
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ముందు ఓ హాలీవుడ్ చిత్రానికి తెలుగు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
గతేడాది డిసెంబరు 20న రిలీజైన ఇంగ్లీష్ సినిమా 'ముఫాసా'. బ్లాక్ బస్టర్ 'లయన్ కింగ్' చిత్రానికి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కించారు. మన దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో మహేశ్ బాబు.. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా అలరించిన 'ముఫాసా'.. మార్చి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో మరోసారి సందడి చేసేందుకు మహేశ్ ఫ్యాన్స్ రెడీ. టీవీ, మొబైల్ ముందు పిల్లితో మరోసారి సందడి చేస్తారేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
It's time to experience the legend of Mufasa.#Mufasa: The Lion King, coming to #JioHotstar on March 26 in English, Hindi, Tamil and Telugu. #MufasaOnJioHotstar #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/IqN5AxEucR
— JioHotstar (@JioHotstar) March 12, 2025
Comments
Please login to add a commentAdd a comment