ఆస్ట్రేలియా మోడల్ 'బియాంకా సెన్సోరి' (Bianca Censori) చేసిన పనితో ప్రపంచ పాశ్చాత్య దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమైన 67వ గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై బియాంకా చేసిన ప్రదర్శనపై నెటిజన్లు మండిపడుతున్నారు. తన భర్తను పక్కనే పెట్టుకుని కూడా ఆమె ఇంతటి నీచానికి ఎలా దిగజారింది అంటూ భగ్గుమంటున్నారు. గ్రామీ అవార్డ్స్‌కు ఆమె చెడ్డపేరు తీసుకొచ్చిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
30 ఏళ్ల బియాంకా సెన్సోరి ఆస్ట్రేలియాలో పేరుగాంచిన మోడల్‌గా గుర్తింపు ఉంది. అయితే, ఆమె తాజాగా తన భర్త కాన్యే వెస్ట్‌తో పాటుగా గ్రామీ-2025 అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొంది. అయితే, ఫోటో సెషన్ పాయింట్ వద్దకు వచ్చి ఫోజులు ఇచ్చిన ఆమె సడెన్‌గా తన దుస్తులను పూర్తిగా తొలగించి నగ్నంగానే కెమెరాల ముందు నిలబడింది. అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆపై అక్కడి నుంచి ఫోటలకు కూడా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఎక్స్ పేజీలో #BiancaCensori పేరుతో ఆ వీడియో భారీగా వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. బియాంకా సెన్సోరి తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. సెలబ్రిటీ అయితే చర్యలు తీసుకోరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
బియాంకా సెన్సోరి ప్రస్తుతం తన భర్తకు సంబంధించిన దుస్తుల కంపెనీ యీజీ (Yeezy) ఆర్కిటెక్చర్ హెడ్‌గా ఉంది. 2022లో అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలాంటి వివాధాలు ఈ జంటకు కొత్త కాదని తెలుస్తోంది. గతంలో కూడా ఆమె తన భర్త దుస్తులు తొలగించి మరింత దిగజారి ఫోటోకు ఫోజులు ఇచ్చి వైరల్ అయింది. వారిద్దరూ ప్లాన్ ప్రకారమే తమ దుస్తుల కంపెనీ బ్రాండ్‌ను వైరల్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గ్రామీ అవార్డ్ రేసులో బియాంకా భర్త ర్యాపర్ కాన్యే ఉన్నాడు. కానీ, అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చి రెడ్ కార్పెట్‌పై ఆమె దుస్తులు తొలగించడంతో నిర్వాహకులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే, అవార్డ్ రేసులో కాన్వే ఉన్నప్పటికీ గ్రామీ నుంచి అహ్వానం పంపలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పిలుపు లేకుండానే వారు వేడుకలకు వచ్చారని వారు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment