
స్పైడర్‌మేన్ నో వే హోమ్ పోస్టర్
హాలీవుడ్ సూపర్‌హిట్ సూపర్ హీరో ‘స్పైడర్ మేన్’ మళ్లీ థియేటర్స్‌కు వస్తున్నాడు. స్పైడర్‌మేన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ ఎనిమిది సినిమాలు వచ్చాయి. ‘స్పైడర్‌మేన్’ (2002), ‘స్పైడర్‌మేన్ 2’ (2004), ‘స్పైడర్‌మేన్ 3’ (2007), ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్’ (2007), ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్ 2’ (2014), ‘స్పైడర్‌మేన్: హోమ్ కమింగ్’ (2017), ‘స్పైడర్‌మేన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ (2019), ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ (2021)... ఈ 8 చిత్రాలూ రీ రిలీజ్ కానున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ కొలంబియా పిక్చర్స్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్పైడర్‌మేన్’ ఫ్రాంచైజీ సినిమాలను రీ రీలీజ్ చేస్తోందని హాలీవుడ్ సమాచారం. ఈ 8 సినిమాలకు సంబంధించి ఓ కామన్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాలు కూడా ఏప్రిల్ 15 నుంచి వారానికి ఒక్కొక్కటి చొప్పున జూన్ 3 వరకు విడుదలవుతాయి. ప్రతి చిత్రం కూడా సోమవారమే రీ –రిలీజ్ కానుండటం విశేషం. ఎంపిక చేసిన థియేటర్స్‌లోనే ఈ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment