Parineeti
-
పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్‌గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పరిణీతి-రాఘవ్‌ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రాఘవ్ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్ కలర్ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్ కలర్స్, న్యూడ్ మేకప్ ట్రెండ్ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వరకు.. సింపుల్‌గా, పేస్టల్ కలర్స్‌లో నేచురల్‌గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే రెడ్, ఎల్లో, గ్రీన్ వంటి సాంప్రదాయ కలర్స్ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెవీ అండ్ కాస్ట్లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్ అండ్ క్లాసిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్ మేకప్ విత్ పేస్టల్ కలర్స్ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్ సెట్ చేశారు మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్‌ను ఫాలో అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్ కలర్ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్లోనూ చాలా సింపుల్ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్ పేస్టల్ లెహంగా, చాలా సింపుల్ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్‌ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. -
ఆ హీరో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాకు ఇప్పుడు మంచి మిత్రుడు దొరికాడన్న సంతోషంలో తేలిపోతోంది. 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో తన కో స్టార్ అయుష్మాన్ తనకు చాలా దగ్గరి మిత్రుడుగా మారిపోయాడని పరిణీతి తెలిపింది. ఈ 'దమ్ లగాకే హైసా' హీరో ఇటీవల.. పరిణీతి చాలా చక్కగా పాడుతుందని, ఆమె సింగింగ్ను ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చని పొగడ్తలతో ముంచెత్తాడు. దీనిపై పరిణీతి స్పందిస్తూ.. 'అతడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను పాడటం ఎప్పుడు విన్నా సరే అతడు సింగింగ్ను ప్రొఫెషనల్‌గా తీసుకోమంటూ చెబుతుంటాడు. అతడు కూడా గొప్ప గాయకుడు. నేను పాడుతుంటే తాను నాతో పాటు జాయిన్ అవుతాడు. నేను ఎంతలా పాడినా.. నా పాటలకు అడ్డు చెప్పకుండా వినే కో స్టార్ నాకు దొరికాడు' అంటూ ఆయుష్మాన్‌తో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చింది. -
మరోసారి పోలీస్ పాత్రలో మహేష్?
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పోకిరి, దూకుడు, ఆగడు చిత్రాల్లో పోలీస్ గెటప్‌లో ఇరగదీసిన రాజకుమారుడు... త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న మురుగదాస్ సినిమాలోనూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. రా తరహా కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో మహేష్ కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మురుగదాస్ టీంలో చాలాకాలంగా పనిచేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సునీల్, మహేష్ కోసం అద్భుతమైన సెట్స్ డిజైన్ చేస్తున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్‌లో భారీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ సెట్ వేసే పనిలో ఉన్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇలా టాప్ టెక్నిషియన్స్ మహేష్ - మురుగదాస్‌ల సినిమా కోసం పనిచేస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ ముంబైలో సమావేశమై ప్రొడక్షన్ షెడ్యూల్‌ను ఫైనల్ చేయనున్నారు. బ్రహ్మోత్సవం రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన మహేష్, తిరిగి రాగానే మురుగదాస్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. -
సహజీవనం తప్పేమీ కాదు!
ఇంటర్వ్యూ పరిణీతిని పలకరిస్తే చాలు... మాటలు పరవళ్లు తొక్కుతాయి. సినిమా గురించైనా, షాపింగ్ గురించైనా... అలవాట్ల గురించైనా, ఇష్టాల గురించైనా... ప్రేమ గురించైనా, సహజీవనం గురించైనా... విషయం ఏదైనా కుండ బద్దలు కొట్టేయడం పరిణీతి స్టయిల్. కావాలంటే మీరే చూడండి... ఎన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పేసిందో! * వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ నిజం చెప్పండి... మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? లేదు. నేనింకా సింగిలే. * కానీ ఆ మధ్య మీ పేరు కొందరితో ముడిపడిందే? అవన్నీ ఎవరో సృష్టించారు. నిజం కాని విషయాల గురించి ఆలోచించేంత ఓపిక, తీరిక రెండూ నాకు లేవు. * నిప్పు లేనిదే పొగ వస్తుందా? నిప్పు లేకుండా పొగ రప్పించే టాలెంట్ కొందరికి ఉంటుంది. ఓ మగాడు ఎన్నిసార్లు ప్రేమలో పడినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఓ ఆడపిల్ల ఎవరినైనా చూసి నవ్విందంటే చాలు... ప్రేమలో పడిపోయింది, సిగ్నల్ ఇచ్చేసింది అనేస్తూ ఉంటారు. అసలు నవ్వినంత మాత్రాన సిగ్నల్ ఇచ్చేసినట్టేనా? ప్రతి నవ్వూ సిగ్నలే అవుతుందా? * మరి ఏ నవ్వు సిగ్నల్ అవుతుంది? పలక రింపుగా నవ్వే నవ్వు ఉంటుంది. ఇబ్బందిగా నవ్వే నవ్వు ఉంటుంది. నటనతో కూడిన నవ్వు ఉంటుంది. స్నేహంగా నవ్వే నవ్వు ఉంటుంది. హాస్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఓపెన్‌గా నవ్వే నవ్వు ఉంటుంది. ఇన్ని రకాల నవ్వులు ఉంటే, ప్రతి నవ్వుకూ ఒకే అర్థం చెబితే ఎలా? అయినా ప్రేమకు ఆహ్వానం నవ్వు ద్వారా కాదు, కళ్ల ద్వారా అందుతుంది. * ప్రేమ గురించి బాగా తెలిసినట్టుందే? ప్రేమ గురించి తెలియడం వేరు, ప్రేమను అనుభవించి తెలుసుకోవడం వేరు. నాకు ప్రేమ గురించి తెలుసు. కానీ దాన్ని ఇంకా అనుభవించలేదు. ఎందుకంటే నేనింకా ప్రేమలో పడలేదు. * ఎలాంటి వ్యక్తిని ప్రేమిస్తారు? సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన కలవాడై ఉండాలి. విధి నిర్వహణ దగ్గర్నుంచి వైవాహిక జీవితం వరకూ ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి. మీకు నవ్వొచ్చినా సరే, ఒకటి చెప్తాను. మొదటి మూడు విషయాల్లోనూ కాంప్రమైజ్ అవుతాను. ఆ క్వాలిటీస్ లేకపోయినా ప్రేమిస్తాను. కానీ మూడో విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావడం నావల్ల కాదు. (నవ్వుతూ) ముక్కు మూసుకుని కాపురం చేయలేం కదా! * అసలు ఎలాంటి భర్త దొరికితే ఆడపిల్ల సుఖపడుతుంది? భర్త తనని గౌరవించేవాడు, తనని తనలా ప్రేమించేవాడు అయితే ఏ ఆడపిల్లకీ కష్టాలుండవు. కొందరు భర్తల్లో భార్య మీద చీప్ అభిప్రాయం ఉంటుంది. తనకేం తెలుసు, ఏం చేయగలదు అనుకుంటూ ఉంటారు. అలాంటివాణ్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. అలాగే కొందరు మనల్ని మనలా ఉండనివ్వరు. మనం వాళ్లకోసం చాలా మారిపోవాలి. మన అలవాట్లు, ఇష్టాయిష్టాలు మార్చేసుకోవాలి. నేనయితే అలాంటివాడిని అస్సలు భరించను. ఎలా కూర్చోవాలో, ఎలాంటి బట్టలేసుకోవాలో కూడా తనే చెప్పాలని చూస్తే లాగి ఒక్కటిస్తాను. * మరి రొమాన్స్ సంగతి? అది లేకపోతే ఎలా! దంపతులు ఎప్పుడూ రొమాంటిక్‌గా ఉండాలి. అయితే ప్రతి చిన్నదానికీ గిఫ్టులు ఇచ్చి పుచ్చుకోవడం, పొగడ్తల్లో ముంచెత్తడం లాంటివి నాకు నచ్చవు. ప్రేమగా కాసిన్ని కబుర్లు చెప్పుకోవడం, ఇద్దరూ కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేయడం లాంటి చిన్న విషయాలు కూడా చాలా రొమాంటిక్‌గా అనిపిస్తాయి. * సహజీవనంపై మీ అభిప్రాయం? సహజీవనం తప్పేమీ కాదు. అయితే సహజీవనానికి నేనిచ్చే డెఫినిషన్ వేరు. ఓ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే... సూట్‌కేస్ పట్టుకుని అతనింటికి వెళ్లిపోయి, అతడితోనే కలిసి జీవిస్తూ, అతనితో కాపురం చేయడం కాదు సహజీవనం అంటే. దూరదూరంగా ఉన్నా... వారంలో నాలుగైదు గంటలే కలిసి గడిపినా... తృప్తిగా, సంతోషంగా, ప్రేమగా గడపాలి. ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వాలి. ఒకరి సంతోషం కోసం ఒకరు అన్నట్టుగా జీవించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే... ఒకరి జీవితంలో ఒకరు, ఒకరి మనసులో ఒకరు ఉండాలి తప్ప ఒకే ఇంట్లో ఇద్దరూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు.