బ్రహ్మోత్సవం రిజల్ట్కు కారణం అదేనా..? | reason behind brahmotsavam result | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవం రిజల్ట్కు కారణం అదేనా..?

Published Thu, May 26 2016 11:56 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

బ్రహ్మోత్సవం రిజల్ట్కు కారణం అదేనా..? - Sakshi

బ్రహ్మోత్సవం రిజల్ట్కు కారణం అదేనా..?

సినీరంగంలో సెంటిమెంట్లను నమ్మేవాళ్లు చాలా ఎక్కువ. సూపర్ స్టార్లు కూడా ఈ సెంటిమెంట్ లకు అతీతులేం కాదు. అంతలా నమ్మటానికి ఇండస్ట్రీలో చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. తాజాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం రిజల్ట్ విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంటే పని చేసిందంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా అభిమానులను అలరించలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి అనుకుంటాన్నారా..? గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన రెండు సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలో మహేష్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఒక్కడు లాంటి సూపర్ హిట్ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా నిజం, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2003 మే 23న రిలీజ్ అయ్యింది. మహేష్ నటనకు మంచి మార్కులే పడినా... సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

తరువాత మరోసారి నాని సినిమాతో మే నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చాడు మహేష్. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య మహేష్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మహేష్ సొంతం నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ సినిమా 2004 మే 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా ప్రిన్స్ అభిమానులను అలరించలేకపోయింది.

ఆ తరువాత మే నెలలో మహేష్ నటించిన సినిమాలేవి రిలీజ్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా మే 20న ఆడియన్స్ ముందుకు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా పై విమర్శలు వస్తుండటంతో మహేష్కు మే నెల అచ్చిరాదని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement