hollyweed
-
ఓటీటీలో 'ముఫాసా: ది లయన్ కింగ్' స్ట్రీమింగ్
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఒకరు స్క్రీన్‌రాంట్ మీడియాతో తెలిపారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో టైటిల్ రోల్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం. -
భర్త ముందే దుస్తులు తొలగించి ఫోజులిచ్చిన మోడల్
ఆస్ట్రేలియా మోడల్ 'బియాంకా సెన్సోరి' (Bianca Censori) చేసిన పనితో ప్రపంచ పాశ్చాత్య దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమైన 67వ గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై బియాంకా చేసిన ప్రదర్శనపై నెటిజన్లు మండిపడుతున్నారు. తన భర్తను పక్కనే పెట్టుకుని కూడా ఆమె ఇంతటి నీచానికి ఎలా దిగజారింది అంటూ భగ్గుమంటున్నారు. గ్రామీ అవార్డ్స్‌కు ఆమె చెడ్డపేరు తీసుకొచ్చిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.30 ఏళ్ల బియాంకా సెన్సోరి ఆస్ట్రేలియాలో పేరుగాంచిన మోడల్‌గా గుర్తింపు ఉంది. అయితే, ఆమె తాజాగా తన భర్త కాన్యే వెస్ట్‌తో పాటుగా గ్రామీ-2025 అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొంది. అయితే, ఫోటో సెషన్ పాయింట్ వద్దకు వచ్చి ఫోజులు ఇచ్చిన ఆమె సడెన్‌గా తన దుస్తులను పూర్తిగా తొలగించి నగ్నంగానే కెమెరాల ముందు నిలబడింది. అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆపై అక్కడి నుంచి ఫోటలకు కూడా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఎక్స్ పేజీలో #BiancaCensori పేరుతో ఆ వీడియో భారీగా వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. బియాంకా సెన్సోరి తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. సెలబ్రిటీ అయితే చర్యలు తీసుకోరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.బియాంకా సెన్సోరి ప్రస్తుతం తన భర్తకు సంబంధించిన దుస్తుల కంపెనీ యీజీ (Yeezy) ఆర్కిటెక్చర్ హెడ్‌గా ఉంది. 2022లో అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలాంటి వివాధాలు ఈ జంటకు కొత్త కాదని తెలుస్తోంది. గతంలో కూడా ఆమె తన భర్త దుస్తులు తొలగించి మరింత దిగజారి ఫోటోకు ఫోజులు ఇచ్చి వైరల్ అయింది. వారిద్దరూ ప్లాన్ ప్రకారమే తమ దుస్తుల కంపెనీ బ్రాండ్‌ను వైరల్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గ్రామీ అవార్డ్ రేసులో బియాంకా భర్త ర్యాపర్ కాన్యే ఉన్నాడు. కానీ, అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చి రెడ్ కార్పెట్‌పై ఆమె దుస్తులు తొలగించడంతో నిర్వాహకులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే, అవార్డ్ రేసులో కాన్వే ఉన్నప్పటికీ గ్రామీ నుంచి అహ్వానం పంపలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పిలుపు లేకుండానే వారు వేడుకలకు వచ్చారని వారు తెలుపుతున్నారు. -
చెల్లెలి కోసం...
డిస్నీ సంస్థ నుంచి వస్తున్న తాజా హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘ఫ్రోజెన్ 2’. భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ప్రాంతీయ భాషల్లో ఆయా ప్రాంతానికి చెందిన స్టార్స్‌తో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పించి సినిమాను ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. అన్నా, ఎల్సా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ‘ఫ్రోజెన్ 2’ కథ తిరుగుతుంది. అన్నా, ఎల్సా పాత్రలకు హిందీలో ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా డబ్బింగ్ చెప్పారు. తెలుగులో చెల్లెలి పాత్ర ఎల్సాకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. నిత్యా మాట్లాడుతూ – ‘‘ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. అమ్మాయిలకు సంబంధించి ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. డిస్నీ సంస్థతో పని చేయడం కల నెరవేరినట్టుంది’’ అన్నారు. ‘ఫ్రోజన్ 2’ ఈ నెల 22న విడుదల కానుంది. కేరళలో పుట్టి పెరిగిన నిత్యా మీనన్ తెలుగు మాట్లాడగలరు. ‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, 24’ సినిమాల్లో పాటలు కూడా పాడారామె. అలాగే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి అయితే తన పాత్రతో పాటు మరో హీరోయిన్ ఇషా తల్వార్ పాత్రకు కూడా నిత్యా మీననే డబ్బింగ్ చెప్పడం విశేషం. -
న్యూ ఇయర్ అర్థరాత్రి హాలీవుడ్‌కు షాక్
-
న్యూ ఇయర్ అర్థరాత్రి హాలీవుడ్‌కు షాక్
లాస్ఎంజెల్స్: హాలీవుడ్ పేరు మారింది. అది కూడా నూతన సంవత్సరం రోజే.. ఇది చూసినవాళ్లంతా కూడా అవాక్కయ్యారు. రాత్రికి రాత్రి ఇలా ఎలా సాధ్యం అయిందని ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే లాస్ ఎంజెల్స్ వెళ్లినవారందరికీ తొలుత దర్శనం ఇచ్చేది హాలీవుడ్ అంటూ పెద్ద సైన్ బోర్డు. హాలీవుడ్ స్టూడియోకి స్వాగతం పలుకుతూ అది కనిపిస్తుంటుంది. అయితే, నూతన సంవత్సరం రోజున తెల్లవారిన తర్వాత లాస్ ఎంజెల్స్ ప్రజలు, స్టూడియో వాళ్లు ఒక్కసారిగా ఆ బోర్డు వైపు చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ బోర్డు పేరు కాస్త హాలీవీడ్గా మారిపోయింది. ఓ అనే ఆంగ్ల అక్షరం ఉండాల్సిన చోట్ల ఈ అనే అక్షరాలు వచ్చిచేరాయి. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రకారం ఓ వ్యక్తి కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అర్ధరాత్రి రెండుగంటల ప్రాంతంలో ఆ అక్షరాలను ఓ ఆకతాయి మారుస్తున్నట్లు రికార్డయింది. అయితే, పోలీసులు మాత్రం అసలు ఇది ఎలా సాధ్యం అయిందో అర్ధం కావడం లేదని, అప్పుడు జోరు వాన, పైగా చీకటి ఉందని ఆ సమయంలో ఆ వ్యక్తి అలా చేశాడో తెలియడం లేదని అంటున్నారు. ఆదివారం ఉదయం 11గంటల వరకు కూడా హాలీవుడ్ అనే పేరు హాలీవీడ్గానే ప్రజలకు దర్శనం ఇచ్చింది. ఈ పేరును మార్చడానికి ఆ వ్యక్తి నల్లటి టార్పాన్లను ఉపయోగించాడు. అయితే, ఈ పేరులోని కొన్ని అక్షరాల్లో కొన్ని చోట్ల సెన్సార్లు ఉన్నాయని, వాటిని తాకగానే పోలీసులకు అలారం వెళుతుందని, కానీ మార్చిన వ్యక్తి మాత్రం సెన్సార్లను తాకి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.