Chiranjeevi, Mahesh Babu And Other Star Hero Cinemas Releasing This Summer - Sakshi
Sakshi News home page

Movie Releases In Summer: సమ్మర్‌కి సై అంటున్న స్టార్‌ హీరోలు

Published Sat, Aug 27 2022 8:43 AM | Last Updated on Sat, Aug 27 2022 1:50 PM

Chiranjeevi, Mahesh Babu And Other Star Hero Cinemas Releasing This Summer - Sakshi

వేసవి సీజన్‌ అంటే సినిమా పండగ. ఈ సీజన్‌లో ఎన్ని సినిమాలు విడుదలైనా టికెట్లు తెగుతాయి. అందుకే సమ్మర్‌కి సినిమాలను రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ‘సమ్మర్‌కి సై’ అంటూ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న, రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రాల గురిం తెలుసుకుందాం.  

వేసవి అంటే దాదాపు మార్చి నుంచి ఆరంభమవుతుంది. మార్చిలో ఇప్పటివరకూ విడుదల తేదీ ఖరారు చేసుకున్న చిత్రాల్లో నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ ఉంది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌ కానుంది. శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘నేను లోకల్‌’ చిత్రం తర్వాత నాని, కీర్తీ సురేష్‌ జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినివను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో ఇప్పటికే విడుదల తేదీ ఖరారు చేసుకున్నవాటిలో చిరంజీవి, మహేశ్‌బాబుల చిత్రాలు ఉన్నాయి.

 చిరంజీవి హీరోగా మోహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘బోళా శంకర్‌’ చిత్రం రపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.  చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్‌ చేస్తున్నారు. అనిల్‌ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ కానుంది. ఇక ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మూడో సినివ రపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినివ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా షటింగ్‌ ఇంకా ఆరంభం కాలేదు. సెప్టెంబరు లేదా అక్టోబరు మొదటివారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుందట.

మరోవైపు బాలకృష, పవన్‌ కల్యాణ్‌ కూడా వేసవి బరిలో నిలిచే అవకాశం ఉంది. బాలకృష, హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రపొందనున్న సంగతి తెలిసిందే. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి ఈ సినివను నిర్మించనున్నారు. త్వరలో షటింగ్‌ ఆరంభం కానుంది. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. అలాగే పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రపొందుతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’ కూడా సమ్మర్‌కే రానుంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌ విలన్‌గా నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏయం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్‌ చేసే ప్లాన్స్‌ ఉన్నట్లుగా ఇటీవల ఓ సందర్భంలో ఏయం రత్నం పేర్కొన్నారు.

కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కూడా సమ్మర్‌ సందడిలో ఉండే అవకాశం ఉంది. ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రపొందనుంది.  కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ఈ సినివను నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం పాన్‌ ఇండియా అప్పీల్‌ ఉండే కథను రెడీ చేస్తున్నారట కొరటాల. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఈ సినివను వేసవిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు రామ్‌చరణ్‌ హీరోగా తమిళ దర్శకుడు శంకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినివ షటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రం కూడా వేసవి బరిలో నిలుస్తుందని టాక్‌. మేలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని భోగట్టా. మరికొన్ని భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు, మీడియమ్, స్మాల్‌ బడ్జెట్‌ చిత్రాలు కూడా సమ్మర్‌లో రిలీజ్‌ కానున్నాయి.    మ్మర్‌కి సై 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement