వాళ్ల రాతల్లో నేనూ చనిపోయే ఉంటా! | Stan Lee, Chadwick Boseman, Kevin Feige and that iconic back | Sakshi
Sakshi News home page

వాళ్ల రాతల్లో నేనూ చనిపోయే ఉంటా!

Published Sun, Jan 7 2018 11:59 PM | Last Updated on Sun, Jan 7 2018 11:59 PM

Stan Lee, Chadwick Boseman, Kevin Feige and that iconic back - Sakshi

‘‘నాకిప్పుడు 95 ఏళ్లు. నాకేమనిపిస్తోందంటే, రేపు పొద్దున నేను చనిపోతే, వెంటనే పేపర్లలో న్యూస్‌ వేసుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలామంది నేను చనిపోయినట్టు రాసి పెట్టుకొని ఉండొచ్చు. అయితే ఆ రోజు తొందరగా రావొద్దని కోరుకుంటా’’ అని గట్టిగా నవ్వారు స్టాన్లీ. చావు మీద స్టాన్లీ వేసిన జోక్‌ ఇది. డార్క్‌ జోక్‌. స్పైడర్‌మేన్, ఐరన్‌మేన్, ఎక్స్‌మేన్‌.. ఇలా సూపర్‌హిట్‌ మార్వెల్‌ కామిక్స్‌ క్యారెక్టర్స్‌ను సృష్టించిన వారిలో ఒకరైన స్టాన్లీ.. మార్వెల్‌ కామిక్స్‌ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. మొన్న డిసెంబర్‌ 28న తన 95వ పుట్టినరోజు జరుపుకున్న స్టాన్లీ, ఆ సందర్భంగానే పై జోక్‌ పేల్చారు.

ఈ జోక్‌ వెనక ఒక విచిత్రమైన కథ ఉంది. కెరీర్‌ మొదట్లో స్టాన్లీ ఓ ప్రముఖ పత్రికలో పనిచేసేవారట. ఎవరైనా పేరున్న వ్యక్తి చనిపోతే, గంటలోపే మూడు పేజీల మ్యాటర్‌ రెడీ అయి బయటకొచ్చేదట. ఎలా? అని అడిగితే, పోతారనుకున్న వాళ్ల లిస్ట్‌ రెడీ చేస్కోవడం వల్లే అంటారు స్టాన్లీ. ‘‘ఇది ఇప్పటికీ జరుగుతుందని అనుకుంటున్నా. నా గురించి కూడా రాసి పెట్టుకొనే ఉంటారు. సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నేను ఈ స్థాయికి రావడం’’ అన్నారు స్టాన్లీ.. తత్వాన్ని, చమత్కారాన్ని ఒకే మాటలో కలిపేస్తూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement