Mufasa: The Lion King Movie
-
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
నిజ జీవితంలో నాన్నకు ముఫాసాతో పోలికలు: సితార
మహేశ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. మళ్లీ ఎప్పుడో వస్తుందో తెలీదు. ఎందుకంటే రాజమౌళితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చు. ఈ మూవీకి ముందే మహేశ్.. ఓ హాలీవుడ్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో మహేశ్ నటించట్లేదు, డబ్బింగ్ చెప్పాడంతే! అదే 'ముఫాసా: ద లయన్ కింగ్'.డిసెంబర్ 20న ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్లో ముఫాసా పాత్రకు మహేశ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ప్రచారంలో మహేశ్ కనిపించట్లేదు. కానీ కొన్నిరోజుల క్రితం భార్య నమ్రత.. 'ముఫాసా' ఈవెంట్లో పాల్గొంది. ఇప్పుడు కూతురు సితార కూడా 'ముఫాసా' మూవీపై ఓ వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)'ముఫాసా తెలుగు వెర్షన్‌కి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా గర్వంగా ఉంది. నిజజీవితంలోనూ నాన్నకు ముఫాసాతో పోలికలు ఉన్నాయి. ఎందుకంటే అంతలా ప్రేమిస్తారు, అండగా ఉంటారు. నాన్న ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతారనే విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆయన కంటే నేనే.. డిస్నీ సంస్థలో 'ఫ్రోజెన్' మూవీ కోసం పనిచేశా. ఈ విషయంలో మాత్రం ఆటపట్టించాను. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు చాలా ప్రాక్టీస్ చేశారు. తొలిసారి అయినా సరే పాత్రకు సరిగ్గా సరిపోయారు. ట్రైలర్ చూసిన ప్రతిసారి.. సినిమా ఎప్పుడు వస్తుందా, చూస్తానా అనిపిస్తుంది' అని సితార తన ఆనందాన్ని బయటపెట్టింది.2019లో 'ద లయన్ కింగ్' పేరుతో సినిమా రిలీజైంది. దీనికి ప్రీక్వెలే ఇప్పుడొస్తున్న 'ముఫాసా: ద లయన్ కింగ్'.. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు తెలుగులో మహేశ్ బాబు, బ్రహ్మానందం, అలీ, సత్యదేవ్ తదితరులు డబ్బింగ్ చెప్పారు. హిందీలో షారుక్, తమిళంలో అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలతో పాటు పెద్దవాళ్లని కూడా ఎంటర్టైన్ చేసే ఈ మూవీ క్రిస్మస్ వీకెండ్లో ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
Mufasa: The Lion King Trailer: లయన్ కింగ్ ఒక్కటే ఉండాలి!
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది డిసెంబరు 20న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ తెలుగు ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.కాగా తాజాగా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఇంగ్లీష్ ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘‘ఈ కథ స్కార్ అనే ప్రిన్స్‌కి, ఓ అనాథ అయిన ముఫాసాకి చెందినది. వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఓ కొత్త సామ్రాజ్యం కోసం ఓ ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు, నా పేరు ముఫాసా, లయన్ కింగ్ అనేది ఒక్కటే ఉండాలి, మనల్ని ట్రాప్ చేశారు.. ఇప్పుడు ఏం చేయాలి’’ అంటూ అర్థం వచ్చే ఇంగ్లీష్ డైలాగ్స్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్లో ఉన్నాయి.ఇక ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమాలోని ప్రధాన పాత్రధారులు అయిన ముఫాసాకు హాలీవుడ్ నటుడు అరోన్ పియర్, టాకా (ఈ పాత్ర ఆ తర్వాత స్కార్గా మారుతుంది)కు కెల్విన్ హరిసన్ జూనియర్ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. ఇక ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్ లో ముఫాసా పాత్రకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.