spiderman
-
ఈ స్పైడర్ మ్యానుడు చపాతీలు కూడా చేస్తాడు
స్పైడర్ మ్యాన్ అంటే... పది అంతస్తుల బిల్డింగ్ నుంచి అవలీలగా జంప్ చేసేవాడు. అగ్నిగుండంలో హాయిగా మార్నింగ్ వాక్ చేసేవాడు... టోటల్‌గా చెప్పుకోవాలంటే ‘స్పైడర్ మాన్’ అంటే సాహసాల సాగరం.‘స్పైడర్ మ్యాన్ అంటే అస్తమానం సాహసాలేనా? ఇలా కూడా’ అని ఒక జైపూర్ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘ఇంతకీ అతడు ఏంచేశాడు?’ అనే విషయానికి వస్తే.... స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకొని చపాతీలు చేశాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. గిన్నెలు శుభ్రం చేశాడు. ఎండలో తల మీద ఇటుకలు మోశాడు. ‘అసలు సిసలు సాహసాలంటే ఇవే’ అన్నారు నెటిజనులు. ‘గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ స్పైడర్–మ్యాన్ సినిమాలలోని ఐకానిక్ డైలాగును ఉటంకించారు. -
మళ్లీ స్పైడర్‌మేన్ వస్తున్నాడు
హాలీవుడ్ సూపర్‌హిట్ సూపర్ హీరో ‘స్పైడర్ మేన్’ మళ్లీ థియేటర్స్‌కు వస్తున్నాడు. స్పైడర్‌మేన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ ఎనిమిది సినిమాలు వచ్చాయి. ‘స్పైడర్‌మేన్’ (2002), ‘స్పైడర్‌మేన్ 2’ (2004), ‘స్పైడర్‌మేన్ 3’ (2007), ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్’ (2007), ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్ 2’ (2014), ‘స్పైడర్‌మేన్: హోమ్ కమింగ్’ (2017), ‘స్పైడర్‌మేన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ (2019), ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ (2021)... ఈ 8 చిత్రాలూ రీ రిలీజ్ కానున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కొలంబియా పిక్చర్స్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్పైడర్‌మేన్’ ఫ్రాంచైజీ సినిమాలను రీ రీలీజ్ చేస్తోందని హాలీవుడ్ సమాచారం. ఈ 8 సినిమాలకు సంబంధించి ఓ కామన్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాలు కూడా ఏప్రిల్ 15 నుంచి వారానికి ఒక్కొక్కటి చొప్పున జూన్ 3 వరకు విడుదలవుతాయి. ప్రతి చిత్రం కూడా సోమవారమే రీ –రిలీజ్ కానుండటం విశేషం. ఎంపిక చేసిన థియేటర్స్‌లోనే ఈ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. -
స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు..
న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. This is actually disgusting… I hope there were consequences for what they did to that poor boy pic.twitter.com/vQ2hHEDcU4 — FadeHubb (@FadeHubb) July 1, 2023 స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు. ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు. అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన.. -
ఒక పుస్తకంలోని పేజీ ఏకంగా రూ.24 కోట్లకు అమ్ముడు పోయింది!!
ఇంతవరకు ప్రముఖులు, సెలబ్రిటీలు వాడిన వస్తువులు వేలంలో అధిక ధర పలుకుతాయని మనకు తెలుసు. ఇంకొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తుల వస్తువులను పిచ్చి వ్యామోహంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనడం చూశాం. అంతేందుకు ప్రముఖుల నవలలు, పుస్తకాలు కూడా అత్యధిక ధరకు అమ్ముడవడం కూడా చూశాం. పుస్తకంలోని ఒక పేజీ కోట్లలో అమ్ముడవడం గురించి తెలుసా మీకు!. అసలు విషయంలోకెళ్తే...1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పేజీ వేలంలో రూ. 24 కోట్లకు అమ్ముడుపోయింది. స్పైడర్ మ్యాన్ 1962 నాటి ప్రచురణతో కామిక్ పుస్తక చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోల పాత్రలో ఒకటి. కామిక్ పుస్తకాల సుప్రసిద్ధ రచయితలైన స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్ర దశాబ్దాలుగా ఇది అందరీ ఇంటి పేరుగా మారిపోయింది. అంతేకాదు చలన చిత్రాలు, వెబ్‌సీరీస్, యానిమేటెడ్ చిత్రాల వరకు ఈ స్పైడరమేన్ పాత్ర విస్తరిస్తూనే ఉంది. ఇటీవల డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ హిట్ అయిన విధానాన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది ఆ పాత్రకు ఉన్న ఆదరణ. అంతేగాదు కోవిడ్-19 ఆంక్షల మధ్య అభిమానులు టిక్కెట్లు కొనుక్కొని థియేటర్లలో సినిమా చూసేందుకు ఎగబడ్డారు. పైగా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడూ 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకంలోని 25వ పేజీ వేలంలో ఇంత ధర పలకడంతో ఆ పాత్రకు ఉన్న ప్రజాదారణ మరోసారి తేటతెల్లం అయ్యింది. (చదవండి: ఆ చిన్నారి బరువుని చూసి డాక్టర్లే ఆశ్యర్యపోతున్నారు!..రక్త పరీక్షలు కూడా నిర్వహించలేరట !) -
పోలీస్ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు
న్యూఢిల్లీ: స్పైడర్‌మ్యాన్ సినిమాలు అంటే పిల్లలు, పెద్దలకు ఎంతో ఆసక్తి. పెద్ద పెద్ద భవంతులను సైతం అలవోకగా ఎక్కుతూ.. ప్రమాదాల నుంచి జనాలను కాపాడుతూ అందరి ప్రశంసలు పొందుతాడు స్పైడర్‌మ్యాన్. సినిమాలో అంటే ఏ వేషాలైన వేయగల్గుతాం. కానీ రియాలిటీలో మాత్రం ఇలా బిల్డింగ్‌ల మీదకు ఎక్కడం సాహసంగానే చెప్పవచ్చు. ఇలాంటి సాహసాన్ని నిజం చేసి చూపించాడు ఓ పోలీసు అధికారులు. ప్రస్తుతం అతడి సాహసానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రియల్ స్పైడర్‌మ్యాన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. దక్షిణ ఢిల్లీ గ్రేటర్ కైలాష్-1 ఏరియాలోని ఓ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో శుక్రవారం ఉదయం 6.55 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఇద్దరు పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. ఇక బిల్డింగ్ లోపల ఉన్న వారిని బయటకు తరలించారు. కానీ ముగ్గురు మనుషులు లోపల చిక్కుకుపోయారు. వారు బయటికి రావడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఇక వీరిలో ఓ అధికారి బిల్డింగ్ ఇనుప గ్రిల్ సాయంతో లోపలికి చేరుకున్నాడు. అక్కడ చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు. ఇలా కాపాడిన వారిలో 87 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. ప్రాణాలు తెగించి మరి జనాలను కాపాడిన ఆ పోలీసు అధికారి సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రియల్ స్పైడర్‌మ్యాన్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: సంగారెడ్డి: బొలెరో డ్రైవర్‌పై.. పోలీసుల ఓవరాక్షన్ -
స్పైడర్మాన్ అంటూ రిషభ్ పాట.. వైరల్
బ్రిస్బేన్: గత సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్, రిషభ్ పంత్ మధ్య జరిగిన ‘బేబీ సిట్టర్’ సంభాషణపై ఆసక్తికర చర్చ సాగింది. తాజా సిరీస్‌లో గత మూడు టెస్టుల్లోనూ పైన్‌తో పంత్ పెద్దగా పెట్టుకున్నట్లు కనిపించలేదు. కానీ చివరి పంచ్ అనుకున్నాడేమో సోమవారం పైన్‌ను ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. స్మిత్ అవుటై కెప్టెన్ క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పంత్... ‘స్పైడర్మాన్, స్పైడర్మాన్’ అంటూ పాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా అదే సినిమా హిందీ డబ్బింగ్ పాటను కొనసాగిస్తున్నట్లు నా మనసు నువ్వే దోచుకున్నావంటూ ‘తూనే చురాయా మేరా దిల్ కా చైన్’ అంటూ పాటను పాడటం భారత బృందంలో నవ్వులు పుట్టించింది. కాగా, రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించడంతో బ్రిస్బేన్ టెస్టులో భారత్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. దాంతోపాటు 2-1 తో బోర్డర్ గావస్కర్ ట్రోఫిని వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. 21 వికెట్లు ఖాతాలో వేసుకున్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక సోమవారం నాటి ఆటలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో రిషభ్‌పంత్ సాగించిన ‘స్పైడర్ మాన్’ పాటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. (చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్) రోహిత్... స్మిత్‌లా: సిడ్నీ టెస్టులో పంత్ బ్యాటింగ్ గార్డ్ చెరిపేసే ప్రయత్నం స్మిత్ చేసినట్లు వార్తలు రావడం, తాను షాడో ప్రాక్టీస్ మాత్రమే చేసినట్లు స్మిత్ చెప్పడం తెలిసిందే. ఇప్పుడు రోహిత్ శర్మ ఇలాగే తన చేతలతో స్మిత్‌ను కాస్త ఉడికించే ప్రయత్నం చేశాడు. స్మిత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో అతని ఎదురుగా రోహిత్ పిచ్ పైకి వెళ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి చూపించాడు! నువ్వు చేసింది ఇదేనా అనే అనే భావం అందులో కనిపించింది. (చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే!) Rishab pant singing from behind the stumps "Spiderman Spiderman Tune churaya mera dil ka chain 🤣🤣😍😍 What a entertainer he is 🤣😍@RishabhPant17 pic.twitter.com/mnKpVSKstT — AVinash_RAo (@Avinash21181121) January 18, 2021 Rohit doing a Steve Smith 😛😂😂@ImRo45#INDvsAUSTest #IndiavsAustralia #AUSvsIND #RohitSharma pic.twitter.com/W1t1GiyCLG — D s 45 (@imDs45) January 18, 2021 -
కరోనా : రంగంలోకి దిగిన స్పైడర్ మ్యాన్!
అంకారా : కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవటానికి మార్వెల్ సూపర్ హీరో రంగంలోకి దిగాడు. భవంతుల మీద గెంతులేయకుండా, కంటికి కనిపించని శత్రువుతో పోరాడకుండా తన వంతు సహాయం చేస్తున్నాడు. అతీత శక్తుల్లేని ఈ సూపర్ హీరో నేల మీద నడుస్తూ తన చుట్ట పక్కల ఇళ్ల వారికి అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన బురఖ్ సోయ్లు స్పైడర్ మ్యాన్‌లా డ్రెస్ వేసుకుని లాక్డౌన్ కారణంగా ఇళ్లనుంచి బయటకు కదలలేక ఇబ్బంది పడుతున్న పొరిగిళ్ల ముసలి వారికి సహాయం చేయటం మొదలుపెట్టాడు. ( గ్లోబల్ విలేజ్‌కు మహమ్మారి తూట్లు.. ) నిత్యావసరాలను కొని వారి ఇళ్ల దగ్గరకు చేరుస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అతన్ని అడిగినపుడు ‘‘ పొరిగింటి వారికి సహాయం చేయటమే నాకున్న అద్భుత శక్తి’’ అని అన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఈ స్పైడర్ మ్యాన్‌ను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. అద్భుత శక్తుల్లేని సూపర్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. ( సిగరెట్‌తో రాకెట్ల లాంచింగ్.. ) -
అరె.. స్పెడర్ మ్యాన్‌ను మించిపోయాడుగా!
-
అరె.. స్పెడర్ మ్యాన్‌ను మించిపోయాడుగా
బార్సీలోనా : బార్సీలోనా నగరంలో ఒక వ్యక్తి అచ్చం స్పైడర్ మ్యాన్‌ను తలపించేలా 145 మీటర్ల (475 అడుగులు) ఎత్తులో ఉన్న భవనాన్ని కేవలం 25 నిమిషాల్లోనే అవలీలగా ఎక్కేశాడు.చూసినవారంతా అతని సాహసానికి మెచ్చుకోవడం జరిగింది. అయితే ఇదంతా సినిమా షూటింగ్ అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. ప్రసుత్తం కరోనా వైరస్ ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కంటే అది ఎక్కడ వస్తుందేమోనన్న భయమే జనాల్లో ఎక్కువయిపోయింది. జనాల్లో ఆ భయాన్ని వదిలించాలంటే ఏదైనా సాహసం చేయాలని బార్సిలోనాకు చెందిన 57 ఏళ్ల అలేన్ రాబర్ట్ అనుకున్నాడు. అందుకు స్పెడర్ మ్యాన్‌లాగా ఎత్తైన భవనాన్ని ఎక్కి ప్రజల్లో భయాన్ని వదిలించాలని భావించాడు. అందుకు బార్సీలోనాలో దాదాపు 475 అడుగుల ఎత్తులో ఉన్న టోర్ అగ్బర్ ఆఫీస్ భవనాన్ని ఎంచుకున్నాడు. అందరూ చూస్తుండగానే భవనం మొత్తం ఎక్కడానికి 25 నిమిషాలు, మళ్లీ కిందకు దిగడానికి 23 నిమిషాలు తీసుకున్నాడు. అతని సాహసాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ.. భయం అనేది లేకుండా ఎలా ఎక్కుతున్నాడని తదేకంగా చూస్తు ఉండిపోయారు. రాబర్ట్ కిందకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్టు చేసినా అతని సాహసాన్ని మాత్రం అందరూ మెచ్చుకున్నారు.(ఆ ఇద్దరికి కరోనా లేదు : మంత్రి ఈటల) ఇదే విషయమై అలేన్ రాబర్ట్ మాట్లాడుతూ.. 'ప్రసుత్తం ప్రజలందరూ కరోనా వైరస్‌ను ఒక భూతంలా చూస్తున్నారు. దాదాపు 300 కోట్ల మంది కరోనా వైరస్‌కు భయపడుతున్నారు. నా దృష్టిలో కరోనా అనేది వారికి భయం రూపంలో కనిపిస్తుంది. వారి భయాన్ని కొంతైనా పోగొట్టాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. నిజానికి నాకు ఆ భవనాన్ని ఎక్కేటప్పుడు చాలా భయమనిపించింది. కానీ నేను ముందు భయాన్ని వదిలేసాను.. దాంతో నాకు భవనం ఎక్కడం పెద్ద కష్టమనిపించలేదు. ఇప్పుడు కరోనా పట్ల కూడా ప్రజలు అలానే ఉన్నారు. వారిలో భయాన్ని పోగొట్టాలనేది నా ద్యేయం.. ' అని చెప్పుకొచ్చాడు. (కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’) అలేన్ రాబర్ట్ అంత ఎత్తున్న భవనాలను ఎక్కేందుకు చేతిలో చాక్ పౌడర్, క్లైంబింగ్ షూస్ మాత్రమే వాడుతుంటాడు. ఇప్పటివరకు రాబర్ట్ అలేన్ 100 రకాల ఎత్తైన బిల్డింగ్‌లను అవలీలగా ఎక్కేశాడు. అందులో దుబాయ్‌లోని బూర్జు ఖలీఫా, మలేషియాలోని పెట్రోనాస్ ట్విన్ టవర్స్, సిడ్నీ ఒపెరా హౌస్ వంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3200 మంది కరోనా బారీన పడి మృతి చెందగా, 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. -
అనాధ పిల్లల కోసం స్పైడర్ మ్యాన్ షో
-
సూపర్ హీరోల సృష్టికర్త మృతి
ప్రపంచ వినోద రంగానికి స్పైడర్ మేన్, బ్లాక్ పాంతర్, ఐరన్ మేన్, ఎక్స్‌మేన్ లాంటి సూపర్‌హీరోలను అందించిన ప్రముఖ రచయిత స్టాన్లీ సోమవారం కన్నుమూశారు. మార్వెల్ కామిక్స్‌కు గాడ్‌ఫాదర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్లీ 1922 డిసెంబర్ 22న జన్మించారు. లీ తండ్రి ఎక్కువగా అడ్వంచర్ నవలలను చదివారు. ఆ ప్రభావమే లీని రచయితగా మార్చింది. డిగ్రీపూర్తి చేసిన తరువాత పలు నాటకాలను స్వయంగా రాసి, నటించారు కూడా. 1939లో మార్వెల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన లీ, రెండేళ్ల తరువాత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కెప్టెన్ అమెరికా పాత్ర కోసం ఓ కథను రెడీ చేశారు. తరువాత అదే కంపెనీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎడిటర్ స్థాయిలో దశాబ్దాల పాటు సేవలందించారు. 1961లో తొలిసారిగా ఫెంటాస్టిక్ ఫోర్ పేరుతో సూపర్‌హీరో టీంను సృష్టించిన లీ.. 2002లో తన ఆత్మకథను ‘ఎక్సెల్షియర్! ద అమేజింగ్ లైఫ్ ఆఫ్ స్టాన్ లీ’ పేరుతో విడుదల చేశారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు. -
స్పైడర్‌మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు కలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘హాలీవుడ్‌కు స్పైడర్ మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు ఉంటే కేరళ వాసులకు వీరందరు కలిసిన ఫిషర్మెన్’ ఉన్నారన్న కొటేషన్‌తో కేరళ వరద ప్రాంతాల్లో మత్స్యకారులు లేదా జాలర్లు అందించిన సేవలను సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వారి సహాయక చర్యలు అమోఘమని చెప్పడానికి పడవ పక్కన ఎర్రటి వర్షపు కోటును ధరించి కుడి చేతిలో భారీ తెడ్డును పట్టుకొని ఠీవీగా నిలబడిన మత్స్యకారుడి ఫొటోను కొటేషన్ కింద పొందుపర్చారు. ఇక పక్క పడవలో కేరళ రాష్ట్ర నమూనాను చూపించారు. సమాజంలోని విద్యార్థులు, వృత్తినిపుణులు, నావికులు, సాయుధ దళాల సిబ్బంది కుల, మత భేదాలు లేకుండా నిస్వార్ధంగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పుడు ఒక్క మత్స్యకారుల సేవలనే కొనియాడడం సమంజసం కాదని కొందరికైనా అనిపించవచ్చు. కానీ కేరళ వాసుల్లో సామాజికంగా బాగా వెనకబడిన అట్టడుగు వర్గాల వారు మత్స్యకారులు. మనష్యులకు దూరంగా బతికే సముద్రపు అల్లకల్లోల ప్రపంచం వారిది. ఏ పూటకాపూట వెతుక్కునే జీవితాలు వారివి. ఇతర మానవ సమాజంతో వారు కలిసేదే బహు తక్కువ. చేపల వేట నుంచి రాగానే వారు తెగిన వలల పోగులను అల్లుకొనో దెబ్బతిన్న పడవల మరమ్మతు చేసుకొనో మళ్లీ రేపటి వేటకు సిద్ధమవుతారు. రాత్రికి ఇంత తిని పడుకుంటారు. వారికి పక్కా ఇళ్లుగానీ, ఇళ్ల పట్టాలుగానీ ఏ ప్రభుత్వం ఏనాడు కల్పించలేదు. వారు ఏనాడు డిమాండ్ చేయనూ లేదు. అలాంటి వారు నిస్వార్థంగా సేవలందించడం ఎప్పటికీ ఎనలేనిదే. ముఖ్యంగా పట్టణం తిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో వారు అందించిన సేవలు అమోఘం. దాదాపు వెయ్యి మంది జాలర్లు, ఐదు వందల బోట్లతో, సొంత డబ్బుతో ఇంధనం కొని సేవలు అందించడం మామూలు విషయం కాదు. కాకపోతే సముద్రపు అలల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో బోట్లను నడిపిన అనుభవం వారికి సహాయక చర్యల్లో ఎంతో ఉపయోగపడింది. ఒక్క అలప్పూజా ప్రాంతంలోనే వారు 16000 మంది ప్రజల ప్రాణాలను రక్షించారని ఆ జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘అరే సరిగ్గా చదువుకోకపోతే మత్స్యకారుడివి తప్పా మరేమి కావంటూ మా ట్యూషన్ మాస్టర్ తిట్టినప్పుడు నిజంగా బాధ పడేవాడిని. నిజంగా నేడు వారిని చూస్తే గర్వంగా ఉంది. నీట మునిగిన ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ నుంచి నా సోదరిని రక్షించి తీసుకొచ్చారు. అందుకు ప్రతిఫలంగా తీసుకోవాల్సిందిగా ఓ నోట్ల కట్టను అందజేసినా, తమరు తమకు సోదరి లాంటి వారేనంటూ డబ్బును తిరస్కరించినట్లు నా సోదరి ఏడుస్తూ చెప్పడం నాకు ఏడుపు తెప్పించింది’ ఒకరు వాట్సాప్‌లో సందేశం పెట్టారు. ఇలాంటి సందేశాలు మరెన్నో! వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలతో మత్స్యకారుల పాత్ర ముగిసింది. ఇందులో వారు పలువురు గాయపడ్డారు. కొందరి బోట్లు కూడా దెబ్బతిన్నాయి. కేరళ పునర్నిర్మాణంలో వారి పాత్ర ఎలాగు ఉండదు. త్వరలోనే వారిని ప్రజలు మరచిపోవచ్చు. నేడు మత్స్యకారుల సేవలను కొనియాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు. భారీ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. రాజకీయావసారాల కోసం మాట్లాడడం ఆ తర్వాత మరచిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. కానీ ప్రజలు అలా వారి సేవలను మరచిపోరాదు. తమ ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను తర్వాతనైనా గుర్తించి అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి గతేడాది వచ్చిన ‘ఓఖీ’ తుపానులో ఈ నాటి వరదల కన్నా ఎక్కువ మంది మత్స్యకారులు మరణించారు. వారి పాకలు కొట్టుకుపోయాయి. వారికి అందిన సహాయం అంతంత మాత్రమే. వారిది రోజూ చస్తూ బతికే జీవితమే. అధికారిక లెక్కల ప్రకారమే చేపల వేటకు వెళ్లన మత్స్యకారుల్లో నాలుగు రోజులకు ఒకరు చొప్పున మరణిస్తున్నారట. ప్రజలే ముందుగా తమకు సాయం చేసిన మత్స్యకారులను గుర్తించాలి, ముఖ్యంగా పడవలు దెబ్బతిన్న వారిని గుర్తించి, వారి పడవలకు మరమ్మతులు చేయించాలి. అవసరమైన వారికి వలలు కొనివ్వాలి. ఆ తర్వాత వారి ఇళ్ల స్థలాల కోసం వారి తరఫున ప్రభుత్వంతో పోరాడి ఇప్పించాలి. అందులో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికే ప్రాధాన్యత ఉండేలా చూడాలి. ఆ తర్వాత వారి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. వారికి జాతీయ, రాష్ట్ర రిస్క్యూ టీముల్లో ఉద్యోగాలు వచ్చేలా చూడాలి. అంతిమంగా వారి సేవలు చిరస్మరణీయంగా ఉండేలా ఓ మెమోరియల్ లాంటిది ఏర్పాటు చేయాలి. వారి సహకార సంఘం కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించేలా ఉంటే ఇంకా బాగుండవచ్చు. వీటి సాధన కోసం నవంబర్ 21న రానున్న మత్స్యకారుల దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదేమో! -
వాళ్ల రాతల్లో నేనూ చనిపోయే ఉంటా!
‘‘నాకిప్పుడు 95 ఏళ్లు. నాకేమనిపిస్తోందంటే, రేపు పొద్దున నేను చనిపోతే, వెంటనే పేపర్లలో న్యూస్ వేసుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలామంది నేను చనిపోయినట్టు రాసి పెట్టుకొని ఉండొచ్చు. అయితే ఆ రోజు తొందరగా రావొద్దని కోరుకుంటా’’ అని గట్టిగా నవ్వారు స్టాన్లీ. చావు మీద స్టాన్లీ వేసిన జోక్ ఇది. డార్క్ జోక్. స్పైడర్‌మేన్, ఐరన్‌మేన్, ఎక్స్‌మేన్.. ఇలా సూపర్‌హిట్ మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్స్‌ను సృష్టించిన వారిలో ఒకరైన స్టాన్లీ.. మార్వెల్ కామిక్స్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. మొన్న డిసెంబర్ 28న తన 95వ పుట్టినరోజు జరుపుకున్న స్టాన్లీ, ఆ సందర్భంగానే పై జోక్ పేల్చారు. ఈ జోక్ వెనక ఒక విచిత్రమైన కథ ఉంది. కెరీర్ మొదట్లో స్టాన్లీ ఓ ప్రముఖ పత్రికలో పనిచేసేవారట. ఎవరైనా పేరున్న వ్యక్తి చనిపోతే, గంటలోపే మూడు పేజీల మ్యాటర్ రెడీ అయి బయటకొచ్చేదట. ఎలా? అని అడిగితే, పోతారనుకున్న వాళ్ల లిస్ట్ రెడీ చేస్కోవడం వల్లే అంటారు స్టాన్లీ. ‘‘ఇది ఇప్పటికీ జరుగుతుందని అనుకుంటున్నా. నా గురించి కూడా రాసి పెట్టుకొనే ఉంటారు. సంతోషించదగ్గ విషయం ఏంటంటే, నేను ఈ స్థాయికి రావడం’’ అన్నారు స్టాన్లీ.. తత్వాన్ని, చమత్కారాన్ని ఒకే మాటలో కలిపేస్తూ! -
స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే..
-
స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే
రెండేళ్ల వయసున్న ఓ పిల్లాడు చైనాలోని లియావోచెంగ్ నగరంలో ఓ అపార్టుమెంటు మూడో అంతస్తు బయట కిటికీ తలుపునకు వేలాడుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆడుకుంటూ బయటకు వచ్చి.. ఎలా ఇరుక్కున్నాడో తెలియదు గానీ, కిటికీ బయటకు వచ్చి వేళ్లాడుతూ ఉన్నాడు. అతడి చొక్కా ఒక తలుపు హుక్ వద్ద ఇరుక్కోవడంతో అతడు అక్కడ ఆగిపోయాడు. పిల్లాడు అలా వేలాడుతుండటం చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని.. అక్కడకు సమీపంలోనే ఉండే లియాంగ్ అనే వ్యక్తి వచ్చి చూశాడు. పిల్లాడిని ఆ పరిస్థితిలో చూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా చకచకా స్పైడర్ మ్యాన్‌లాగే కిటికీలు పట్టుకుని పైకి ఎక్కి, ఆ పిల్లాడిని ఒక చేత్తోను, కిటికీ ఊచలను మరో చేత్తోను గట్టిగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది వచ్చి.. కింద ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేశారు. పొరపాటున లియాంగ్, పిల్లాడు కింద పడినా వాళ్లకు దెబ్బ తగలకూడదని అలా చేశారు. కానీ ఈలోపు తాళాల కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి వచ్చి.. మూడో అంతస్తులో పిల్లాడు ఉన్న అపార్టుమెంటు తాళాన్ని తెరిచాడు. దాంతో కిటికీ గుండానే లియాంగ్, ఆ పిల్లాడు గదిలోకి వెళ్లిపోయారు. పిల్లవాడి మెడ మీద కిటికీ ఊచల మచ్చలు ఉన్నాయని, అతడు ఏమాత్రం మెడ తిప్పి ఉన్నా కిందకు పడిపోయి ఉండేవాడని లియాంగ్ చెప్పాడు. భయంతో అతడి కాళ్లు వణికిపోతుండటాన్ని తాను కింది నుంచి చూశానని, దాంతో తాను ఎక్కగలనో లేదో అని ఆలోచించకుండా పైకి ఎక్కేశానని వివరించాడు. ఈ మొత్తం దృశ్యాన్ని పొరుగునుండే మరో వ్యక్తి తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. చాలాసేపటి తర్వాత వచ్చిన పిల్లవాడి తల్లిదండ్రులు జరిగిన విషయం మొత్తం తెలుసుకుని... లియాంగ్ ధైర్యసాహసాలు, తమ కొడుకును రక్షించిన వైనానికి అతడికి కృతజ్ఞతలు తెలిపారు. -
పిల్లలు పిడుగులు అండ్ గాడ్స్
కవర్ స్టోరీ ఈకాలం చిచ్చర పిడుగులుఉన్నారే... వీళ్లను మెప్పించడమంటే మాటలు కాదు. ఆషామాషీ విన్యాసాలు వీళ్లను ఏమాత్రం ఆకట్టుకోలేవు. కాకమ్మ కథలు వినిపిస్తే అమాయకంగా ఊ కొట్టే రకాలు కాదు వీళ్లు. అద్భుతరస ప్రధానమైన సాహస విన్యాసాలు కళ్లకు కట్టాల్సిందే. చూసే కొద్దీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే సాహస విన్యాసాలను, అద్భుత మాయాజాలాలను సునాయాసంగా చేయగల సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్‌మేన్, డోరోమేన్ వంటి కామిక్ కథానాయకులే చిన్నారుల అభిమాన హీరోలు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను వీళ్లు దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్నారు. మన దేశంలోనూ యానిమేషన్ రంగం ఊపందుకున్న తర్వాత బాలగణేశ, ఛోటా భీమ్, హనుమాన్ వంటి పురాణ పాత్రలు కూడా కామిక్ ‘కథ’నరంగంలోకి అడుగుపెట్టాయి. దేవుళ్లకు, సూపర్‌హీరోలకు ఉన్న తేడా మన చిచ్చరపిడుగులకు తెలుసు... మరి కామిక్‌లను సృష్టించిన దేశాల్లోని పిల్లలకు ఈ తేడా తెలుస్తుందా..? ఆ తరం కాదు... ఈ-తరం పిల్లలు దేశంలోకి ఇంకా టీవీలు రాని సత్తెకాలం ఒకటి సమీప గతంలోనే ఉండేది. అప్పట్లో చిన్నారులు తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు చెప్పే పేదరాశి పెద్దమ్మ కథలను, బాలభారత గాథలను, చిన్నికృష్ణుడి లీలను వింటూ పెరిగేవారు. కొంచెం అక్షరజ్ఞానం అలవడ్డాక చందమామ, బాలమిత్రలలోని పట్టువదలని విక్రమార్కుడి కథలను, బ్రహ్మరాక్షసుల పనిపట్టే సాహస వీర రాజకుమారుల కథలను, అల్లావుద్దీన్ అద్భుత దీపం వంటి కథలను, మాయల మరాఠీల కథలను, రామాయణ, భారత, భాగవత గాథలను అత్యంత ఉత్కంఠతో చదువుకునేవారు. వాక్యాలను కాస్త వేగంగా చదవడం అలవాటయ్యాక ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ వంటి అభూత కాల్పనిక గాథలను చదువుతూ ఉద్విగ్నతకు లోనయ్యేవారు. టీవీలు వచ్చిన కొత్తల్లో పిల్లలు ఇవే కథలను బుల్లితెర మీద చూసి ఉర్రూతలూగేవారు. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఉండేది. కాలం శరవేగంగా మారింది. టీవీ చానెళ్లు పెరిగాయి. అంతర్జాతీయ చానెళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అక్కడితోనే మార్పు ఆగిపోలేదు. ఇంటర్నెట్ ఇంటింటికీ అల్లుకుపోతున్న రోజులు వచ్చిపడ్డాయి. ఈ-తరం పిల్లలు టీవీల్లో కార్టూన్ నెట్వర్క్ ప్రసారాలకే పరిమితం కావడం లేదు, ఆకట్టుకునే కామిక్స్ కోసం యూట్యూబ్‌నూ వదలడం లేదు వీళ్లు. కామిక్స్ నేపథ్యం పుస్తక ముద్రణ, పత్రికల ప్రచురణ మొదలైన తర్వాత కామిక్స్ ప్రాచుర్యాన్ని పొందాయి. టీవీ చానెళ్లు వచ్చాక మరింతగా విస్తరించాయి. ఇంగ్లిష్ చిత్రకారుడు, ముద్రాపకుడు విలియమ్ హోగార్త్ను ఆధునిక కామిక్స్‌కు ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్దిలోనే ఆయన ఏడు సంపుటాల నీతి కథలను సచిత్రంగా ప్రచురించాడు. ఆ తర్వాత శతాబ్దానికి కామిక్ కళ మరో మైలురాయిని చేరుకుంది. బ్రిటిష్ హాస్య వారపత్రిక ‘జూడీ’ 1867లో ప్రపంచంలోనే తొలి కామిక్ సీరియల్ ‘ఏలీ స్లోపర్స్ హాఫ్ హాలీడే’ను ప్రచురించింది. ఈ కొత్త ప్రయోగం అంతంతమాత్రం చదువులున్న కార్మిక వర్గాల పాఠకులను, బడికి వెళ్లే చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో కొన్ని వేల కాపీలు ఉన్న ‘జూడీ’ సర్క్యులేషన్ అమాంతం 3.50 లక్షల కాపీలకు చేరుకుంది. ‘జూడీ’ ప్రభావంతో 1890 నాటికి బ్రిటన్‌లో ‘కామిక్ కట్స్’, ‘ఇలస్ట్రేటెడ్ చిప్స్’ అనే మరో రెండు కామిక్ పత్రికలు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే అమెరికన్ కార్టూనిస్ట్ రిచర్డ్ ఎఫ్ ఔట్‌కాల్ట్ కామిక్స్‌ను ఒక పద్ధతిలో పెట్టాడు. ఔట్కాల్ట్ను ఆధునిక కామిక్స్‌కు సూత్రకారుడిగా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో ప్రపంచంలోని మిగిలిన భాషల పత్రికలు కూడా కామిక్స్ ఒరవడిని అందిపుచ్చుకున్నాయి. సూపర్‌హీరోల యుగం రిచర్డ్ ఎఫ్ ఔట్‌కాల్ట్ కామిక్ సిరీస్‌లకు ఒక ఒరవడిని తీర్చిదిద్దాక కామిక్స్ రూపకల్పనలోనే కాదు, కామిక్స్ కోసం ఎన్నుకునే కథాంశాల్లోను, రచనా విధానంలోనూ సృజనాత్మకత, కాల్పనికత అనతి కాలంలోనే తారస్థాయికి చేరుకుంది. కామిక్స్ కామెడీకి మాత్రమే పరిమితం కాలేదు. అడ్వంచర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, డిటెక్షన్ వంటి రంగాలకు విస్తరించి, వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్‌మేన్, ఐరన్‌మేన్, డోరోమేన్ వంటి సూపర్‌హీరోలను సృష్టించి, జనాలకు పరిచయం చేశాయి. అలా జనాలకు పరిచయమైన తొలి సూపర్ హీరో ‘సూపర్‌మేన్. అమెరికన్ ప్రచురణ సంస్థ ‘డీసీ కామిక్స్’ 1938 జూన్‌లో విడుదల చేసిన ‘యాక్షన్ కామిక్స్’ సిరీస్ ద్వారా సూపర్‌మేన్ జనాలకు పరిచయమయ్యాడు. అమెరికన్ రచయిత జెర్రీ సీగల్, కెనడియన్ చిత్రకారుడు జో షూస్టర్లు సృష్టించిన ‘సూపర్‌మేన్’ అనతికాలంలోనే చిన్నారులకు ఆరాధ్య కథానాయకుడిగా మారాడు. ‘యాక్షన్ కామిక్స్’ సిరీస్ తొలి సంచికను రెండు లక్షల కాపీలతో మార్కెట్లోకి విడుదల చేస్తే, అనతి కాలంలోనే సర్క్యులేషన్ పది లక్షల కాపీలకు పెరిగింది. తొలి సంచిక కాపీని 2014లో ఈ-బేలో వేలం వేసినప్పుడు ఏకంగా 32.07 లక్షల డాలర్లకు (రూ.21.52 కోట్లు) అమ్ముడుపోయింది. కామిక్స్ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు. ‘సూపర్‌మేన్’ ఆవిర్భావంతో కామిక్స్ రంగంలో సూపర్‌హీరోల యుగం మొదలైంది. బ్యాట్‌మేన్... జేమ్స్‌బాండ్‌కు తాత ‘సూపర్‌మేన్’ వచ్చిన మరుసటి ఏడాదిలోనే అతడికి దీటుగా ‘బ్యాట్‌మేన్’ దూసుకొచ్చాడు. ‘బ్యాట్‌మేన్’ కూడా డీసీ కామిక్స్ సృష్టించిన సూపర్‌హీరోనే. అమెరికన్ రచయిత బిల్ ఫింగర్, చిత్రకారుడు బాబ్ కేన్ సృష్టించిన ‘బ్యాట్‌మేన్’ అలాంటిలాంటి సూపర్‌హీరో కాదు, జేమ్స్‌బాండ్‌కు తాతలాంటి వాడు. సినిమాల్లో జేమ్స్‌బాండ్ ఎలాంటెలాంటి సాహసాలు చేస్తాడో కామిక్స్‌లో బ్యాట్‌మేన్ అంతకు మించిన సాహసాలను అవలీలగా చేసేస్తాడు. విలాసాల్లో మునిగి తేలుతుంటాడు. అయినా ఆపన్నులను ఆదుకుంటాడు. దుష్టుల భరతం పడుతుంటాడు. కళ్లు చెదిరే కార్లు మాత్రమే కాదు, విమానాలనూ, వాటితో పాటే చిత్ర విచిత్ర వాహనాలనూ నడుపుతాడు. ఊహకందని అధునాతన పరికరాలను, అధునాతన ఆయుధాలను వాడుతుంటాడు. అసలు బ్యాట్‌మేన్ ఆహార్యమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గబ్బిలంలా కనిపించే ముసుగు అతడి ముఖాన్ని పూర్తిగా కనిపించనివ్వదు. ఒంటికి దుర్భేద్యమైన కవచం, ఇతర రక్షణ అలంకరణలు బ్యాట్మేన్ను ప్రత్యేకంగా నిలుపుతాయి. విలక్షణమైన ఆహార్యం, విచిత్రమైన సాహస విన్యాసాలు బ్యాట్మేన్ను అనతి కాలంలోనే చిన్నారుల అభిమాన హీరోను చేశాయి. బ్యాట్‌మేన్ నిజంగా ఉంటే..! బ్యాట్‌మేన్ ఒక కాల్పనిక పాత్ర. కామిక్ కథనం ప్రకారం అతడి అసలు పేరు బ్రూస్ వేన్. శతకోటీశ్వరుడు. విలాసవంతమైన జీవితం అతడి సొంతం. అయినా, అమాయకులకు మేలు చేయాలనే సంకల్పంతో, అన్యాయాలను ఎదిరించాలనే సదుద్దేశంతో ముసుగువీరుడిలా ‘బ్యాట్‌మేన్’ అవతారంతో సాహసాలు చేస్తుంటాడు. ఆ సంగతి మనలో చాలామందికి తెలుసు. చిన్నారులకు మాత్రం అతడో నిజమైన హీరో. సినిమా హీరోలను మించిన సూపర్ హీరో. అలాంటి బ్యాట్‌మేన్ నిజంగా ఉంటే... కథా కమామిషూ ఎలా ఉండేవనే ఆలోచనతో ‘మనీ సూపర్ మార్కెట్ డాట్ కామ్’ ఒక అంచనా వేసింది. బ్యాట్‌మేన్ ఆహార్యం, అతగాడి ఆయుధాలు, పరికరాలు వగైరా వగైరాలన్నింటినీ ఒక్కొక్కటే డబ్బులోకి తర్జుమా చేసి లెక్కలేసింది. ఈ లెక్కల మొత్తాన్ని చూస్తే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. ‘మనీ సూపర్ మార్కెట్ డాట్ కామ్’ అంచనా ప్రకారం... ఒకవేళ బ్యాట్‌మేన్ గనుక నిజంగానే ఉంటే గింటే... అతడి ఆహార్యం, పరికరాల విలువ ఏకంగా 68,24,51,350 డాలర్లు. మన లెక్కల్లో చెప్పుకోవాలంటే రూ.4580 కోట్లకు పైమాటే! దీనికే నోరెళ్లబెడుతున్నారా? కథనం ప్రకారం బ్యాట్‌మేన్ సంపదను ఇందులో లెక్కవేయలేదు. జస్ట్ అతడి ఆహార్యం, ఆయుధాలు, పరికరాల లెక్క మాత్రమే. బ్యాట్‌మేన్ సమస్త సంపదను లెక్కిస్తే ఎంతవుతుందంటారా..? ‘ఫోర్బ్స్’ పత్రిక పనిగట్టుకుని మరీ లెక్కలేసి, బ్యాట్‌మేన్ అలియాస్ బ్రూస్ వేన్ నికర విలువను దాదాపు 700 కోట్ల డాలర్లుగా (రూ.46,980 కోట్లు) తేల్చింది. కామిక్సా... మజాకా! సూపర్ హీరోల ధాటి మొదలయ్యాక ప్రచురణ రంగంలో కామిక్స్ పుస్తకాలు దుమ్ము దుమారమే రేపాయి. ఒకానొక దశలో మామూలు పుస్తకాల కంటే కామిక్స్ పుస్తకాల అమ్మకాలే ఎక్కువగా సాగాయి. కామిక్స్ పుస్తకాలు పాఠకులను చెడగొడుతున్నాయంటూ సంస్కరణవాదులు గగ్గోలు పెట్టి గుండెలు బాదుకున్నారు. అక్కడితో ఆగలేదు. కామిక్స్ పుస్తకాల అమ్మకాలు సాధారణ సాహితీ పుస్తకాల అమ్మకాలకు మించిపోవడంతో 1946లో అమెరికాలోని కొందరు ‘సంస్కరణవాదులు’ కామిక్స్ పుస్తకాలను తగులబెట్టారు కూడా. అయినా కామిక్స్ పుస్తకాల ధాటి తగ్గలేదు కదా, మరింత పెరిగింది. టీవీ మాధ్యమం అందుబాటులోకి వచ్చాక పుస్తకాల్లోని కామిక్స్ బుల్లితెర మీదకెక్కడం మొదలైంది. కామిక్స్ ఆధారంగా సినిమాలూ వచ్చాయి. ఇంటర్నెట్ వచ్చాక వెబ్ కామిక్ సిరీస్‌లు మొదలయ్యాయి. అవన్నీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రచురణకర్తలకు, నిర్మాతలకు కాసుల పంట పండిస్తూనే ఉన్నాయి. కామిక్స్ ఆధారంగా ఇప్పటి వరకు రెండువందలకు పైగానే సినిమాలు వచ్చాయి. కామిక్స్ ఆధారంగా 2012లో రూపొందిన ‘ది ఎవెంజర్స్’ ఏకంగా 62.30 లక్షల డాలర్లు (రూ.418 కోట్లు) వసూలు చేసింది. కామిక్ ఆధారిత సినిమాల్లో ఇప్పటికి ఇదే అతిపెద్ద రికార్డు. మన సూపర్ హీరోలు వాళ్లే... పౌరాణిక నేపథ్యంలేని అమెరికా వంటి దేశాల్లో కేవలం కాల్పనిక పాత్రలే సూపర్ హీరోలుగా కామిక్స్ వచ్చాయి. అవి ఖండాంతరాలకూ పాకాయి. ఘనమైన పౌరాణిక నేపథ్యం గల మన దేశంలో కామిక్స్ కొత్త ఒరవడిని దిద్దుకున్నాయి. కేవలం కాల్పనిక పాత్రలకే పరిమితం కాకుండా, పౌరాణిక పాత్రలకు కొంచెం కల్పనను జోడించి కామిక్స్ రూపొందించడం మొదలైంది. మన చిన్నారులను బాలగణేశ, ఛోటా భీమ్, హనుమాన్, శ్రీకృష్ణ వంటి పౌరాణిక పాత్రలు సూపర్ హీరోలకు దీటుగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మన చిన్నారులు భలే గడుగ్గాయిలు. వాళ్లకు సూపర్ మేన్‌కు, శ్రీకృష్ణుడికి తేడా తెలుసు. సూపర్‌మేన్ వాళ్లకు సూపర్‌హీరో మాత్రమే. శ్రీకృష్ణుడంటే సూపర్ హీరోను మించిన దేవుడు. సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్‌మేన్, డోరోమేన్లను ఆరాధించే మన చిన్నారులు... బాల గణేశ, ఛోటా భీమ్, శ్రీకృష్ణ వంటి వారిని భక్తిగా పూజిస్తారు కూడా. బహుశ ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దల నోట పురాణగాథలను వింటూ పెరిగిన ప్రభావం దీనికి కారణం కావచ్చు. -
ముగ్గురు సూపర్ హీరోలు
సూపర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్ , కెప్టెన్ అమెరికా, ఐరన్‌మ్యాన్ లాంటి సూపర్‌హీరోల సినిమాలంటే సినీ అభిమానుల్లో ఎంతో క్రేజ్. వీళ్లందరూ ఒకే సినిమాలో కలిసి సందడి చేయడం హాలీవుడ్లో లేటెస్ట్ ట్రెండ్. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ పాత్రలతో ఓ సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా, తాజాగా కెప్టెన్ అమెరికా, ఐరన్మ్యాన్లు కూడా వెండితెరపై ఒకేసారి తమ విన్యాసాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు పాత్రలకూ మరో సూపర్ హీరో స్పైడర్‌మ్యాన్ పాత్ర కూడా జత కలిసింది. ఈ మూడు సూపర్ హీరో పాత్రలూ కనిపించనున్న చిత్రం ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చివరిలో స్పైడర్‌మ్యాన్ కనిపించడం సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. రెండేళ్ల క్రితం ‘ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్’ చిత్రం తర్వాత స్పైడర్‌మ్యాన్ పాత్రతో ఏ సినిమా కూడా రాలేదు. ఈసారి వేసవికి వెండితెరపై ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా కాంబినేషన్లో ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ ’చిత్రంలో స్పైడర్బాయ్ సాహసాలు యాక్షన్ ప్రియులకు కనుల విందే అని వేరే చెప్పనక్కర్లేదేమో! -
ఒక్క పుస్తకానికి రూ. 3 కోట్లు!
డల్లాస్: ఓ కామిక్ పుస్తకానికి 4,54,100 డాలర్లు (సుమారు రూ. 3.12 కోట్లు) చెల్లించి తన సొంతం చేసుకున్నాడో పుస్తక ప్రియుడు. ఆ పుస్తకంలో అంత విశేషం ఏముంది అనుకుంటున్నారా. స్పైడర్ మ్యాన్ మొట్టమొదటి సారిగా దర్శనమిచ్చిన కామిక్ బుక్ అది. డల్లాస్‌కు చెందిన ప్రముఖ వేలం సంస్థ హెరిటేజ్ నిర్వహించిన పుస్తక వేలంలో మరే ఇతర స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్కు లభించనంత ఆదరణ లభించింది. న్యూయార్క్ వాసి వాల్టర్ యకోబోస్కి 1980లో పలు కామిక్ పుస్తకాలను కొనుగోలు చేసే సందర్భంగా ఈ పుస్తకాన్ని 1200 డాలర్లకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్‌లో కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని వేలంలో ఓ పేరు తెలియని వ్యక్తి ఊహించనంత ఎక్కువ ధరకు కొనడంతో వాల్టర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అపురూప పుస్తకాలకు అమెరికన్లు అత్యధిక ధర చెల్లించడం ఇదే మొదటి సారి కాదు. 1962 ఎడిషన్ అమేజింగ్ ఫాంటసీ పుస్తకం 2011లో 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. -
కామిక్ అవతార్
స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్... ఇలా హాలీవుడ్ సూపర్‌హీరో సినిమాలన్నీ కామిక్స్ నుంచి పుట్టినవే. తొలిసారిగా ఓ వెండితెర హీరో కామిక్ బుక్‌లో సూపర్‌హీరోగా అలరించనున్నారు. జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్’... ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ అద్భుతం. ఆరేళ్ల క్రితం ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పండోరా అనే గ్రహాన్ని తన అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో తెర మీద ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మూడు సీక్వెల్స్ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ‘అవతార్’ని కామిక్ బుక్‌లో హీరోగా పరిచయం చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ‘‘డార్క్ హౌస్ కామిక్స్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. మరి కొన్ని కొత్త కథలతో, పండోరా గ్రహంలోని మరికొన్ని కొత్త కోణాలను పదేళ్ల పాటు పుస్తక రూపంలో తీసుకురానున్నాం’’ అని చెప్పారు. -
స్పైడర్‌మ్యాన్ అరెస్ట్!
న్యూయార్క్: సినిమాలో అయితే ఎన్ని వేషాలు వేసినా కుదురుతుంది. స్పైడర్‌మ్యాన్ వేషం వేసి సినిమాలలో ఎలా చేసినా పరవాలేదు. పిల్లల నుంచి అందరూ చూస్తారు. ఆనందిస్తారు. అదే నిజజీవితంలో అయితే జైలు పాలు కావలసిందేనని న్యూయార్కులో జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్ ప్రాంతంలో జూనియర్ బిషప్ అనే 25 ఏళ్ల వ్యక్తి స్పైడర్మాన్ డ్రెస్ వేసుకుని పర్యాటకులను అకట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తనతో ఫొటోలు తీయించుకోవాలంటే 5 నుంచి 20 డాలర్ల వరకూ ఇచ్చుకోవాలని పర్యాటకులను ఆ స్పైడర్మాన్ డిమాండ్ చేస్తున్నాడు. వారిని ఇబ్బంది పెడుతున్నాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి జోక్యం చేసుకున్నారు. పర్యాటకులను వేధించవద్దని అతనికి సూచించారు. గుర్తింపు కార్డు అడిగితే ‘ఇది నీకు సంబంధించినది కాదు’ అని రెటమతంగా సమాదానం చెప్పాడు. అంతే కాకుండా వేషం వేసుకోగానే స్పైడర్మాన్ అయిపోయాననుకున్నాడో ఏమో అరెస్ట్ చేయబోయిన పోలీసుపై చేయి కూడా చేసుకున్నాడు. అంతదాక వచ్చిన తరువాత పోలీసులు ఊరుకుంటారా? ఓ పది మంది పోలీసులు వచ్చి అతనిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వారికి ఎదురు తిరిగాడు. పోలీసులతో పెనుగులాడాడు. ఎట్టకేలకు పోలీసులు స్పైడర్మాన్ను కిందపడవేసి బేడీలు వేసి అరెస్ట్ చేశారు.