సూపర్ హీరో పాత్రలో నటిస్తా: మహేష్ బాబు | mahesh babu reveals his super hero | Sakshi
Sakshi News home page

సూపర్ హీరో పాత్రలో నటిస్తా: మహేష్ బాబు

Published Sun, May 15 2016 12:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

సూపర్ హీరో పాత్రలో నటిస్తా: మహేష్ బాబు

సూపర్ హీరో పాత్రలో నటిస్తా: మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం. పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తున్నారు. మహేష్ కూడా గతంలో ఎన్నడూ లేనీ విధంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

ఈ సందర్భంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్, తనకు హల్క్ లాంటి సూపర్ హీరో పాత్రలంటే ఇష్టమని తెలిపాడు. అంతేకాదు అలాంటి పాత్ర వస్తే చేయడానికి ఎప్పుడూ రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. అలాగే హాలీవుడ్ చిత్రాల్లో అవెంజర్స్ సినిమా చూడటానికి ఇష్టపడతానని, తన పిల్లలతో కలిసి ఇప్పటికే చాలా సార్లు ఆ సినిమా చూసినట్టుగా వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement