హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఒకరు స్క్రీన్‌రాంట్ మీడియాతో తెలిపారు.
ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో టైటిల్ రోల్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment