
సినిమా: ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ మరో హాలీవుడ్ చిత్రంలో భాగం అయ్యారు. ఆయన అవేంజర్స్ ఎండ్‌గేమ్ చిత్ర హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ప్రచారం కోసం ప్రత్యేకంగా మార్వెల్ ఆంతంను రూపొందించారు. దీన్ని ఏప్రిల్ ఒకటవ తేదీన విడుదల చేయనున్నారు. దీని గురించి ఏఆర్.రెహ్మాన్ మాట్లాడుతూ హాలీవుడ్ చిత్రం అవేంజర్స్ ఎండ్‌గేమ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సహజంగానే మార్వెల్ సూపర్ హీరోల చిత్రాలను భారతీయ సినీ ప్రేక్షకులు విరివిగా చూస్తుంటారు. ఆ మధ్య తెరపైకి వచ్చిన అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం విశేష ఆదరణను పొందిన విషయం తెలిసిందే.
నా కుటుంబంలోనే నా చుట్టూ మార్వెల్ అభిమానులు ఉండడంతో అవేంజర్స్ చిత్రానికి చాలా సంతృప్తి కరంగానూ, తగినట్లుగా ప్రచార మార్వెల్ ఆంతంను రూపొందించాను. ఇది మార్వెల్ చిత్రాల అభిమానులనే కాకుండా సగటు సంగీత ప్రియులను ఈ అంతం అలరిస్తుందనే నమ్మకం నాకు ఉంది అని అన్నారు. అవేంజర్స్ ఎండ్‌గేమ్ ఒక చిత్రంగానే కాకుండా భారతదేశంలోని అన్ని వర్గాల ప్రేక్షకుల మనోభావాలకు దగ్గరగా ఉండే చిత్రంగా ఉంటుంది. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్‌తో మార్వెల్ ఆంతంను రూపొందించడమే కరెక్ట్ అని భావించి ఆయనతో బాణీలు కట్టించినట్లు అవేంజర్స్ ఎండ్‌గేమ్ చిత్ర ఇండియా హెడ్ బిక్రమ్ తుక్కల్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న ఆంగ్లం, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment