ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల.. | Brahmotsavam poster hurts Mahesh fans | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల..

Published Mon, May 30 2016 3:42 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల..

ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల..

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఫ్యాన్స్ను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. కాన్సెప్ట్ బావున్నా.. కథని తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడన్నది విశ్లేషకుల మాట. రకరకాల కామెంట్లతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాను ఏకిపారేస్తున్నారు. బ్రహ్మోత్సవం ఫలితం విషయంలో పూర్తిగా బాధ్యత తనదేనని, దర్శకుడిని ఎంచుకుంది తానేనంటూ మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు.

అయితే తాజాగా ఓ గోడపై అంటించిన బ్రహ్మోత్సవం పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఆ పోస్టర్ ఎవరి పనో అంతుబట్టలేదుగానీ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రిన్స్ ఫ్యాన్స్ని రెచ్చగొడుతుంది. 'బోర్ సీన్స్ తీసినందువల్ల చూడదగ్గ కుటుంబ కథా చిత్రం' అని రాసున్న బ్రహ్మోత్సవం పోస్టర్ కడపలో దర్శనమిచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ ఎడిట్ చేసిన మాట నిజమేగానీ.. అయితే ఈ రకమైన ప్రచారం మాత్రం మహేష్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement