
వైరల్
స్పైడర్ మ్యాన్ అంటే... పది అంతస్తుల బిల్డింగ్ నుంచి అవలీలగా జంప్ చేసేవాడు. అగ్నిగుండంలో హాయిగా మార్నింగ్ వాక్ చేసేవాడు... టోటల్‌గా చెప్పుకోవాలంటే ‘స్పైడర్ మాన్’ అంటే సాహసాల సాగరం.
‘స్పైడర్ మ్యాన్ అంటే అస్తమానం సాహసాలేనా? ఇలా కూడా’ అని ఒక జైపూర్ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 13 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
‘ఇంతకీ అతడు ఏంచేశాడు?’ అనే విషయానికి వస్తే.... స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకొని చపాతీలు చేశాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. గిన్నెలు శుభ్రం చేశాడు. ఎండలో తల మీద ఇటుకలు మోశాడు. ‘అసలు సిసలు సాహసాలంటే ఇవే’ అన్నారు నెటిజనులు. ‘గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ స్పైడర్–మ్యాన్ సినిమాలలోని ఐకానిక్ డైలాగును ఉటంకించారు.
Comments
Please login to add a commentAdd a comment