అనిరుద్ చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: అనిరుధ్‌కు టైమ్ వచ్చింది. అనిరుధ్ అనగానే సంగీత దర్శకుడు అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. అనిరుధ్ పేరుతో చిత్రం రూపొందింది. ఈ చిత్ర విడుదలకు టైమ్ వచ్చింది. తెలుగులో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడుగా నటించిన కలర్‌ఫుల్ భారీ చిత్రం బ్రహ్మోత్సవం. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలుగా నటించిన ఇందులో సత్యరాజ్, జయసుధ, రేవతి భారీ తారాగణం నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనర్ సంస్థ సమర్పణలో స్వాతి, వర్షిణి భద్రకాళి ఫిలింస్ పతాకంపై భద్రకాళి ప్రసాద్ తమిళంలోకి అనిరుధ్ పేరుతో అనువదించారు.
ఈయన ఇంతకుముందు సెల్వందన్, ప్రభాస్ బాహుబలి, ఇదుదాండా పోలీసు, మగధీర, బ్రూస్‌లీ, ఎవండు వంటి భారీ చిత్రాలను తమిళంలోకి అనువదించారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనిరుధ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 3న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబం, అనుబంధాల విలువలను ఆవిష్కరించే చిత్రంగా అనిరుధ్ ఉంటుందని తెలిపారు. చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందాయని, చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఏఆర్‌కే రాజా అనువాద రచన చేసిన ఈ చిత్రానికి అడ్డాల వెంకటాద్రి, సత్యసీతలన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment