ప్రపంచ వినోద రంగానికి స్పైడర్ మేన్, బ్లాక్ పాంతర్, ఐరన్ మేన్, ఎక్స్‌మేన్ లాంటి సూపర్‌హీరోలను అందించిన ప్రముఖ రచయిత స్టాన్‌లీ సోమవారం కన్నుమూశారు. మార్వెల్ కామిక్స్‌కు గాడ్‌ఫాదర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్‌లీ 1922 డిసెంబర్ 22న జన్మించారు. లీ తండ్రి ఎక్కువగా అడ్వంచర్ నవలలను చదివారు. ఆ ప్రభావమే లీని రచయితగా మార్చింది.
డిగ్రీపూర్తి చేసిన తరువాత పలు నాటకాలను స్వయంగా రాసి, నటించారు కూడా. 1939లో మార్వెల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన లీ, రెండేళ్ల తరువాత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కెప్టెన్ అమెరికా పాత్ర కోసం ఓ కథను రెడీ చేశారు. తరువాత అదే కంపెనీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎడిటర్ స్థాయిలో దశాబ్దాల పాటు సేవలందించారు.
1961లో తొలిసారిగా ఫెంటాస్టిక్ ఫోర్ పేరుతో సూపర్‌హీరో టీంను సృష్టించిన లీ.. 2002లో తన ఆత‍్మకథను ‘ఎక్సెల్షియర్! ద అమేజింగ్ లైఫ్ ఆఫ్ స్టాన్ లీ’ పేరుతో విడుదల చేశారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment