చిటికెలో చపాతీలు రెడీ
కొత్తకొత్తగా
చపాతీలు తయారు చేయడానికి ఏం చేస్తారు చెప్పండి.. ముందుగా పొడిపిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దగా చేసుకుంటాం. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పీటపై చపాతీ కర్రతో వాటిని పల్చగా ఒత్తుకుంటాం. ఆపైన స్టౌపై పెనం పెట్టి, కొద్దిగా నూనెను వేసుకుంటూ కాల్చుకుంటాం.. అవునా..! ఇదంతా చేయడానికి మనకు అరగంటకు తగ్గకుండా సమయం కావాల్సిందే. కానీ, ఈ పనులన్నీ నేను నిమిషాల్లో చేసేస్తానంటోంది ‘రోటీమేటిక్’. పక్కన ఫొటోలో కనిపిస్తున్నదే ఈ రోటీమేటిక్...
ఈ మిషన్‌కి పైన కనిపిస్తున్న మూడు అరల్లో పొడిపిండి, నూనె, నీళ్లు పోయాలి. తర్వాత మిషన్‌ను ఆన్ చేయాలి. అంతే ఒకేసారి 15 చపాతీలను తయారుగల సామర్థ్యం దీనికుంది. ఈ రోటీమేటిక్‌ను శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులువు.. ఎందుకంటే దీని భాగాలను విడివిడిగా తీసి శుభ్రం చేసి మళ్లీ అమర్చుకోవచ్చు. ఇదింత చక్కగా మన శ్రమను తగ్గిస్తుంటే.. దీన్ని ఎవరైనా ఎందుకు ఇష్టపడరు చెప్పండి..