Hulk
-
బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్
ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే చాలా మంది వీడియోలు చూడటం కోసం, గేమింగ్ ఆడటం కోసం, ఫోటోలు తీయడం కోసం పనికొస్తుందని అనుకుంటారు. కానీ, మనం ఇప్పుడు చెప్పుకొనే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడింది. మోటరోలాకు చెందిన ఐదేళ్ల పాత మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ ఒక మనిషి ప్రాణం కాపాడింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మొబైల్ కేసు మీద ది ఇన్ క్రెడిబుల్ హల్క్ డిజైన్ ఉంది. మార్వెల్ హీరో హల్క్, మోటో జీ5 కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గత వారం బ్రెజిల్లో దొంగతనం జరిగే సమయంలో జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తిపై దుండగుడు బుల్లెట్ ఫైర్ చేశారు. అది నేరుగా మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు తగిలి దిశ మార్చుకొని నడుము భాగంలోకి దూసుకెళ్లింది. అలా చిన్నపాటి గాయంతో బయటపడ్డ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఇది తప్ప బుల్లెట్ వల్ల మరే ఇతర గాయం లేదు. ఫోన్ యజమానికి చికిత్స చేసిన వైద్యుడు షేర్ చేసిన ఫోటో ప్రకారం మోటో జీ5 బుల్లెట్ నుంచి ప్రాణాలు కాపాడింది. బుల్లెట్ ఫోన్ స్క్రీన్ ను తాకడం మనం చూడవచ్చు. ఇప్పుడు అది పగిలిపోయింది. ఫోన్ వెనుక భాగంలో పెద్ద బొడిపే కూడా ఉంది. ఫోన్ లో హల్క్ కేసు కూడా కనిపిస్తుంది. గతంలో వచ్చిన మోటో జీ5 వంటి ఫోన్లు చాలా మందంగా ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చే ఫోన్లు స్లిమ్, సున్నితమైన డిజైన్ తో వస్తున్నాయి. ఇలాంటి ఘటనల నుంచి కాపాడతాయా అనే సందేహం రాకమానదు. ఫోన్ అరేనాప్రకారం, ఒక శామ్ సంగ్ గెలాక్సీ, ఐఫోన్ వారి యజమానులను బుల్లెట్ల నుంచి కాపాడాయి.(చదవండి: ఇక తగ్గేదె లే అంటున్న టాటా మోటార్స్!) -
మోస్ట్ అవెయిటెడ్ ట్రైలర్ వచ్చేసింది..!
హాలీవుడ్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవెంజర్స్ ఎండ్‌గేమ్ ట్రైలర్ వచ్చేసింది. ముందుగా ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని భావించినా సీనియర్ బుష్ మరణంతో రెండు రోజుల పాటు వాయిదా తరువాత శుక్రవారం విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్, బ్లాక్ విడో, హల్క్, హాక్ఐ లాంటి సూపర్ హీరోలు సందడి చేశారు. గతంలో వచ్చిన సినిమాలో థానోస్ స్పైడర్ మాన్, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ పాంథర్ లాంటి సూపర్ హీరోలను అందం చేశాడు. మరి ఈ చివరి భాగంలో మిగిలిన కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో, హల్క్, ఐరన్ మ్యాన్కూడా అంతం అవుతారా లేక థానోస్ సూపర్‌హీరోస్ చేతిలో చనిపోతాడు అన్నదే ఈ సినిమా క్లైమాక్స్ కానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతోంది. -
సూపర్ హీరోల సృష్టికర్త మృతి
ప్రపంచ వినోద రంగానికి స్పైడర్ మేన్, బ్లాక్ పాంతర్, ఐరన్ మేన్, ఎక్స్‌మేన్ లాంటి సూపర్‌హీరోలను అందించిన ప్రముఖ రచయిత స్టాన్లీ సోమవారం కన్నుమూశారు. మార్వెల్ కామిక్స్‌కు గాడ్‌ఫాదర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్లీ 1922 డిసెంబర్ 22న జన్మించారు. లీ తండ్రి ఎక్కువగా అడ్వంచర్ నవలలను చదివారు. ఆ ప్రభావమే లీని రచయితగా మార్చింది. డిగ్రీపూర్తి చేసిన తరువాత పలు నాటకాలను స్వయంగా రాసి, నటించారు కూడా. 1939లో మార్వెల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన లీ, రెండేళ్ల తరువాత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కెప్టెన్ అమెరికా పాత్ర కోసం ఓ కథను రెడీ చేశారు. తరువాత అదే కంపెనీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎడిటర్ స్థాయిలో దశాబ్దాల పాటు సేవలందించారు. 1961లో తొలిసారిగా ఫెంటాస్టిక్ ఫోర్ పేరుతో సూపర్‌హీరో టీంను సృష్టించిన లీ.. 2002లో తన ఆత్మకథను ‘ఎక్సెల్షియర్! ద అమేజింగ్ లైఫ్ ఆఫ్ స్టాన్ లీ’ పేరుతో విడుదల చేశారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటులు, నిర్మాతలు సంతాపం తెలిపారు. -
సూపర్ హీరో పాత్రలో నటిస్తా: మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం. పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తున్నారు. మహేష్ కూడా గతంలో ఎన్నడూ లేనీ విధంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్, తనకు హల్క్ లాంటి సూపర్ హీరో పాత్రలంటే ఇష్టమని తెలిపాడు. అంతేకాదు అలాంటి పాత్ర వస్తే చేయడానికి ఎప్పుడూ రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. అలాగే హాలీవుడ్ చిత్రాల్లో అవెంజర్స్ సినిమా చూడటానికి ఇష్టపడతానని, తన పిల్లలతో కలిసి ఇప్పటికే చాలా సార్లు ఆ సినిమా చూసినట్టుగా వివరించాడు. -
హాలీవుడ్ భామ, వీరులపై ' ఆల్ ఇండియా బక్చోడ్'
హాలీవుడ్ కండల వీరులు, భామలతో తయారుచేసిన ఫేక్ మూవీ పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరీ కింద ఉన్న వాటిపై ఓ సారి చూద్దాం. జయహో రాంబో పేరుతో విడుదల చేసిన పోస్టర్లో జయ్ మాతా దీ అని రాసి ఉన్న శాలువాతో, ఈ చిత్రానికి ఎమ్ఎమ్ మిఠాయివాలా దర్శకత్వం వహించారని చూపుతున్నాయి. నా ఫాస్ట్ నా ఫ్యూరియస్ పేరుతో ఫాస్ట్ అండ్ ఫూరియస్ వీరులు నెత్తి మీద నెహ్రూ టోపీతో కనిపిస్తున్నారు. ఇక హల్క్ చిత్రంపై తయారుచేసిన ఫోటోలో ఎడ్వర్డన్ నార్టన్ నటించిన ది ఇన్క్రిడబుల్ ఇండియా హల్క్ పేరుతో ఉంచారు. కుంగ్ పాండాలోని పాండా పూజారి వేషంలో పూజ చేస్తున్న కనిపించే చిత్రంతో అలరిస్తోంది. హాలీవుడ్ భామలు అచ్చమైన చీరకట్టుతో నిల్చున్న చిత్రంతో పవిత్ర అప్సరసలు అనే పేరుతో ఉంచారు. సర్కారీ ఇన్స్పెక్ట్రీ పేరుతో సమీర్ మన్దేశాని దర్శకత్వం అని రాశారు. కె క్రిష్ ఇవాన్షీ ఇన్ పెష్వా అమెరికా అన్న పదాలతో చివరిగా కెప్టెన్ అమెరికా హీరో చిత్రాన్ని ఎడిట్ చేశారు. వీటన్నింటిని ఫోటోషాప్ ద్వారా చిత్రికరించి జోక్‌లుగా తయారు చేశారు.