హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు! | Tollywood Hero Mahesh Babu Shares Mufasa The Lion King release | Sakshi
Sakshi News home page

Mahesh Babu: హకునా.. మటాటా... మరో నెలరోజులే.. తెలుగు ట్రైలర్ చూశారా!

Published Wed, Nov 20 2024 12:17 PM | Last Updated on Wed, Nov 20 2024 4:30 PM

Tollywood Hero Mahesh Babu Shares Mufasa The Lion King release

ది లయన్‌ కింగ్‌ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్‌ సినిమాకు మంచి క్రేజ్‌ ఉంది. హాలీవుడ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ‍అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. 

అయితే సూపర్ హిట్‌ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్‌ కింగ్‌ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. ‍దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ మూవీలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌ నిర్మించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement