పాప్ సింగర్ ఎడ్ షీరన్‌తో హిట్‌ సాంగ్‌ రీమిక్స్ చేసిన ఏఆర్‌ రెహమాన్‌ | AR Rahman And Ed Sheeran Voice With Hit Song From Premikudu | Sakshi
Sakshi News home page

హిట్‌ సాంగ్‌ను సరికొత్తగా వినిపించిన ఏఆర్‌ రెహమాన్‌, అంతర్జాతీయ సింగర్‌

Published Sat, Feb 8 2025 11:31 AM | Last Updated on Sat, Feb 8 2025 11:40 AM

AR Rahman And Ed Sheeran Voice With Hit Song From Premikudu

లండ్‌నుకు చెందిన పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ చెన్నైలో తన పాటలతో మెప్పించారు. చెన్నై నందనం YMCA మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన పాటలతో అభిమానులను మెప్పించారు. సంగీత దర్శకులు  ఏఆర్‌ రెహమాన్‌తో  'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో  ఉత్సాహాన్ని నింపారు.  పదకొండేళ్ల వయసు నుంచే పాటలు రాయడంతో పాటు పాడటం కూడా ఆయన ప్రారంభించాడు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఆయన సాంగ్స్‌కు దక్కుతుంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయన అభిమానులు ఉన్నారు.

చెన్నైలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఈ సంగీత కచేరిలో ఎడ్ షీరాన్ కు సంబంధించిన టాప్‌ సాంగ్స్‌ ఆలపించారు.  తనకు ప్రపంచ ప్రసిద్ధ గ్రామీ అవార్డు తెచ్చిపెట్టిన 'షేప్ ఆఫ్ యు' పాటను పాడుతూ ఉండగ సడెన్‌గా వేదికపైకి ఏఆర్‌ రెహమాన్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. 

1994లో విడుదలైన ప్రేమికుడు చిత్రం నుంచి  'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాట పాడుతూ వేదికపైకి రెహమాన్‌ చేరుకున్నారు. అభిమానుల కేరింతల మధ్య ఆ సమయంలో ఎడ్‌ షీరాన్‌ కూడా ఆ పాటకు తన గొంతు కలిపారు. దీన్ని ఊహించని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరిద్దరూ కొత్త తరహా రీమిక్స్ సంగీతాన్ని ప్రజలకు అందించారు. ఈ రీమిక్స్ సంగీతాన్ని నెటిజన్లు మరికొన్ని రోజులు ఉపయోగించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement