మరోసారి పోలీస్ పాత్రలో మహేష్? | Mahesh doing police role again in murugadoss film | Sakshi
Sakshi News home page

మరోసారి పోలీస్ పాత్రలో మహేష్?

Published Sat, Jun 4 2016 12:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

మరోసారి పోలీస్ పాత్రలో మహేష్?

మరోసారి పోలీస్ పాత్రలో మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పోకిరి, దూకుడు, ఆగడు చిత్రాల్లో పోలీస్ గెటప్లో ఇరగదీసిన రాజకుమారుడు... త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న మురుగదాస్ సినిమాలోనూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడట. రా తరహా కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో మహేష్ కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మురుగదాస్ టీంలో చాలాకాలంగా పనిచేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సునీల్, మహేష్ కోసం అద్భుతమైన సెట్స్ డిజైన్ చేస్తున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్లో భారీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ సెట్ వేసే పనిలో ఉన్నారు.

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇలా టాప్ టెక్నిషియన్స్ మహేష్ - మురుగదాస్ల సినిమా కోసం పనిచేస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ ముంబైలో సమావేశమై ప్రొడక్షన్ షెడ్యూల్ను ఫైనల్ చేయనున్నారు. బ్రహ్మోత్సవం రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన మహేష్, తిరిగి రాగానే మురుగదాస్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement