికి పొద్దున్నే నానపోయచ్చులే అంది బామ్మ. అమ్మకేమీ అర్థం కాలేదు. పొద్దున్నే నానపోస్తే అవి సమయానికి నానలేదు. మరి స్వతంత్రం వచ్చిందన్నారు - ఏమి తేడా పడిందని దీర్ఘాలు తీసింది బామ్మ. మూడు వాయలు పప్పు రుబ్బడానికి మూడు గంటలూ పట్టింది. ‘‘స్వతంత్రం వచ్చిందన్నారు కదే’’ అన్ని కళ్లతోనే అడిగింది - ఒక చెయ్యి పొత్రం మీద ఉంచి మరో చేత్తో ఎత్తిపొడుపు ముద్ర పట్టి. అమ్మకేం అర్థం కాలేదు. ‘‘అమ్మాయ్! నూనె కూడా ముందుకులాగే లాగాయి. ఏమీ తగ్గలేదు. తేడా ఏమిటో...’’ బామ్మ సమస్య ఏమిటో అర్థం అయింది గాని అమ్మకి ఎలా సర్దిచెప్పాలో అర్థం కావడం లేదు. సాయంత్రానికి గారెల బుట్ట ఖాళీ అయింది. మునుపు మూడు రోజులు బుట్ట కళకళలాడుతూ ఉండేది. ఇదేవిటో బుట్టెడు గారెలూ మరు పూటకే మాయం అయినాయంటూ బామ్మ బుగ్గలు నొక్కుకుంటుంటే- ‘‘స్వతంత్రం వచ్చింది కదోచ్’’ అంటూ పిల్లలు అడుగూ బొడుగూ కూడా ఖాళీ చేసి పారిపోయారు. బామ్మకి స్వతంత్రం అంటే తినడం అని అర్థమైంది. దండులో మరో వాహనం? ఔను. ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లలో మరో వాహనం అదనంగా చేరబోతోంది. ఇప్పుడున్న తొమ్మిదికి అదనంగా పదోది. ఒకవేళ సంఖ్యాశాస్త్ర ప్రకారం పది సరికాకుంటే పదకొండు బేసికి వెళ్తారు. ఈ కొత్త వాహనంలో టెలిస్కోపులు ధరించిన వాస్తుపండితులు వాస్తుస్కోపుని సదా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్కడ వారికి తేడా వచ్చినా సైరన్ హారన్ మోగిస్తారు. స్పాట్లో వాస్తుదోషాన్ని వివరించి దానికి పరిహారం ప్రాయశ్చిత్తం చెప్పేస్తారు. ఒకసారి హద్దులు చూసుకుని వేటిని ఏ మేరకు కూల్చివేయాలో డిసైడ్ చేస్తారు. న వాస్‌తో న భవిష్యతి అనే సంస్కృత సూక్తిని తెలుగు రాష్ట్రాలు నమ్ముతున్నాయి, కనుక కాన్వాయ్‌లో వాస్తువాహనం తప్పదు. ఉక్కుమనిషి స్వాతంత్య్ర సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఒక పత్రికా విలేకరి వల్లభాయ్ పటేల్‌ని - ‘‘గాంధీజీ ఏ సమస్య వచ్చినా తెగించి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. మీరు ఒక్కసారి కూడా దీక్షకి దిగలేదేమండీ’’ అని అడిగాడు. దానికి ఆ ఉక్కు మనిషి, ‘‘గాంధీజీ కాబట్టి ఎలాగో అలాగ దీక్షని విరమింప చేస్తున్నారు. నేను దిగితే ఆపేవారుండరని నా భయం’’ అని నవ్వుతూ జవాబు ఇచ్చారు. ‘‘మీరింతటి లబ్ధప్రతిష్టులు కదా... ఎక్కడా మీ విగ్రహం పెట్టారు కాదేమండీ’’ అని పటేల్‌ని ఓ పెద్దాయన అడిగారట. ‘‘ఇదే నయం. తీరా పెట్టాక ఎవరీ విగ్రహం అనిపించుకుంటే అస్సలు బాగుండదు కదా అన్నారట’’ చిరునవ్వుతో. పటేల్ మనిషి. మనిషంత మనిషి. ఉక్కు మనిషి. ఇప్పుడాయన విగ్రహం ప్రపంచంలోనే అత్యున్నతంగా, సమైక్యతకు చిహ్నంగా మనజాతి గర్వంగా నిలబడనుంది. ఆ మహామనీషికి జోహార్! ఈ మధ్య కాలంలో సాహిత్యసభలు నిర్వహించే వారికి పరిశ్రమగానూ, హాజరయ్యేవారికి శ్రమగానూ మారాయి. పెళ్లి దాకా వరుడు ఆపైన నరుడు. టీవీలో ప్రోగ్రామ్ బోరుకొడితే - మిక్సీలో కోడిగుడ్డు వేసి ఆన్ చెయ్యండి. జార్ మీద మూత మాత్రం పెట్టకండి. ఇహ తర్వాత చాలా వినోదంగా ఉంటుంది. చిటపటలాడిద్దామంటే నిప్పుండగా ఉప్పుండదు. తీరా ఉప్పు దొరికాక నిప్పు కొడి కడుతుంది. ఎవరికీ పదవీ వ్యామోహం లేదు, అయినా పదవులకు తీవ్ర కొరత దేనికంటే - అదే మరి చమత్కారం! ఆనక కలిసి నడవాలనుకుంటే ముందు వెంటపడక తప్పదు. మంత్రిగారికి పీడకల వచ్చిందట! సొంతకార్లో తిరుగుతున్నట్టు, రెంటు కరెంటు సొంత డబ్బుతో కట్టినట్టు. అదేం చిత్రమోగాని పెళ్లి అయిపోయాక పెళ్లిళ్ల కాలంలో అద్భుతమైన సంబంధాలు కనిపిస్తాయి. సృష్టిలో తీయనిది పొగడ్త! గ్రంథ సమీక్ష పుస్తకం పేరు వచన భారతము. అనేక పాత్రలతో చిక్కని కథావస్తువుతో అలరారుచున్నది. మొదటినుంచీ అన్నదమ్ముల గొడవలు అధికంగా ఉన్నవి. మొత్తం మీద లీగల్ మేటర్స్‌తో నిండివుంది. న్యాయస్థానములో పరిష్కరించుకోలేని కారణంగా చివరకు కొట్లాటకు దారితీసింది. యుద్ధానంతరం కథ సుఖాంతమైంది. ఇది వినదగినదే కాని చదవ తగినదికాదు. సమీక్ష ముగిసినది. -
అప్పుడప్పుడూ అంతే..!
హాలీవుడ్ స్టార్, ఐరన్ వ్యూన్ హీరో రాబర్ట్ డౌనె జూనియుర్... బాలీవుడ్ ఫాలోవర్స్‌కు షాకిచ్చాడు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ ఫొటో ఉన్న ఓ భారత వెబ్సైట్ లింక్‌ను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దానికి లైకూ కొట్టేశాడు. అంతేనా... హీత్ లెడ్జర్, హగ్ జాక్వ్యూన్లతో సన్నీని పోల్చాడు. అరుుతే ఇదంతా రాబర్ట్ పీఆర్ టీమ్ పనంటూ లైట్ తీసుకొంటున్నారు కొందరు. ఏదేమైనా... తవు హీరోను ప్రపంచ ప్రఖ్యాత స్టార్ పొగడటం సన్నీ ఫ్యాన్స్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
ఈ రోబో సూట్ ఉంటే మీరు ఉక్కు మనిషే..!
లండన్: అధునాతనమైన ఈ రోబో సూట్ ఉంటే.. మీరు కూడా హాలివుడ్ సూపర్‌హిట్ సినిమా ‘ఐరన్ మ్యాన్’లో హీరో మాదిరిగా ఒంటి చేతితోనే 50 కిలోల బరువుల్ని అలా పెకైత్తి ఇలా విసిరే యొచ్చు. ఒక్క తన్ను తన్ని.. పదిసార్లు తన్నినంత ఎఫెక్ట్ కలిగించవచ్చు. మనిషికి సూపర్‌మ్యాన్ బలాన్ని అందించగల ‘బాడీ ఎక్స్టెండర్’ అనే ఈ రోబో సూట్‌ను ఇటలీలోని ‘పర్సెప్చువల్ రోబోటిక్స్ లేబోరేటరీ (పెర్క్రో)’ ఇంజనీర్లు రూపొందించారు. ఇలాంటి రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ల(బాహ్య అస్థిపంజరం)ను ఇదివరకే కొందరు తయారు చేసినా.. ఇదే అన్నింటికన్నా అత్యధునాతనమైన ఎక్సోస్కెలిటన్ అంటున్నారు పెర్క్రో ఇంజనీర్లు. దీనిని ధరించినవారు వస్తువులపై ప్రయోగించే బలానికి ఈ రోబో సూట్ పదిరెట్ల బలాన్ని జతచేసి ప్రయోగిస్తుందని వారు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ మోటార్ల సాయంతో పనిచేసే ఈ సూట్ 22 డిగ్రీల కోణంలో సులభంగా తిరుగుతుందని, మనిషి దేహ కదలికలకు అనుగుణంగా ఉండేలా దీనిని అతి సంక్లిష్టతతో నిర్మించారని అంటున్నారు. ఉపయోగాలేంటంటే... భూకంపాల వంటివి సంభవించి భవంతులు కూలాయనుకోండి.. దీనిని ధరించి శిథిలాలను చకాచకా పెకైత్తుతూ క్షతగాత్రులను చాలా త్వరగా, సురక్షితంగా కాపాడొచ్చట. విమానాలు, ఇతర భారీ వాహనాల తయారీ, నిర్మాణాల సందర్భంగా బరువైన వస్తువులను పెకైత్తి చకాచకా అమర్చేయడం.. ఇంకా మరెన్నో ఉపయోగాలుంటాయనీ చెబుతున్నారు. -
పటేల్‌ను ‘మతతత్వవాది’ అన్న నెహ్రూ!
బ్లాగులో అద్వానీ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత మొట్టమొదటి హోం మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు సంబంధించి బీజేపీ మరో వివాదం లేవనెత్తింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. పటేల్‌ను ‘పూర్తి మతతత్వవాది’ అని అన్నారని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తన తాజా బ్లాగ్ పోస్టింగ్‌లో ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకునేందుకు వీలుగా సైన్యాన్ని పంపాలని పటేల్ సూచించిన నేపథ్యంలో నెహ్రూ ఆ విధంగా వ్యాఖ్యానించారని ఎంకేకే నాయర్ రాసిన ఓ పుస్తకాన్ని (ద స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితవుట్ ఇల్ విల్) ఉటంకిస్తూ అద్వానీ పేర్కొన్నారు. హైదరాబాద్‌పై పోలీసు చర్యకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో నెహ్రూ, పటేల్‌ల మధ్య జరిగిన తీవ్ర వాగ్వివాదం వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘దేశ స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌తో కలిసిపోవాలని భావించిన నిజాం ఈ మేరకు పొరుగు దేశానికి రహస్య దూత ఒకర్ని పంపించారు. పెద్దమొత్తంలో డబ్బును కూడా అక్కడి ప్రభుత్వానికి బదలాయించారు. పలువురు నిజాం అధికారులు స్థానిక ప్రజలపై యథేచ్చగా అత్యాచారాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ పటేల్ కేబినెట్ దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌లో భయానక పాలనకు తెరదించేందుకు తక్షణమే అక్కడికి సైన్యాన్ని పంపాలని డిమాండ్ చేశారు. సాధారణంగా మృదుభాషి అయిన నెహ్రూ నిగ్రహాన్ని కోల్పోయారు. ‘‘నువ్వో పూర్తి మతతత్వవాదివి. నేనెప్పుడూ నీ సిఫారసును అంగీకరించను..’’ అని అన్నారు. పటేల్ మరో మాట మాట్లాడకుండా తన కాగితాలు తీసుకుని వెళ్లిపోయారు..’ అని అద్వానీ తెలిపారు. పటేల్‌ను హిందూత్వ భావాలు కలిగిన వ్యక్తిగా తెరపైకి తెచ్చేందుకు ఇటీవల కొంతకాలంగా బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌కు సైన్యాన్ని పంపేలా అప్పటి గవర్నర్ జనరల్ రాజాజీ నెహ్రూను ఒప్పించారని అద్వానీ పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో పరిస్థితి అంతకంతకూ విషమిస్తుండటంతో నెహ్రూ, పటేల్ ఇద్దరినీ రాజాజీ రాష్ట్రపతి భవన్‌కు పిలిపించారు. అప్పటికి రెండ్రోజుల ముందు రజాకార్లు ఓ కాన్వెంట్కు చెందిన 70 ఏళ్ల నన్లపై అత్యాచారానికి తెగబడటాన్ని నిరసిస్తూ బ్రిటిష్ హైకమిషనర్ రాసిన ఓ లేఖను సిద్ధంగా ఉంచుకున్నారు. పటేల్ సన్నిహిత అధికారి వి.పి.మీనన్ ఆ లేఖను కేబినెట్ భేటీకి ముందు రాజాజీకి అందజేశారు. భేటీలో రాజాజీ తనదైన శైలిలో హైదరాబాద్‌లో పరిస్థితిని వర్ణించి చెప్పారు. అయితే నెహ్రూ అంతర్జాతీయంగా ఉత్పన్నమయ్యే ఇబ్బందుల దృష్ట్యా తటపటాయించారు. ఆ సమయంలో రాజాజీ తురుపు ముక్క (లేఖ)ను బయటకు తీశారు. ఆ లేఖను చదివిన నెహ్రూ ముఖం ఎర్రబడింది. కుర్చీలోంచి వేగంగా లేచి పిడికిలి బిగించి బల్లపై కొట్టారు. ‘‘ఇంకో క్షణం కూడా వృధా చేయడానికి వీల్లేదు. వారికి గుణపాఠం చెబుతాం..’’ అని అన్నారు. ఆ వెంటనే రాజాజీ పథకం మేరకు ముందుకువెళ్లాల్సిందిగా కమాండర్ ఇన్ చీఫ్‌కు చెప్పాలని మీనన్‌ను ఆదేశించారు..’ అని నాయర్ పుస్తకాన్ని ఉటంకిస్తూ అద్వానీ తెలిపారు.