chapatis
-
ఈ స్పైడర్ మ్యానుడు చపాతీలు కూడా చేస్తాడు
స్పైడర్ మ్యాన్ అంటే... పది అంతస్తుల బిల్డింగ్ నుంచి అవలీలగా జంప్ చేసేవాడు. అగ్నిగుండంలో హాయిగా మార్నింగ్ వాక్ చేసేవాడు... టోటల్‌గా చెప్పుకోవాలంటే ‘స్పైడర్ మాన్’ అంటే సాహసాల సాగరం.‘స్పైడర్ మ్యాన్ అంటే అస్తమానం సాహసాలేనా? ఇలా కూడా’ అని ఒక జైపూర్ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘ఇంతకీ అతడు ఏంచేశాడు?’ అనే విషయానికి వస్తే.... స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకొని చపాతీలు చేశాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. గిన్నెలు శుభ్రం చేశాడు. ఎండలో తల మీద ఇటుకలు మోశాడు. ‘అసలు సిసలు సాహసాలంటే ఇవే’ అన్నారు నెటిజనులు. ‘గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ స్పైడర్–మ్యాన్ సినిమాలలోని ఐకానిక్ డైలాగును ఉటంకించారు. -
రోటీశ్వరి
సక్సెస్ స్టోరీలన్నీ కష్టాల నుంచే మొదలవ్వవు. మంచి ఆలోచనల నుంచి కూడా అవి ‘తయారవుతాయి’. శశిరేఖకు మొదట వచ్చిన ఆలోచన.. ఇంటి పనిలో దొరికించుకున్న ఖాళీ సమయంలో తనేదైనా పని చెయ్యాలని. రెండో ఆలోచన.. తను పని చేస్తూ, కొంతమందికి పని కల్పించాలని. అలా మొదలైందే.. జీవీఎస్ ఫుడ్స్. రెడీమేడ్ రొట్టెలతో అమ్మకాలను మించిన నమ్మకాన్ని పొందుతున్న శశిరేఖను రోటీశ్వరి అనడమే ఆమె విజయానికి సరైన పోలిక. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటారు శశిరేఖ. గృహిణి. భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు.. ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు భార్యాభర్తల మాటల్లోకి చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు వచ్చాయి. ‘‘అవును, ఇప్పుడంతా ఉదయం పూట టిఫిన్‌గా, రాత్రి భోజనానికి బదులుగా అవే తింటున్నారు’’ అని భార్య అంటే.. బయట మార్కెట్లో కూడా బాగా గిరాకీ కనిపిస్తోంది’’ అని భర్త అన్నాడు. అప్పుడొచ్చింది శశిరేఖకు ఆలోచన. తను కూడా చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు చేసి అమ్మితే?! అయితే అప్పటికప్పుడు వాటిని తయారు చేసి అమ్మడం కాకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినేందుకు వీలుగా ప్యాక్ చేసి మార్కెట్‌కు వెయ్యడం కరెక్ట్ అనిపించింది ఆమెకు. భర్త బాలరాజుకూ ఆ ఆలోచన నచ్చింది. ఆవిర్భావం! భర్త ఓకే అన్నాడు. కావలసిన సామగ్రి తెచ్చిపెట్టాడు. తయారీకి ఐదుగురు మహిళల్ని తీసుకున్నారు. కొద్దిపాటి వ్యాపారమే. మెల్లిగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక చేతులు సరిపోవడం లేదు. యంత్రాలు కావలసిందే. ఉన్నవి అమ్ముకుని కొంత, బ్యాంక్ లోను కొంత కలిపి యాభై లక్షల రూపాయలతో కోయంబత్తూర్ నుంచి ఆటోమేటిక్ అన్కుక్డ్ మెషిన్లు రెండింటిని తెప్పించారు. ఇంటినే కర్మాగారంగా మార్చేశారు. ఒక్కో మిషన్‌పై గంటకు 500 చపాతీలు తయారవుతాయి. రెండు మెషీన్ల నుంచి వెయ్యి చపాతీలను గంటలోనే తయారు చేస్తారు. పిండి కలపడం, ముద్దలుగా చేయడం, ప్రెస్ చేయడం, మిషనరీపై నుంచి తయారైన వాటిని ప్యాక్ చేసేయడం. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరలకే ఇస్తుండడంతో డిమాండ్ కూడా బాగా పెరిగింది. రెడీమేడ్‌గా తయారు చేసిన ఈ చపాతీలు, జొన్నరొట్టెలను పొయ్యిపై పెనం పెట్టి కొంచెం వేడి చేసుకుంటే చాలు. కమ్మగా తినచ్చు. ప్యాకింగులో వారం రోజులు నిల్వ ఉంటాయి. తల్లి మనసు ‘‘మేలు రకం గోధుమపిండి, వంటనూనె, మినరల్ వాటర్‌ను వీటి తయారీకి ఉపయోగిస్తాం. నాణ్యత, స్వచ్ఛతే మా వ్యాపారాభివృద్ధికి మార్గమైంది’’ అంటారు శశిరేఖ. ‘‘మా రెడీమేడ్ చపాతీలను, జొన్నరొట్టెలను గృహిణులు ఇంట్లో చేసి, స్కూలుకు వెళ్లే చిన్నారులకు సైతం టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తున్నారు. పిల్లలు ఎంతో ఇష్టంతో తింటున్నారు’’ అని సంతోషంగా చెబుతున్నప్పుడు శశిరేఖలో మనకు వ్యాపారవేత్త కన్నా, తల్లి మనసే కనిపిస్తుంది! ‘‘బీపీ, షుగర్, ౖథైరాయిడ్, ఒబేసిటీ ఉన్నవారు చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెలు తినడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. దాంతో ఇటు చిన్నారుల నుంచే కాకుండా పెద్దల నుంచి కూడా మా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని’’అంటారు శశిరేఖ. ఇతర రాష్ట్రాల నుంచీ..! రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుంటాయి. ‘‘హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, దాబాలు, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు పెరిగాయి. అంతేకాకుండా అమెరికాకు వెళ్లే మన తెలుగు వారికి ఇక్కడినుంచి చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెల పార్సిళ్లు పంపుతున్నాం’’ అని చెప్పారు శశిరేఖ. – మొలుగూరి స్వర్ణలత, సాక్షి, హైదరాబాద్ -
చిటికెలో చపాతీలు రెడీ
కొత్తకొత్తగా చపాతీలు తయారు చేయడానికి ఏం చేస్తారు చెప్పండి.. ముందుగా పొడిపిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దగా చేసుకుంటాం. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పీటపై చపాతీ కర్రతో వాటిని పల్చగా ఒత్తుకుంటాం. ఆపైన స్టౌపై పెనం పెట్టి, కొద్దిగా నూనెను వేసుకుంటూ కాల్చుకుంటాం.. అవునా..! ఇదంతా చేయడానికి మనకు అరగంటకు తగ్గకుండా సమయం కావాల్సిందే. కానీ, ఈ పనులన్నీ నేను నిమిషాల్లో చేసేస్తానంటోంది ‘రోటీమేటిక్’. పక్కన ఫొటోలో కనిపిస్తున్నదే ఈ రోటీమేటిక్... ఈ మిషన్కి పైన కనిపిస్తున్న మూడు అరల్లో పొడిపిండి, నూనె, నీళ్లు పోయాలి. తర్వాత మిషన్‌ను ఆన్ చేయాలి. అంతే ఒకేసారి 15 చపాతీలను తయారుగల సామర్థ్యం దీనికుంది. ఈ రోటీమేటిక్ను శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులువు.. ఎందుకంటే దీని భాగాలను విడివిడిగా తీసి శుభ్రం చేసి మళ్లీ అమర్చుకోవచ్చు. ఇదింత చక్కగా మన శ్రమను తగ్గిస్తుంటే.. దీన్ని ఎవరైనా ఎందుకు ఇష్టపడరు చెప్పండి.. -
ఇంటిప్స్
బాదం పప్పుల మీదున్న పొట్టు సులువుగా రావాలంటే వేడినీళ్లలో 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. మజ్జిగలో నీళ్లు ఎక్కువైతే కొద్దిగా శనగపిండి కలపాలి. రాగి పాత్రల మీద కొద్దిగా నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి. డబ్బా అడుగున బ్లాటింగ్ పేపర్‌ను ఉంచి, బిస్కెట్లు ఉంచితే మెత్తబడవు. కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి. చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో పిండి కలపాలి. చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ పంచదార వేసి కలిపి, చేస్తే చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి. బంగాళదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేప ఆకులు వేసి ఉంచాలి. ఎండుమిరపకాయల్లో ఉప్పు, కొద్దిగా వంట నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి. -
ఏపీలో రూపాయికి ఇడ్లీ.. రూ.5కి భోజనం
* ఏపీ పురపాలక మంత్రి నారాయణ * నవంబర్‌లో అన్న క్యాంటీన్లు ప్రారంభం * మధ్యాహ్నం సాంబార్ అన్నం/పులిహోర/పెరుగన్నం * రాత్రి భోజనంలో రెండు చపాతీలునాలుగు నగరాల్లో 35 క్యాంటీన్లు సాక్షి, హైదరాబాద్: అన్న క్యాంటీన్లను నవంబర్ నుంచి ప్రారంభించి రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు రెండు చపాతీలు ప్రజలకు అందచేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూట్లా అన్న క్యాంటీన్లలో ఆహారం లభ్యమవుతుందని చెప్పారు. శనివారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష అనంతరం మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్న క్యాంటీన్లను నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు. ఉదయం పూట ఒక ఇడ్లీ(65 గ్రాములు), సాం బార్ కలిపి ఒక రూపాయికి ఇస్తామన్నారు. మధ్యాహ్నం భోజనంలో సాంబార్ అన్నం (350 గ్రాములు) లేదా పులిహోర లేదా పెరుగన్నం రూ.5కే ఇస్తామన్నారు.రాత్రిపూట కూరతో కలిపి రెండు చపాతీలను రూ.5కే ఇస్తామన్నారు. రాగి సంకటి సరఫరా చేయూలని అనంతపురం జిల్లా ప్రజలు కోరినందున దీన్ని కూడా మెనూలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తొలి విడతలో విశాఖలో 15, గుంటూరులో 10, తిరుపతిలో 5, అనంతపురంలో 5 క్యాంటీన్లు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరిస్తామన్నారు. అక్టోబర్ 2నుంచి ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపా రు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 2 యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యమని చెప్పారు. పౌర సేవలకు కొత్త సాఫ్ట్వేర్ మున్సిపాలిటీలలో జనన ధ్రువీకరణ పత్రాల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకూ ఇంట్లో కూర్చునే దరఖాస్తు చేసుకునేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల లేదా రెణ్నెల్లలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల నుంచి 540 ఫిర్యాదులు అందగా 48 గంటల్లో 390 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. పురపాలకశాఖ పరిధిలోని సమస్యలపై ఫొటో తీసి ఛిఛీఝ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు పంపితే స్పందిస్తామన్నారు. పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని సమకూర్చుకుంటామన్నారు. అనధికారిక నీటి కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించటం తదితర చర్యల ద్వారా ఆదాయూన్ని సమకూర్చుకుంటామని తెలిపారు.