చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.
అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్‌రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥
Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!
Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024
Comments
Please login to add a commentAdd a comment