
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం 'ఛావా(Chhaava)'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్‌ను దాటేందుకు సిద్ధమైంది.
ఛావా కోసం కష్టపడ్డ హీరో
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఈ చిత్రాన్ని రూపొందించాడు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగి మరీ సాహసం చేశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పాట పాడిందెవరో తెలుసా?
ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమె ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఈ పాటను ఆలపించాడు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు.
మిలియన్ల వ్యూస్
ఈ పాట విన్న ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ.."ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని తెలిపింది.
చదవండి: కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే?
Comments
Please login to add a commentAdd a comment