Avengers
-
'అవెంజర్స్' కొత్త సినిమా.. సూపర్ విలన్‌గా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ
మార్వెల్ సినిమాలు చూసేవాళ్లకు ఐరన్ మ్యాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ పాత్ర పోషించడం వల్ల రాబర్డ్ డౌనీ జూనియర్ వరల్డ్ వైడ్ అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాలో ప్రపంచాన్ని కాపాడుతూ చనిపోయాడు. దీంతో ఆ పాత్రని అభిమానించే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)కానీ ఇప్పుడు ఐరన్ మ్యాన్ సరికొత్త పాత్రతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు సూపర్ హీరోగా సాహసాలు చేసిన రాబర్ట్.. రాబోయే 'అవెంజర్స్ డూమ్స్ డే' చిత్రంలో డాక్టర్ డూమ్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. 'ఎండ్ గేమ్' మూవీకి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్... కొత్త ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ లాంచ్ జరగ్గా.. 2026 మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఏదేమైనా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ మాత్రం మార్వెల్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)"New mask, same task.”Robert Downey Jr. surprises Hall H to announce his return to the MCU as Doctor Doom in Avengers: Doomsday, in theaters May 2026. #SDCC#PVRINOX #Doomsday #robertdowneyjr #MarvelStudios pic.twitter.com/HN0oOIrHm8— INOX Movies (@INOXMovies) July 28, 2024 -
మళ్ళీ అవెంజర్స్ కి మంచి రోజులు వస్తాయి.?
-
సీక్రెట్ వార్స్‌కు చాన్స్ ఇవ్వండి
హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. ఈ ఫ్రాంచైజీ నుంచి తాజాగా ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ సినిమా రానుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ తనకు దక్కితే బాగుంటుందని దర్శక–నిర్మాత, రచయిత శ్యాముల్ ఎమ్ రైమి చేసిన వ్యాఖ్యలు హాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక దర్శకుడిగా ‘ది ఈవిల్ డెడ్’, ‘ది ఈవిల్ డెడ్ 2’, ‘స్పైడర్ మేన్’, ‘స్పైడర్ మేన్ 2’, ‘స్పైడర్ మేన్ 3’ వంటి సినిమాలను తెరకెక్కించారు శ్యాముల్. మరి.. ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ శ్యాముల్ కోరుకున్నట్లు ఆయనకు దక్కుతుందా? అనేది చూడాలి. మరోవైపు ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ సినిమాలోని ప్రధాన తారాగణాన్ని ఇంకా ప్రకటించలేదు మార్వెల్ సంస్థ. అయితే టామ్ హాలండ్, క్రిస్ హెమ్వర్త్, ఆంథోనీ మాకీ లీడ్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. -
కాంట్రవర్సీ స్టోరీ దెబ్బకి మార్వెల్ హీరోస్ మటాష్
-
కొంపముంచిన మంచు.. స్టార్ నటుడి పరిస్థితి విషమం
అమెరికాలో కురుస్తున్న మంచు తుపాను కారణంగా హాలీవుడ్ స్టార్ నటుడు ప్రమాదానికి గురయ్యారు. ది అవెంజర్స్ నటుడు, కెప్టెన్ అమెరికా ఫేమ్ స్టార్ యాక్టర్ జెరెమి రెన్నర్కు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నటుడిని వెంటనే స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జెరెమి రెన్నర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవల అమెరికాలో మంచు తుపాను కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. దీంతో అవి తొలగించటానికి అక్కడి ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచును తొలగిస్తుండగా హాలీవుడ్ స్టార్ యాక్టర్, అవెంజర్స్ ఫేమ్ జెరెమి రెన్నర్ ప్రమాదానికి గురయ్యారు. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
మార్వెల్ సూపర్ హీరోలో కొత్త అవతారమెత్తిన హాలీవుడ్ యాక్షన్ హీరో!
డిస్నీ - మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించే అవెంజర్స్ తదితర సూపర్ హీరో సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సూపర్ హీరో సినిమాల సిరీసుల్లో ఐరెన్ మాన్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఐరన్ మాన్ మూవీ సిరీస్‌తో పాటు అవెంజర్స్ మూవీ సిరీస్‌లో కూడా ఐరెన్ మాన్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, అయితే అవెంజన్ ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ముగిసిపోతుంది. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ తరువాత వచ్చిన మార్వెల్ సూపర్ హీరో సినిమాల్లో ఐరెన్ మ్యాన్ తిరిగివస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు వాటికి మరింత ఊతం ఇచ్చే రీతిన మార్వెల్ స్టూడియోస్ వారి నుంచి వస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ చిత్రంలో ఐరన్ మాన్ తిరిగి వస్తున్నాడని తెలిసింది. ఈ పాత్రను ప్రముఖ ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ పోషిస్తున్నారు అనే వార్తలు ఇప్పుడు అంతటా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా విడుదలైన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మే 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది. -
అవెంజర్స్: ‘ఎటర్నెల్స్’ లో కీలక పాత్ర షోషిస్తున్న ఏంజెలీనా జోలీ
దీపావళీ కానుకగా నవంబర్ 4న డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుదల కానుంది. ఎవెంజర్స్ సిరీస్ ఎండ్ అవ్వడంతో హాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మార్వెల్ వారు ఎటర్నెల్స్ అనే కొత్త సూపర్ హీరోల్ని సృష్టించారు, భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన భాషల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. థేనా అనే సూపర్ వుమెన్ గెటెప్ లో ఏంజెలీనా తన ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎవెంజర్స్కి మించిన పవర్స్‌తో ఎటర్నెల్స్లో సూపర్ హీరోలు అద్భుతమైన విన్యాసాలు చేయనున్నారు. అలానే ఈ సినిమాలో ఇండియన్ వెడ్డింగ్‌కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయని డిస్నీ ఇండియా బృందం తెలిపింది. బిగ్ స్క్రీన్ పై ఎటర్నెల్స్ లో ఉన్న సూపర్ హీరోలు ప్రేక్షకులకి వీనుల విందు ఇవ్వనున్నట్లుగా మూవీ టీమ్ ప్రకటించింది. చదవండి: అవెంజర్స్ నటుడు క్రిస్ ఎవాన్స్‌తో పాప్ సింగర్ సెలెనా డేటింగ్? -
అవెంజర్స్ సూపర్ విలన్‌పై మ్యాన్ క్రష్ ఉందంటున్న ఆక్వామ్యాన్ స్టార్
హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన జాసన్ మోమోవాకి ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ యాక్షన్ హీరో ప్రస్తుతం చేస్తున్న మూవీ డ్యూన్. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇందులో తన కో-స్టార్ జోష్ బ్రోలిన్పై క్రష్ ఉందని తెలిపాడు. డ్యూన్ సినిమాలో పనిచేయడంతో తన ఫేవరెట్ యాక్టర్స్‌తో నటించే అవకాశం కలిగిందని జాసన్ తెలిపాడు. అతను మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పనిచేసిన చాలా మందిపై నాకు మ్యాన్ క్రష్ ఉంది. ముఖ్యంగా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’లో విలన్‌గా చేసిన జోష్ బ్రోలిన్పై ఇంకా ఎప్పటినుంచో ఉండేది. అతను నాకు సోదరుడిలాంటి వాడు. చాలా విషయాల్లో మాకు పోలికలు ఉంటాయి. మేము ఈ బ్రోమాన్స్ని ఎంజాయ్ చేస్తున్నాం’ అని చెప్పాడు. కాగా అకాడమీ అవార్డు నామినేషన్ దక్కించుకున్న ఈ మూవీ అక్టోబర్ 22న ఇండియాలో విడుదల కానుంది. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం -
ఆ నటుడితో సింగర్ డేటింగ్?
మార్వెల్ సంస్థ నిర్మించిన అవెంజర్స్ సిరీస్‌లో కెప్టెన్ అమెరికాగా చేసిన క్రిస్ ఎవాన్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే పాప్ సింగర్ సెలెనా గోమెజ్‌కి కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి గురించి క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. గతంలో ఓ షోలో పాల్గొన్న సెలెనాని ‘ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు, మీ నంబర్ వన్ హాలీవుడ్ క్రష్ ఎవరు? అని హోస్ట్ అడగగా.. ‘నాకు క్రిస్ ఎవాన్స్‌పై క్రష్ ఉంది. అతను చాలా అందంగా ఉంటాడ’ని తెలిపింది. కాకపోతే అతనితో ప్రేమ అనేది జరగక పోవచ్చని ఈ బ్యూటీ చెప్పింది. అయితే తాజాగా కెప్టెన్ అమెరికా నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సెలెనాని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి అభిమానులు సైతం వారు ప్రేమలో ఉన్నారంటూ కొన్ని పిక్స్‌ను వైరల్ చేస్తున్నారు. కాగా వారిద్దరూ కలిసినట్లు ఫోటోకి ఒకటి కూడా లేకపోవడం గమనార్హం. కాగా క్రిస్ ఇంతకుముందు జెస్సికా బీల్, జెన్నీ స్లేట్తో డేటింగ్ చేయగా.. ఈ పాప్ సింగర్ ఫేమస్ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్, ప్రియాంక చోప్రా హజ్బెండ్‌తో డేటింగ్ చేసింది. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం -
ఆకట్టుకుంటున్న మార్వెల్ ‘హాక్ ఐ’ ట్రైలర్
హాలీవుడ్ సినిమాల్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్(ఎమ్‌సీయూ) మూవీస్‌కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎమ్‌సీయూ నుంచి 2019లో వచ్చిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. జేమ్స్ కామెరూన్ ఫాంటసీ మూవీ ‘అవతార్’ని దాటి ప్రపంచంలోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా అవెంజర్స్ నిలిచింది. ఆ ఫ్రాంఛైజీలో ఇప్పటికే 25కి పైగా సినిమాలు, కొన్ని టీవీ సిరీస్‌లు రిలీజై ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజాగా ఆ ఎమ్‌సీయూ నుంచి వస్తున్న మరో టీవీ సిరీస్ ‘హాక్ ఐ’. దీనికి సంబంధించి ఇంగ్లీష్ ట్రైలర్ సోమవారం (సెప్టెంబర్ 13న) విడుదలైంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తర్వాత నుంచి కథ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్వెల్ మూవీస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాగా ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 24న విడుదల కానుంది. అయితే ఇటీవల ఈ ఫ్రాంఛైజీ నుంచి ‘షాంగ్ చీ: ది లెజెండ్ ఆఫ్ టెన్ రింగ్స్’ విడుదలై ఎమ్సీయూలోనే బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. -
అవెంజర్స్ సుందరికి పెళ్లైందా?
లాస్ ఏంజెల్స్: మార్వెల్ ‘అవెంజర్స్’ సిరీస్‌లో వాండా మాగ్జిమాఫ్ అలియాస్ స్కార్లెట్ విచ్ క్యారెక్టర్‌తో అలరించింది నటి ఎలిజబెత్ ఓల్సెన్. ఓల్సెన్కు హాట్ నటిగా యూత్‌లో మంచి క్రేజ్ కూడా ఉంది. అయితే తనకు పెళ్లైందనే విషయం.. పొరపాటుగా అందో లేదా కావాలనే అందోగానీ ఇప్పుడది హాలీవుడ్ వర్గాల్లో టాపిక్‌గా మారింది. ఓల్సెన్ రీసెంట్గా యాక్టర్స్ ఆన్ యాక్టర్స్ అనే ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ వీడియో ఇంటర్వ్యూలో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న వాండావిజన్ ముచ్చట్లు పంచుకుంది. అంతేకాదు రెండో సీజన్ ఉండదని క్లారిటీ ఇచ్చింది కూడా. ఒకానొక టైంలో ఓల్సెన్, నటి కేలీ క్యూకోతో మాట్లాడుతుండగా రాబీ అమెట్ట్ను తన భర్తగా పేర్కొంది. రాబీ, ఓల్సెన్ 2016 నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు కూడా. ఇప్పుడామె ‘భర్త’ అని సంభోధించడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అని హాలీవుడ్ మీడియా హౌజ్‌లు చర్చించుకుంటున్నాయి. అయితే నవ్వుతూనే ఆ మాట అనడంతో ఆమె జోక్ చేసి ఉండొచ్చని నటుడు మార్క్ రఫెల్లో(అవెంజర్స్ హల్క్) అంటున్నాడు. ఇక వీళ్ల పెళ్లి గురించి సన్నిహితులుగానీ, కుటుంబ సభ్యులుగానీ స్పందించకపోవడం విశేషం. కాగా, నాలుగేళ్ల వయసుకే ఓల్సెన్ యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టింది. మార్థా మార్సీ మే మార్లెనె(2011)తో హీరోయిన్గా మారడంతో.. తొలి సినిమాకే అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ‘రెడ్ లైట్స్, సైలెంట్ హౌజ్, కిల్ యువర్ డార్లింగ్స్, గాడ్జిల్లా(2014), విండ్ రివర్ సినిమాలతో పాటు అవెంజ్స్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. -
'పుష్ప'పై కాంట్రవర్సీ.. కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన హ్యట్రిక్ చిత్రం ‘పుష్ప’. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవలె రిలీజ్ అయిన పుష్ప టీజర్ ప్రస్తుతం కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. ఇందులోని మ్యూజిక్‌ను దేవీ కాపీ కొట్టారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల అవుతున్నాయి. బన్నీ బర్త్‌డే(ఏప్రిల్ 8) సందర్భంగా విడుదలైన టీజర్...ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్, 9 లక్షలకు పైగా లైకులు సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ బీజీఎంను ప్రముఖ హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి దేవీ శ్రీ కాపీ కొట్టాడని పలువరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టీజర్ మొత్తానికి హైలెట్‌గా నిలిచిన దేవీ మ్యూజిక్ తన సొంతంగా కంపోజ్ చేసింది కాదని, ఇది పక్కా కాపీ పేస్ట్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై మూవీ టీం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. It's just a coincidence franss 🏃 Paavam DSP !! pic.twitter.com/T3Svk9g7yK — Chandu Tarak ⚡ (@ChanduTarak99) April 7, 2021 చదవండి : పుష్ప : అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతంటే? బన్నీ ఖాతాలో మరో అరుదైన ఘనత.. అది ‘పుష్ప’కే సొంతం -
ఇండియన్ అవెంజర్స్ వచ్చేశారు
హాలీవుడ్ సినిమాలు చూసే వారికి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు ‘ అవెంజర్స్’ . ఈ సినిమా సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై అభిమానుల అనుకరణ వీడియోలు, స్పూఫులు ఇలా అనేకం వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి కూడా. ప్రస్తుతం ‘దేశీయ అవెంజర్స్’ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెడీ ప్రధానంగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. తారా దేశ్‌పాండే అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో శనివారం దీన్ని విడుదల చేశారు. ( 30 ఏళ్ల కృషి; ఆనంద్ మహింద్రా ఔదార్యం) ‘‘ఈ వీడియో ఉదయం వాట్సాప్‌లో వచ్చింది. దాదాపు 10 నిమిషాలు నవ్వు ఆపలేకపోయాను. చాలా బాగుంద’’ని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ తీశారన్నది తెలియరాలేదు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మన ఇండియన్ అవెంజర్స్ వచ్చేశారు.. వీడియో సృజనాత్మకంగా ఉంది.. కెప్టెన్ అమెరికా స్కూటర్ టైర్‌తో ఉన్నాడు.. దేశీయ అవెంజర్స్ ఏకమయ్యారు ’ ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Have been laughing for 10 straight minutes after I received this on WhatsApp this morning. So cute!! 😂.#AvengersEndgame pic.twitter.com/KMeIW81iXM — Tara Deshpande (@Tara_Deshpande) September 19, 2020 -
2019: బుక్‌మై షోలో రికార్డు సృష్టించిన సినిమాలు
భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. బయోపిక్ ట్రెండ్లను దాటి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. దేశంలో చోటు చేసుకుంటున్న ప్రధాన సంఘటనలను కూడా తెరకెక్కించవచ్చని ఉరి: ద సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ నిరూపించాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్న జనం చిన్న సినిమాలను ఆదరిస్తున్నారని ప్రాంతీయ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి కావాల్సిన కొలమానాలు మారిపోయాయి. కేవలం కలెక్షన్లు వచ్చిన సినిమాలే కాకుండా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ పరీక్షలో పాస్ అయినట్టు లెక్క. ఇది కొత్తసంవత్సరంలోనూ కొనసాగనుంది. ఇక ఈ ఏడాది భారత చిత్రపరిశ్రమలో సాహసాలు చేసిన సినిమాలు కొన్ని అంచనాలకు మించి సక్సెస్ అవుతే మరికొన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. సినిమా బాగుందంటే చాలు.. ప్రాంతీయ, జాతీయ బేధాలను లెక్క చేయకుండా ఆ సినిమాలను నెత్తిన పెట్టుకుని ఆదరించడమే భారతీయ చిత్ర పరిశ్రమ లక్షణం. ఈ క్రమంలో 2019కు గానూ జాతీయ అంతర్జాతీయ సినిమాలు ఏవి టాప్‌లో నిలిచాయో రౌండేద్దాం.. బుక్‌మైషోలో రికార్డు ఒకప్పటిలా సినిమా చూడాలంటే పొద్దునే లేచి బారెడంత క్యూలో నిలబడాల్సిన పని లేదు. సినిమా విడుదల కాక ముందే ఫోన్లో ఉన్న యాప్‌తో టికెట్ కొనేసి రెడీగా ఉండచ్చు. ఇలాంటి యాప్‌లు ఈ మధ్య కాలంలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే సినిమా టికెట్లతో పాటు, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకు సైతం టికెట్లు బుక్ చేసుకునే ‘బుక్ మై షో’ ఓ ముఖ్య విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది బుక్‌మైషోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘అవెంజర్స్: ది ఎండ్‌గేమ్’ అనే హాలీవుడ్ మూవీ రికార్డు సృష్టించింది. 5.7 మిలియన్ల టికెట్ల అమ్మకాలతో భారతీయ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ రెండో స్థానంలో చోటు దక్కించుకుంది. విమ టాప్ టెన్ ఇండియన్ సినిమాలు ► అవెంజర్స్: ఎండ్‌గేమ్ ► ఉరి: ద సర్జికల్ స్టైక్ ► కబీర్ సింగ్ ► సాహో ► వార్ ► ద లయన్ కింగ్ ► మిషన్ మంగళ్ ► సింబా ► గల్లీబాయ్ ► చిచోరే భారత్‌లో హవా కనబర్చిన అంతర్జాతీయ సినిమాలు జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్ వండర్ వెధరింగ్ విత్ యు పాడింగ్టన్ 2 బ్లూ ప్లానెట్ 2 హస్ట్లర్స్ విలేజ్ రాక్‌స్టార్స్ మైల్ 22 హరే కృష్ణ ఎ ప్రైవేట్ వార్ టాప్ 5 తెలుగు సినిమాలు ⇔ సైరా సరసింహ రెడ్డి ⇔ సాహో ⇔ మహర్షి ⇔ ఎఫ్2 ⇔ మజిలీ టాప్ 5 బెంగాలీ సినిమాలు ♦ దుర్గేష్గోరర్ గుప్తోధోన్ ♦ గుమ్నామీ ♦ కొంఠో ♦ మిటిన్ మషి ♦ గోట్రో టాప్ 5 తమిళ సినిమాలు ⇒ బిగిల్ ⇒ పేట ⇒ విశ్వాసం ⇒ నెర్కొండ పార్వై ⇒ ఖైదీ టాప్ 5 మరాఠీ సినిమాలు • ముంబై పుణె ముంబై 3 • ఠాక్రే • హిర్కానీ • ఆనంది గోపాల్ • భాయ్- వ్యక్తి కి వల్లి -
ఈసారీ ఆస్కారం లేదు!
మరో ఏడాది. మరో నిరాశ. మరో నిరుత్సాహం. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ని అందుకోవాలనే ఆశ అలానే మిగిలిపోనుంది. 92వ ఆస్కార్ అవార్డులకి ఈ ఏడాది మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా నిలిచిన హిందీ చిత్రం ‘గల్లీ బాయ్’ ఆస్కార్ విడుదల చేసిన షార్ట్ లిస్ట్‌లో చోటు సాధించలేకపోయింది. ఆస్కార్ ఆశల్ని తొలి దశలోనే తుంచేసింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ పోటీల్లో మన దేశం తరఫున నిలబడటానికి ఈ ఏడాది 28 సినిమాలు పోటీపడ్డాయి. ప్రపంచంవ్యాప్తంగా ఈ విభాగంలో 91 సినిమాలు ఆయా దేశాలు నుంచి నామినేట్ చేశారు. మన దేశం తరఫున ‘గల్లీ బాయ్’ని పంపాం. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జోడీగా జోయా అక్తర్ తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ బాయ్’. ర్యాపర్ కావాలనుకునే ముంబై మురికివాడ కుర్రాడిగా ఇందులో రణ్వీర్ కనిపించారు. ర్యాపర్‌గా తన కలను ఎలా చేరుకున్నాడు అన్నది కథ. 40 కోట్లతో తీస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసింది ‘గల్లీ బాయ్’. అయితే ఆస్కార్ నామినేషన్ దక్కించుకోలేదు. 91 సినిమాలను ఫిల్టర్ చేసి పది సినిమాలకు కుదించి షార్ట్ లిస్ట్‌ను ప్రకటించింది ఆస్కార్. ఈ పది సినిమాల జాబితాలోకి ‘గల్లీ బాయ్’ ప్రవేశించలేకపోయాడు. 92వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ షార్ట్ లిస్ట్‌ను మంగళవారం ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. 9 విభాగల ఈ జాబితాలో విభాగానికో పది సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసి ప్రకటించారు. ఉత్తమ విదేశీ చిత్రం, డాక్యుమెంటరీ మూవీ, డాక్యుమెంటరీ షార్ట్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్), లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఎంపికయిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత ఒక్కో విభాగంలో 5 సినిమాలను తుది జాబితాగా పరిగణించి ఒక్క సినిమాకి అవార్డు ప్రదానం చేస్తారు. ఆస్కార్ నామినేషన్ ఓటింగ్స్ వచ్చే ఏడాది జనవరి 2న ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకూ ఓటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఆ జాబితాను జనవరి 13న ప్రకటిస్తారు. దాని తర్వాత జనవరి 30న తుది జాబితాకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలువుతుంది. ఫిబ్రవరి 4 వరకూ ఈ ఓటింగ్ సాగుతుంది. ఐదు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. హాలీవుడ్ అండ్ హైల్యాండ్ సెంటర్లో జరగబోయే 92వ ఆస్కార్ వేడుక ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారం కానుంది. సుమారు 225 దేశాల్లో ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆస్కార్ అవార్డులు సినిమా ప్రియులకు పండుగే. కానీ హాలీవుడ్ చిత్రాల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ ఫంక్షన్‌ను అన్ని దేశాల వాళ్లు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని వందల సినిమాల్లో ఒక్క దేశం ఆస్కార్ దక్కించుకోకపోతే చిన్నబోవాల్సిన అవసరం ఏంటి? అనే వాదనలూ ఉన్నాయి. ‘ఆస్కార్ అవార్డులు ప్రపంచ స్థాయివేం కాదు. చాలా లోకల్ అవార్డులు’ అని అభిప్రాయపడ్డారు కొరియన్ సినిమా ‘ప్యారసైట్’ దర్శకుడు బాంగ్ జూన్–హో. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఫలితం ఆస్కార్ ఓటింగ్‌కి వదిలేద్దాం! ప్రతి ఏడాది ఇస్తూ వస్తున్న ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీను ఈసారి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరు మార్చారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎంపికయిన సినిమాలు. 1. ది పెయింటెడ్ బర్డ్ (చెక్ రిపబ్లిక్), 2. ట్రూత్ అండ్ జస్టిస్ (ఎస్టోనియా), 3. లెస్ మిసరబుల్స్ (ఫ్రాన్స్), 4. దోస్ హూ రిమైండ్ (హంగేరి), 5. హనీ ల్యాండ్ (నార్త్ మెకడోనియా), 6. కోర్పస్ క్రిస్టీ (పోల్యాండ్), 7. ‘బీన్ పోల్ (రష్యా), 8. అట్లాంటిక్స్ (సెనెగల్), 9. ప్యారసైట్ (సౌత్ కొరియా), 10. పెయిన్ అండ్ గ్లోరీ (స్పెయిన్). మార్వెల్ వర్సెస్ డీసీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ కామిక్ బుక్స్ నుంచి సూపర్ హీరోల సినిమాలు తీసి బస్టర్స్ సాధి స్తుంటాయి నిర్మాణ సంస్థలు. కానీ ఆ సినిమాలను పెద్దగా పరిగణలోకి తీసుకోదు ఆస్కార్. టెక్నికల్ విభాగాల్లో కొన్నిసార్లు అవార్డు ఇచ్చి వెన్ను తట్టింది కానీ సూపర్ హీరో సినిమాలంటే ఆస్కార్‌కి చిన్న చూపే. అయితే ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సూపర్ హీరో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్’ వివిధ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. మార్వెల్ సంస్థ నుంచి వచి్చన ‘ఎండ్ గేమ్’ బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), విజువల్ ఎఫెక్ట్స్ విభాగల్లో, ‘కెప్టెన్ మార్వెల్’ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నామినేట్ అయ్యాయి. డీసీ సంస్థ ఆస్కార్ బాధ్యతను ‘జోకర్’ భుజాలపై ఉంచింది. ఒరిజినల్ స్కోర్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్ విభాగాల్లో ‘జోకర్’ సినిమా నామినేట్ అయింది. చాన్స్ ఎవరికి? ప్యారసైట్ ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ దక్కే ఛాన్స్ ఎక్కువగా సౌత్ కొరియా చిత్రం ‘ప్యారసైట్’కి ఉందని విశ్లేషకుల అంచనా. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతానికైతే చాలామంది హాట్ ఫేవరెట్ ‘ప్యారసైట్’. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. -
‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ మళ్లీ వస్తోంది!
మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సూపర్ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవెంజర్స్ : ది ఎండ్ గేమ్. దీంతో ఈ సినిమా ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు అని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ రావటంతో వసూళ్ల పరంగానూ ఎండ్ గేమ్ సంచలనాలు సృష్టించింది. ఆ ఊపు చూసి అవతార్ రికార్డ్లను అవెంజర్స్ చెరిపేస్తుందని భావించారు చిత్రయూనిట్. కానీ మూడు వారాల తరువాత సీన్ మారిపోయింది. వరల్డ్ కప్ కూడా స్టార్ అవ్వటంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో మార్వెల్ సంస్థ కొత్త ప్లాన్ వేసింది. ఒరిజినల్ కంటెంట్ నుంచి మరికొంత ఫుటేజ్‌ను యాడ్ చేసి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అవతార్ రికార్డులు అందుకోవచ్చని భావిస్తున్నారు చిత్రయూనిట్. మరి మార్వెల్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
ఆ నమ్మకం భయపెడుతోంది
విన్ డీజిల్, రాబర్ట్ డౌనీ జూనియర్... ఒకరేమో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ టాప్ స్టార్. మరొకరు అవెంజర్స్‌లో రాక్‌స్టార్. తాజాగా రాబర్ట్ నాకు స్ఫూర్తి ఇస్తుంటాడు అని పొగడ్తల్లో ముంచెత్తారు విన్ డీజిల్. ఈ విషయాన్ని ఆయన పంచుకుంటూ– ‘‘తనకు ఎదురైన ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత స్ఫూర్తినింపుతుంటాడు రాబర్ట్. తను ఎంపిక చేసుకునే పాత్రలు కూడా అలానే ఉంటాయి. ప్రస్తుతం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయినప్పటికీ తను ఎప్పటిలానే ఉన్నాడు. ‘నెక్ట్స్ నీ సినిమా అలానే కలెక్ట్ చేస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరిస్ ఇండస్ట్రీను పెద్ద స్థాయి తీసుకెళ్తుంది’ అని చెబుతున్నాడు. ఆ నమ్మకం నన్ను చాలా భయపెడుతోంది. నీతో ఫ్రెండ్షిప్ దొరికినందుకు సంతోషంగా ఉంది రాబర్ట్’’ అన్నారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ∙విన్ డీజిల్, రాబర్ట్ -
టైటానిక్‌ను ముంచేశారు
... అవును ‘అవెంజర్స్’ సూపర్ హీరోస్ ‘టైటానిక్’ (1997)ను ముంచేశారు. ఈ విషయాన్ని టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌నే స్వయంగా చెప్పారు. ‘అవెంజర్స్’ ఫ్రాంౖచైజీలో ఇటీవల విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా బాక్సాఫీస్‌ను దుమ్ము రేగ్గొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్’ సినిమా రికార్డులను ఈ చిత్రం దాటేసింది. ఈ విషయంపై జేమ్స్ కామెరూన్ స్పందిస్తూ... ‘‘కెవిన్ ఫీజ్ (నిర్మాత, మార్వెల్ సంస్థ అధినేత) అండ్ అవెంజర్స్ టీమ్.. వాస్తవంలో ఓ మంచుకొండ నిజమైన టైటానిక్ షిప్‌ను ముంచేసింది. కానీ నా ‘టైటానిక్’ను మీ అవెంజర్స్ టీమ్ ముంచేశారు. లైట్స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో భాగస్వాములైన మేమంతా మీ విజయానికి సెల్యూట్ చేస్తున్నాం. సినిమా పరిశ్రమ మరింత ప్రగతిపథంలో ముందుకు వెళ్తోందని మీరు నిరూపించారు’’ అని అన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ (2009) కలెక్షన్స్‌ని కూడా ‘అవేంజర్స్: ఎండ్‌గేమ్’ దాటేస్తుందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ‘అవతార్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు జేమ్స్ కామెరూన్. ఈ చిత్రం 17 డిసెంబరు 2021న విడుదల కానుంది. -
టైటానిక్‌ని అవెంజర్స్ ముంచింది: కామెరూన్
'అవెంజర్స్' సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ప్రపంచం వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదలై వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ వసూళ్లపై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ట్విటర్లో వెరైటీగా స్పందించారు. టైటానిక్ చిత్రంలో ఐస్‌బర్గ్ షిప్‌ను ముంచేస్తే, వసూళ్లలో అవెంజర్స్ టైటానిక్‌ని ముంచినట్టు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. మార్వెల్ సంస్థ అధినేత కెవిన్, వారి టీమ్ సభ్యులను పనితీరును కొనియాడారు. 'నిజమైన టైటానిక్‌ని ఓ ఐస్‌బర్గ్ ముంచేస్తే, నా టైటానిక్‌ని మీ అవెంజర్స్ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్లోని ప్రతి ఒక్కరూ మీరు సాధించిన విజయానికి సెల్యూట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ బతికుండటం కాదు చాలా గొప్పగా ఉందని మీరు ప్రూవ్ చేశారు' అని జేమ్స్ ట్వీట్ చేశారు. pic.twitter.com/zfICH1XDCJ — James Cameron (@JimCameron) May 9, 2019 కాగా, 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. అడియన్స్ ఇంట్రెస్ట్‌కు తగ్గట్లే ‘అవతార్ 2,3,4,5’ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు జేమ్స్ కామెరూన్. తొలుత ‘అవతార్ 2’ చిత్రాన్ని 18 డిసెంబరు 2020న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 17 డిసెంబరు 2021లో విడుదల చేయనున్నట్లు తాజాగా జేమ్స్ కామెరూన్ తెలిపారు. -
వాళ్ళు తోపులు
-
మొత్తానికి మహేష్‌కు టిక్కెట్లు దొరికేశాయ్!
‘మహర్షి’తో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రిలాక్స్ అయినట్టున్నారు. ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న మహేష్.. ఆదివారం సాయంత్రం ఏఎమ్‌బీలో ప్రత్యక్షమయ్యారు. మహర్షి ప్రమోషన్స్‌లో భాగంగా.. అవేంజర్స్ చిత్రాన్ని వీక్షించారా అన్న ప్రశ్నకు మహేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చి అందర్నీ నవ్వించారు. ఏఎంబీలో తాను టిక్కెట్లు అడిగితే.. హౌస్‌ఫుల్ అయ్యాయని టిక్కెట్లు దొరకడం లేదని మహేష్ అన్నారు. మొత్తానికి ఆదివారం సాయంత్రం ఏఎమ్‌బీలో ‘అవేంజర్స్ ఎండ్‌గేమ్’ను వీక్షించినట్లు మహేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఏఎమ్‌బీలో మొదటి చిత్రం అంటూ.. సినిమా బాగా నచ్చిందని.. ఏఎమ్‌బీ ఎక్స్పీరియన్స్ బాగుందని.. ఏఎమ్‌బీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. పూజాహెగ్డే హీరోయిన్గా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. My first at @amb_cinemas ...#AvengersEndgame!! Loved the film and the experience ..Thankyou team AMB... You guys rock!!! 👍👍👍👏👏👏 pic.twitter.com/GlDOCqgBYq — Mahesh Babu (@urstrulyMahesh) May 5, 2019 -
దెబ్బకు ట్వీట్ డెలిట్ చేశాడు!
సినీ ప్రేమికులందరికీ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్లో ఆయన ఇచ్చే రివ్యూలకు, చెప్పే బాక్సాఫీస్ కలెక్షన్లపై అందరికీ ఎంతో నమ్మకం ఉంటుంది. అయితే ఈ సారి ఆయన చెప్పిన బాక్సాఫీస్ లెక్కలు తప్పాయి. అందులోనూ బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తక్కువ చేసి చూపడంతో ఆ చిత్ర నిర్మాత తరణ్ ఆదర్శ్‌కు చురకలంటించారు. ఆ దెబ్బతో ఆయన ఆ ట్వీట్‌ను డెలిట్ చేసేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ప్రపంచవ్యాప్తంగా అవేంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎండ్‌గేమ్ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని.. బాహుబలి2 రెండో స్థానంలోకి వెళ్లిందని ట్వీట్ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో మరో మూడు, నాలుగు హిందీ సినిమాల పేర్లు ఉన్నాయని తెలిపాడు. అయితే బాహుబలి నిర్మాత అయిన శోభు యార్లగడ్డ ఈ ట్వీట్‌కు స్పందించారు. మీరు లిస్ట్‌లో చేర్చిన సినిమాలను తక్కువ చేయాలని మాట్లాడటం లేదు.. కానీ మీరు చేసిన పోలిక మాత్రం సరైంది కాదు ఎందుకుంటే బాహుబలి2 అనేది కేవలం హిందీలో డబ్ కాగా ఆ చిత్ర వసూళ్లను.. మిగతా చిత్రాలతో ఎలా పోలుస్తారు అంటూ ప్రశ్నించారు. మిగతా సినిమాలన్నీ ఇండియా పాన్ సినిమాలని, అన్ని భాషల్లో కలిపి సాధించిన వసూళ్లతో బాహుబలి2ను ఎలా ఒకటిగా పరిగణిస్తారంటూ ట్వీట్ చేశారు. దీంతో తరణ్ ఆదర్శ్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. Not to take away the success any of the films listed below, I don't think this is a right comparison and doesn't put things in perspective especially from veteran trade analyst like yourself! BB2 one language (predominantly North India) vs all other films all languages pan India https://t.co/IP2d2BbMEK — Shobu Yarlagadda (@Shobu_) May 3, 2019 -
అవేంజర్స్‌ను వీక్షించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అవేంజర్స్ అద్భుత విన్యాసాలను ఆస్వాదిస్తున్నారు. ఈ హాలీవుడ్ చిత్రానికి ఇండియాలోనూ ఆదరణ లభిస్తోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవేంజర్స్ చిత్రాన్ని వీక్షించారు. నగరంలోని ఏఎంబీ మాల్లో వైఎస్ జగన్ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఎన్నికల్లో తీరిక లేకుండా, విరామమెరుగని శ్రామికుడిలా కష్టపడిన వైఎస్ జగన్.. పోలింగ్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ అవేంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని వీక్షించారు. -
వారం రోజుల్లో 300కోట్లు కొల్లగొట్టింది
‘అవెంజర్స్’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిన సంగతే. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ గత శుక్రవారం విడుదలైంది. ఇండియా వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. చైనాలో అయితే ఇప్పటికే 700కోట్లను కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8వేల కోట్లను కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ చిత్రం ఇండియాలో వారం రోజుల్లోనే 300కోట్లను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్‌వర్గాలు తెలిపాయి. ‘ఇన్ఫినిటీవార్’ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను 2 రోజుల్లో ‘ఎండ్‌గేమ్’ దాటేసింది. సూపర్ హీరో క్యారక్టర్స్ అయిన ఐరన్‌మేన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, స్పెడర్ మేన్, బ్లాక్ ప్యాంథర్‌లను ఓ చోట చేర్చి మార్వెల్ సంస్థ తొలుత ‘ది అవెంజర్స్’ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘ఇన్ఫినిటీ వార్’ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల ముగింపే ‘ఎండ్‌గేమ్’. ఈ చిత్రం తర్వాత మళ్లీ సూపర్ హీరోల పాత్రలు కనిపించకపోవచ్చు. అందుకే ఎన్నిసార్లు చూసినా చివరిసారి చూడటం ప్రత్యేకమన్నట్టు మార్వెల్ అభిమానులు మళ్లీ మళ్లీ ‘ఎండ్ గేమ్’చిత్రాన్ని వీక్షిస్తున్నారు. -
అనాథ పిల్లల కోసం అవెంజర్స్ షో
ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో సునామీ సృష్టిస్తున్న హాలీవుడ్ చిత్రం అవెంజర్స్. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తాను మాత్రమే చూసి ఎంజాయ్ చేయకుండా... తనతో పాటు అనాధ పిల్లల కోసం ప్రత్యేక షో వేసి ఔన్నత్యాన్ని చాటుకున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. అవెంజర్స్ సిరీస్ లో ఎండ్ గేమ్ చివరిది. దీంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. అవెంజర్స్ సిరీస్ కున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని.. అనాధ పిల్లలతో కలిసి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, గిరీష్, నవీన్ హైదరాబాద్ లోని సినిమాక్స్ పీవీఆర్ స్క్రీన్ లో వీక్షించారు. అక్షర్ కుటీర్ ఆశ్రమ్, గుడ్‌షెప్పర్డ్ ఆశ్రమ్, సుధీర్ ఫౌండేషన్, స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సోసైటి, నవజీవన్ ఫౌండేషన్ కు చెందిన పిల్లలు ఈ స్పెషల్ షో చూసి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... అవెంజర్స్ సినిమా పెద్దలతో పాటు పిల్లలు అమితంగా ఎంజాయ్ చేస్తారు. ‘ఈ పిల్లలతో కలిసి ఈ సినిమా చూసే అవకాశం... నాకు చాలా సంతోషాన్నిచ్చింది. పిల్లలంతా సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నా సినిమాలు అర్థం చేసుకునే వయసు వీరిది కాదు. అవెంజర్స్ లాంటి సూపర్ హీరోస్ సినిమా ఐతే బాగా ఎంజాయ్ చేయగలరనే... ఈ స్పెషల్ షో ప్లాన్ చేశాం. వారు నాపై చూపిస్తున్న ప్రేమను మాటల్లో చెప్పలేను’ అని అన్నారు.