గత 14 ఏళ్ల నుంచి నార్వే చిత్రోత్సవారాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళంలో ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసి ప్రతి ఏడాది అవార్డులు ఇస్తుంటారు. అలా ఈ సారి కూడా 20 చిత్రాలకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్‌కి పురస్కారాలు అందజేయనున్నారు. అయితే వీరిలో దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కూడా ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న 21 సినిమాలు)
జనవరి 25న 15వ నార్వే చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉత్తమ చిత్రం 'చిత్తా' (నిర్మాత సిద్ధార్థ్), ఉత్తమ నటుడు సూరి (విడుదలై –1), ఉత్తమ నటి ప్రీతి అస్రాని (అయోతి), ఉత్తమ దర్శకుడు మారి సెల్వరాజ్ (మామన్నన్), ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (మామన్నన్, పొన్నియిన్ సెల్వన్–2), ఉత్తమ నిర్మాణ సంస్థ కేజే గణేష్ (చిత్రం యాత్తిసై ), ఉత్తమ ప్రతినాయకుడు ఫాహద్ ఫాజిల్ (మామన్నన్), ఉత్తమ సహాయ నటుడు (లేట్) పూరాము (చిత్రం కిడా), ఉత్తమ సహాయ నటి అబర్ణతి (ఇరుగపట్రు), ఉత్తమ గాయకుడు ఇళయరాజా (విడుదలై –1) ఉత్తమ గాయని శ్వేతామోహన్ (వాత్తి) అవార్డులు గెలుచుకున్నారు.
(ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది)
Comments
Please login to add a commentAdd a comment