walt disney
-
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
రిలయన్స్, డిస్నీ విలీనం: దిగ్గజ మీడియా సంస్థగా..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయింది. ఈ విలీనం ఏకంగా రూ.70,352 కోట్ల విలువైన కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ - డిస్నీ విలీనంతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించింది.జాయింట్ వెంచర్ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థకు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు. విలీన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం వాటాను, వయాకామ్ 18 46.82 శాతం వాటాను, డిస్నీ 36.84 శాతం వాటాను పొందుతాయి.కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి విలీనానికి కావలసిన అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ విలీనం తరువాత వీటి కింద సుమారు 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ ఉండనున్నాయి. ఇవి ఏడాదికి 30,000 గంటల కంటే ఎక్కువ టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయగలవని సమాచారం.ఇదీ చదవండి: ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ప్రపంచ స్థాయి డిజిటల్ స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటు డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌తో భారతీయులకు మాత్రమే కాకుండా.. ప్రవాస భారతీయులకు సరసమైన ధరలకు అసమానమైన కంటెంట్ ఆప్షన్స్ అందించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. -
రిలయన్స్-వాల్ట్ డిస్నీ విలీనం ఎప్పుడంటే..
న్యూఢిల్లీ: ఇటీవలి ఒప్పందం మేరకు... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా ఆస్తుల్లో వాల్ట్ డిస్నీ ఇండియా ఈ డిసెంబర్ త్రైమాసికంలోపు విలీనం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి విలీనం పూర్తవుతుందంటూ స్టాక్ ఎక్స్చేంజ్ లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సమాచారం ఇచ్చింది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతులు లభించడం గమనార్హం. ‘‘మిగిలిన అనుమతుల కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.విలీన లావాదేవీ 2024–25 సంవత్సరం మూడో త్రైమాసికంలో ముగుస్తుందని అంచనా వేస్తున్నాం’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. రిలయన్స్ మీడియా విభాగాలైన టీవీ18 బ్రాడ్కాస్ట్, ఈ18, నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విలీనానికి ఎన్సీఎల్టీ ఇప్పటికే ఆమోదం తెలియజేసిందని.. అక్టోబర్ 3 నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని సంస్థ పేర్కొంది.రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్ 18 పరిధిలోని నాన్ న్యూస్ (వార్తలు కాకుండా), కరెంట్ ఎఫైర్స్ టీవీ ఛానళ్ల లైసెన్స్‌లను స్టార్ ఇండియాకు బదిలీ చేసేందుకు సెపె్టంబర్ 27న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధిట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ వ్యాపారానికి వయాకామ్ 18 హోల్డింగ్ కంపెనీగా ఉంది. విలీనం తుది దశలో ఉందని, సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారాల్లో సర్దుబాట్లు చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. అతిపెద్ద మీడియా సంస్థ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగాలు, వాల్ట్‌డిస్నీ ఇండియా వ్యాపారాల విలీనంతో రూ.70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. విలీనానంతర సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 63.16 శాతం, వాల్ట్ డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలుంటాయి. పోటీ సంస్థలైన సోనీ, నెట్‌ఫ్లిక్స్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా రూ.11,500 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిగా పెట్టనుంది. -
వయాకామ్18 బోర్డులో అంబానీలు
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్‌తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్‌హర్డన్, ఆర్ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే, అనాగ్రామ్ పార్ట్నర్స్ పార్ట్నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్, డిస్నీ డీల్‌కు ఎన్సీఎల్టీ ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. వెరసి ఆర్ఐఎల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాలు(వయాకామ్18, డిజిటల్18), వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా మధ్య విలీన పథకానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇప్పటికే ఈ డీల్‌కు కొన్ని స్వచ్చంద సవరణల తదుపరి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా రూ. 70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా దిగ్గజం ఆవిర్భావినికి మరింత దారి ఏర్పడింది. తమ పరిశీలన ప్రకారం విలీన పథకం సక్రమంగానే ఉన్నట్లు ఎన్సీఎల్టీ పేర్కొంది. అను జగ్మోహన్ సింగ్ (మెంబర్, టెక్నికల్), కిషోర్ వేములపల్లి (మెంబర్, జ్యుడీíÙయల్)లతో కూడిన బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేకపోవడంతోపాటు ప్రజావిధానాలకు వ్యతికేరంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్య కంపెనీ(విలీన సంస్థ) రెండు ఓటీటీలతోపాటు 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. ఆర్ఐఎల్కు 63.16 శాతం వాటా లభించనుండగా.. వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాను పొందనుంది. మీడియా దిగ్గజాలు సోనీ, నెట్‌ఫ్లిక్స్‌తో మరింత తీవ్రస్థాయిలో పోటీకి దిగేందుకు వీలుగా ఆర్ఐఎల్ దాదాపు రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి అడుగుపెట్టినా అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్‌స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్‌కు దక్కుతాయి. ఈ డీల్ తర్వాత, ఉమ్మడి సంస్థలో రిలయన్స్ 51 శాతం, డిస్నీ హాట్‌స్టార్ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రత్యక్ష పోటీకి చెక్! జియోకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్‌స్టార్.. జియో సినిమా నుంచి ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్‌స్టార్‌నే కొనుగోలు చేస్తోంది. జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఐపీఎల్, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత, హాట్‌స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రెండింటిలో టెన్షన్.. ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం కానున్నాయి. అంటే రెండు యాప్‌ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కస్టమర్లు జియో సినిమాకి మారతారు. ఈ పరిణామాలు ప్రముఖ ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో టెన్షన్‌ను కలిగిస్తున్నాయి. ఎందుకంటే జియో సినిమా సరసమైన ప్లాన్లను అందించవచ్చు. టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్‌తో చవకైన యాడ్-ఆన్ ప్లాన్లను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట! ఇదీ చదవండి: ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..! -
మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా?
ఎలాన్‌మస్క్‌కు చెందిన సోషల్‌మీడియా దిగ్గజ కంపెనీ ‘ఎక్స్’ త్వరలో ఈ ఏడాది చివరినాటికి భారీగా నష్టపోనుందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. ఎక్స్ ద్వారా చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను ప్రచారం చేస్తాయి. అయితే అందులో ప్రధాన బ్రాండ్ కంపెనీలు వాటి ప్రచారాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేయనున్నట్లు తెలిసింది. దాంతో ఆ కంపెనీల ద్వారా ఎక్స్‌కు వచ్చే ఆదాయం రూ.625 కోట్లు తగ్గనుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గత వారం ఎలాన్‌మస్క్ ఎక్స్ వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఉన్న ఒక పోస్ట్‌ను సమర్థించాడు. దాంతో వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో సహా కొన్ని కంపెనీలు ఎక్స్‌లో తమ ప్రకటనలు కొంతకాలం నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో యాపిల్, ఒరాకిల్‌తో సహా ప్రధాన కంపెనీలకు చెందిన ప్రకటనలు అడాల్ఫ్ హిట్లర్, నాజీ పార్టీని ప్రచారం చేసే కొన్ని పోస్ట్‌ల పక్కన కనిపించాయి. దాంతో ఆ కంపెనీలు ఎక్స్ మీడియా, వాచ్డాగ్ గ్రూప్ మీడియాపై దావా వేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈవారం ఎయిర్ బీఎన్బీ, అమెజాన్, కోకకోలా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన దాదాపు 200 యాడ్ సంస్థలు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రకటనలు లిస్ట్ చేశాయి. కానీ వాటిలో కొన్నింటిని త్వరలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! అక్టోబర్ 2022లో మస్క్ ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి చాలా కంపెనీలకు చెందిన ప్రకటనదారులు యాడ్లను తగ్గించినట్లు సమాచారం. సైట్లో ద్వేషపూరిత ప్రసంగాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. మస్క్ ఎక్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి యూఎస్ ప్రకటనల ఆదాయం ప్రతి నెలా దాదాపు 55 శాతం తగ్గుతుందని రాయిటర్స్ గతంలో తెలిపింది. -
ఆ ముగ్గురి మరణాలు.. 20 ఏళ్లుగా మూతబడిన డిస్నీపార్కు
డిస్నీపార్కుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వాల్ట్ డిస్నీ నెలకొల్పిన డిస్నీ థీమ్ పార్కులు ప్రపంచంలో పన్నెండు ఉన్నాయి. ఈ పార్కులన్నీ సందర్శకులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. రోజూ వేలాది సందర్శకులు వీటిని సందర్శిస్తుంటారు. ఇవి ఈనాటికీ దేశ విదేశాల సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, డిస్నీ థీమ్ పార్కుల్లో ఒకటైన ‘డిస్నీ రివర్ కంట్రీ’ మాత్రం దాదాపు ఇరవై ఏళ్లుగా మూతబడింది. ఇప్పుడు ఈ పార్కు పాడుబడి దెయ్యాల నివాసాన్ని తలపించేలా తయారైంది. డిస్నీ థీమ్ పార్కుల్లో భాగంగా వాల్ట్ డిస్నీ కంపెనీ 1976 జూన్ 20న ఫ్లోరిడాలోని బే లేక్ తీరం వద్ద ‘డిస్నీ రివర్ కంట్రీ’ పార్కును నెలకొల్పింది. వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన మిగిలిన డిస్నీ పార్కుల్లాగానే ఇది కూడా సందర్శకులతో కిటకిటలాడేది. నిత్యం కోలాహలంగా కనిపించేది. వ్యాపారపరంగా లాభసాటిగానే నడిచేది. ఇందులో రెండు స్విమింగ్‌పూల్స్, ఐదు వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. సమీపంలోని బే లేక్ నుంచి వీటికి నీరు చేరవేసేవారు. బే లేక్ నుంచి వచ్చే నీటిని వడబోసేందుకు అడుగు భాగాన ఇసుక నింపిన ఫిల్టర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు తలెత్తడం, దీనిపై జనాల్లో ఆందోళన మొదలవడంతో ఇది 2001 నవంబర్ 2న మూతబడింది. అప్పటి నుంచి దీనిని మళ్లీ తెరిచే ప్రయత్నాలేవీ ఇంతవరకు జరగలేదు. ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు 1980లోనే మొదలయ్యాయి. ఇక్కడి స్విమింగ్‌పూల్‌లో ఈత కొట్టిన ఒక పదకొండేళ్ల బాలుడికి మెదడులో అమీబిక్ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆ ఇన్ఫెక్షన్తోనే అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 1982లో ఒకరు, 1989లో మరొకరు ఇలాగే నీటివల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారినపడి మరణించారు. చాలామంది ఇన్ఫెక్షన్ల బారిన పడినా, చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ పార్కులో అడుగుపెట్టడానికి జనాలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ 2001 నవంబర్ 2న ఈ పార్కును మూసివేస్తున్నప్పుడు దీనిలోని నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించి, 2002 ఏప్రిల్ 11న పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, ‘వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన తొలి వాటర్ థీమ్ పార్కు శాశ్వతంగా మూతబడినట్లే’ అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ ప్రకటించినట్లుగా ఇది పునఃప్రారంభం కాలేదు. వార్తాకథనాలు ఊహించినట్లుగానే జరిగింది. ప్రస్తుతం ఇది పూర్తిగా పాడుబడి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. వాల్ట్ డిస్నీ కంపెనీ చరిత్రలో ఇలాంటి వైఫల్యం ఇదొక్కటే! -
‘‘నీ డ్రెస్ చాలా చిన్నగా ఉంది.. ఈ టీ షర్ట్ తీసుకో’’
వాషింగ్టన్: ఆడవాళ్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే చాలు వెంటనే అందరి దృష్టి వారి వస్త్రధారణ మీదకు వెళ్తుంది. సందు దొరికితే చాలు మహిళల దుస్తులు, నడక, నడత గురించి అనర్గళంగా ఉపన్యసించే వారు మన సమాజంలో కోకొల్లలు. అప్పుడప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ వ్యక్తులు కూడా వచ్చి చేరుతుంటారు. కంపెనీలు కూడా ఇలాంటి విషయాల్లో అనుచితంగా ప్రవర్తించి.. ఆపై లెంపలు వేసుకుంటాయి. తాజాగా ప్రసిద్ధ సంస్థ డిస్నీ వరల్డ్ ఈ జాబితాలో చేరింది. పార్క్‌కి వచ్చిన ఓ మహిళ డ్రెస్ చాలా చిన్నగా.. అసభ్యంగా ఉందని.. ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిందని భావించిన కంపెనీ ఆమెను లోపలికి అనుమతించలేదు. అంతేకాక తన గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఓ టీషర్ట్‌ని ఉచితంగా ఇచ్చి.. తన పెద్ద మనసుతో పాటు.. మహిళలు కనిపిస్తే చాలు మా చూపులు వారి శరీర భాగాల మీదనే ఉంటాయనే తన వక్రబుద్ధిని పరోక్షంగా ప్రకటించింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి మహిళ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. అమండ డిమియో అనే టిక్‌టాక్ యూజర్‌కు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమెకు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె డిస్నీ పార్క్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె చాలా చిన్నగా ఉన్న క్రాప్‌టాప్ ధరించింది. అమండ డ్రెస్ అసభ్యంగా, అశ్లీలంగా ఉందని భావించిన పార్క్ యాజమాన్యం ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఓ టికెట్‌ని ఇచ్చింది. దాని మీద పక్కనే ఉన్న తమ గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఉచితంగా ఓ టీ షర్ట్ పొందవచ్చని రాసి ఉంది. పార్క్ యాజమాన్యం తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన అమండ ఏం మాట్లాడకుండా గిఫ్ట్ షాప్‌కి వెళ్లి.. టీషర్ట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎదురైన ఈ అనుభవం గురించి వివరిస్తూ ఓ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్ డిస్నీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. మీరు ఎక్స్పోజ్ చేసేలా చిన్న దుస్తులు ధరించి మ్యాజిక్ కింగ్‌డమ్‌లోకి ప్రవేశిస్తే.. వారు మీకు ఒక టికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్‌లో ఇస్తే.. మీకు 75 డాలర్లు విలువ చేసే టీ షర్ట్ ఫ్రీగా ఇస్తారు’’ అని వీడియో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరవలవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది ఈ ట్రిక్ని ఉపయోగించుకున్నట్లు కామెంట్స్ చేశారు. చదవండి: భారత్‌లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా? వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ -
డిస్నీలో 28 వేల ఉద్యోగుల తొలగింపు..
న్యూయార్క్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు తెలిపింది. అయితే సంస్థలో 67శాతం తాత్కాళిక ఉద్యోగులనే తొలగించినట్లు పేర్కొంది. అమెరికా థీమ్ పార్క్‌లలో పని చేసే 28 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు పేర్కొంది. అయితే డిస్నీ నష్టాలను తగ్గించుకునేందుకు ఏయిర్‌లైన్స్ గ్రూప్ తదితర రంగాలల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మరోవైపు ఖర్చులు తగ్గించుకున్నా, కరోనా ప్రతికూల పరిస్థితులు వ్యాపారంపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని డిస్నీ పార్క్ చైర్మన్ జోష్ డి అమారో పేర్కొన్నారు. -
కరోనా : డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత
కాలిఫోర్నియా : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ సంక్షోభం భారీ ఉద్యోగాల కోతకు దారి తీస్తోంది. తాజాగా అమెరికా వ్యాపార దిగ్గజం డిస్నీ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో 28వేల థీమ్ పార్క్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ మేరకు మంగళవారం డిస్నీ ఒక ప్రకటన విడుదల చేసింది. చాలా భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. కోవిడ్-19 ప్రభావం తమ వ్యాపారంపై పడటంతో ఉన్న ఉద్యోగుల్లో నాల్గవ వంతు 28 వేల మందిని తొలగిస్తున్నామని డిస్నీ పార్కు ఛైర్మన్ జోష్ డి అమారో తెలిపారు. ఇందులో 67 శాతం మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారన్నారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులు ఎవరినీ తీయకుండా ఉండేందుకు మేనేజ్మెంట్ అవిరామంగా కృషి చేసింది, ఖర్చులు తగ్గించుకున్నాం, కొన్ని కార్యక్రమాలను నిలిపివేశాం అయినా ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఫ్లోరిడా, పారిస్, షాంఘై, జపాన్ హాంకాంగ్‌లోని డిస్నీ థీమ్ పార్కులు ఓపెన్ చేసినా లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలోని డిస్నీ థీమ్ పార్కుల్లో ఉద్యోగుల తొలగింపు అనంతరం ఉద్యోగుల సంఖ్య 1,10,000 నుంచి 82,000లకు తగ్గుతుందన్నారు. -
అలాద్దీన్ ప్రపంచం
అరేబియన్ నైట్స్ కథల్లో అలాద్దీన్ అద్భుత దీపం కథకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ అద్భుత దీపంతో ఎన్నో కథలు వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. అందుకే సరికొత్త హంగులతో ఎప్పటికప్పుడు అలాద్దీన్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు దర్శక–నిర్మాతలు. వాల్ట్ డిస్నీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో జీనీ, అలాద్దీన్‌గా విల్ స్మిత్, నటించారు. గాయ్ రిట్చయ్ దర్శకత్వం వíహించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. జీనీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. మరోసారి అలాద్దీన్ ప్రపంచంలోకి వెళ్లడానికి ప్రేక్షకులు రెడీగా ఉండాలన్నమాట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది -
డిస్నీలో పండోరా వండర్స్
మీరు అవతార్ సినిమా ఫ్యాన్సా? అయితే వెంటనే చలో కెనడా అనేయండి మరి. అక్కడి వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో అవతార్ సినిమాలోని పండోరా గ్రహం నకలు సిద్ధమైపోయింది. వేలాడే కొండలు.. మిణుగురు పురుగుల్లా రకరకాల రంగుల్లో మిలమిలా మెరిసే అడవులు ఈ రిసార్ట్‌లోని ‘పండోరా.. వరల్డ్ ఆఫ్ అవతార్’లో కనువిందు చేయనున్నాయి. ఈ ఫొటోల్లోని సీన్స్ అక్కడివే! మొత్తం 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండోరా వరల్డ్ ఆఫ్ అవతార్‌లో ఎన్నో థ్రిల్లింగ్ రైడ్స్ ఉన్నాయి. వాల్ట్ డిస్నీ దీని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆరేళ్ల సమయం తీసుకుందీ అంటే.. దీంట్లోని సంక్లిష్టత ఎలాంటిదో.. ఎంత అద్భుతంగా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. పడవెక్కి నావీ నదిలో షికారు చేయడం.. గుహల్లోపల మొక్కలు, చెట్లూ అన్నీ మెరిసిపోతూంటే మురిసిపోవడం, వేలాడే కొండలు హలెలూయా మౌంటెన్స్‌ను చూడటం మాత్రమే కాదు.. అవతార్ సినిమాలో మాదిరిగా బాన్షీ.. అదేనండి పే...ద్ద రెక్కలున్న పక్షులు.. వాటిపై ఎక్కి చక్కర్లు కొట్టవచ్చు కూడా! ‘అవతార్ ఫ్లైట్ ఆఫ్ పాసేజ్’లో విజిటర్లు ఒక బైక్ సిములేటర్‌లో కూర్చుంటే.. ఒక్కొక్కరి వర్చువల్ అవతారం స్క్రీన్‌పై ప్రయాణిస్తూ... వ్యాలీ ఆఫ్ మోర్ మొత్తాన్ని చూపుతుంది. త్రీడీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ తదితర హైటెక్ టెక్నాలజీల పుణ్యమా అని ఆ సమయంలో లోయ మొత్తం మన కాళ్ల కిందే కదులుతున్నట్లు.. బాన్షీలు మన పక్క నుంచే ఎరుగుతున్న అనుభూతి కలుగుతుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వాల్ట్ డిస్నీ అండీ బాబూ..!
-
త్వరలో... జంగిల్‌బుక్-2
అమెరికాలో రిలీజ్ కాక ముందే సంచలనం మన దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు నాట ఇప్పుడు జనమంతా చెప్పుకుంటున్న సినిమా - ‘ది జంగిల్ బుక్’. అమెరికాలో ఈ 15న రిలీజ్ కానున్న ఈ హాలీవుడ్ చిత్రం ఇక్కడ మాత్రం అంత కన్నా ఒక వారం ముందే మొన్న ఉగాది నాడు రిలీజైంది. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి కార్టూన్ యానిమేషన్ చిత్రంగా వచ్చి, బుల్లి, వెండితెరలపై ఆకట్టుకున్న ఈ కథ ఇప్పుడు అధునాతన లైవ్ యాక్షన్ -యానిమేషన్ (కంప్యూటర్ గ్రాఫిక్స్ హైబ్రిడ్) రూపంలో పిల్లల్నీ, వారితో పాటు పెద్దల్నీ ఆకర్షిస్తోంది. ఇంగ్లీష్‌లోని ఈ హాలీవుడ్ చిత్రం తాలూకు హిందీ, తెలుగు, తమిళ తదితర భారతీయ భాషా డబ్బింగ్‌లకు భారతీయ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మన దేశంలో దాదాపు 1700 థియేటర్లలోవిడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ళలో పెను సంచలనం. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్! అమెరికాలో ఈ వారం రిలీజ్! చాలా ఏళ్ళ క్రితం రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన నవల - ‘ది జంగిల్ బుక్’. అడవిలోని పసిబాలుడు మోగ్లీని తోడేళ్ళు పెంచడం, ఎలుగుబంటి, కొండ చిలువ లాంటి రకరకాల అడవి జంతువులతో అతని స్నేహం మధ్య ఈ కథ తిరుగుతుంది. భారతీయ సంతతికి చెందిన నీల్‌సేథీ ఈ సినిమాలో మోగ్లీ పాత్ర పోషించగా, హైదరాబాద్‌కు చెందిన ఏడోతరగతి కుర్రాడు పదేళ్ళ సంకల్ప్ ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. నిజానికి, పెద్ద నగరాల్లో ఇంగ్లీషే తప్ప ఈ ప్రాంతీయ భాషా వెర్షన్ల ప్రదర్శనలు తక్కువగా వేస్తున్నారు. దాంతో, ఉన్న ఒకటీ, అరా థియేటర్లలో రోజుకు ఒకటి, రెండు ఆటలతో టికెట్లు దొరక్క జనం అసంతృప్తితో వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితేనేం, త్రీడీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఒక్క మన దేశంలో తొలి రోజే సుమారు రూ.10.09 కోట్ల వసూళ్ళు వచ్చాయి. రెండో రోజున వసూళ్ళ స్థాయి ఇంకా పెరిగి, రూ.13.5 కోట్లు వచ్చాయి. మూడో రోజు రూ. 16.6 కోట్లు వసూళ్ళయ్యాయి. అన్నీ కలిపి, రిలీజైన తొలి వారాంతానికే రూ. 40 కోట్ల పైగా ఆర్జించింది. గత ఏడాది రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ అప్పట్లో తొలి మూడు రోజులకే రూ. 48 కోట్లు వసూలు చేసింది. దాని తరువాత మన దేశంలో తొలి మూడు రోజులకే ఇంత భారీ వసూళ్ళు సాధించిన రెండో హాలీవుడ్ చిత్రం -‘ది జంగిల్ బుక్’! ఈ ఊపులో తొలివారంలోనే థియేటర్లలో రూ. 50 కోట్ల మార్కు దాటేయనుంది. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా మన దేశంలో అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ ఇదే! స్కూల్ పిల్లలకు సెలవులు కూడా వచ్చేస్తుండడంతో, ఈ సినిమా కొద్దిరోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తుందని మార్కెట్ వర్గాల కథనం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు రెంటిలోనూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం 3.17 కోట్ల డాలర్లు (మన లెక్కలో రూ. 200 కోట్ల పైగా) వసూలు చేసి, సంచలనం రేపుతోంది. వార్నర్ బ్రదర్స్ పోటీ ‘జంగిల్ బుక్’ వాయిదా! నిజానికి, డిస్నీ సంస్థతో పాటు వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా ఇదే ‘జంగిల్ బుక్’ కథతో ఒక సినిమా చేసే పనిలో ఉంది. మోషన్ క్యాప్చర్ విధానంలో ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో ‘జంగిల్ బుక్ - ఆరిజిన్స్’ పేరిట తీయాలనుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 6కు రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, తాజాగా దాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేశారు. 2018 అక్టోబర్ 19కి రిలీజ్ చేసేలా, నిర్మించాలని భావిస్తున్నారు. దాంతో, వాల్ట్‌డిస్నీ, వార్నర్ బ్రదర్స్ స్టూడియోల మధ్య పోటీలో ఒక రకంగా డిస్నీ సంస్థది ఇప్పుడు పైచేయి అయింది. రెండో పార్ట్‌కీ అదే టీమ్ మొత్తానికి, గతంలో తీసిన ‘అలైస్ ఇన్ వండర్ల్యాండ్’, ‘మ్యాలెఫిషెంట్’, ‘సిండెరెల్లా’ల ఫక్కీలో ఇప్పుడీ ‘ది జంగిల్ బుక్’ కూడా భారీ హిట్టవడంతో డిస్నీ సంస్థ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇంకా రిలీజైనా కాక ముందే వాల్ట్‌డిస్నీ సంస్థ ‘ది జంగిల్ బుక్’ చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ తొలి భాగానికి దర్శకత్వం వహించిన ‘ఐరన్‌మ్యాన్’ చిత్ర ఫేమ్ జాన్ ఫావ్రీవ్ సారథ్యంలోనే ఈ రెండో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన అసలు కథను ఆధారంగా చేసుకొని ‘టాప్‌గన్2’ చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత జస్టిన్ మార్క్స్ తాజా ‘జంగిల్ బుక్’కు సినీ రచన చేశారు. ఇప్పుడు త్వరలోనే నిర్మించాలనుకుంటున్న రెండోభాగానికి సైతం రచన చేయాల్సిందిగా ఆయనతో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నాయి. నిజానికి, డిస్నీటూన్ స్టూడియోస్ సంస్థ గతంలో 2003లోనే ‘జంగిల్ బుక్-2’ అంటూ యానిమేషన్ చిత్రం తీసి, నేరుగా డి.వి.డి. విడుదల చేసింది. అయితే, ఇప్పుడు తీసిన సరికొత్త లైవ్ యాక్షన్ చిత్రం సీక్వెల్ కోసం ఆ యానిమేషన్ కథను వాడకపోవచ్చు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘జంగిల్ బుక్’ కథలు, నవలల నుంచి బోలెడన్ని అంశాల్ని తవ్వితీసి, స్క్రిప్ట్ తయారు చేసే అవకాశం ఉంది. ‘అవతార్’తో పోలుస్తున్న విమర్శకులు అత్యధిక శాతం ఫోటో రియలిస్టిక్ సి.జి.లతో తయారైన ఈ ‘ది జంగిల్ బుక్’ పార్ట్1 సినిమాను లాస్ ఏంజెల్స్‌లో తీశారు. నీల్ సేథీ నటించిన మోగ్లీ పాత్ర మినహా మిగతా జంతువుల పాత్రలు, వాటి హావభావాలన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన వర్కే! ఈ 3డి యానిమేషన్ చూసిన విమర్శకులు అదిరిపోయి, దీన్ని ‘అవతార్’ సినిమా తాలూకు సి.జి. వర్క్స్‌తో పోలుస్తున్నారు. అయితే, షేర్‌ఖాన్, బాలూ, బఘీరా లాంటి జంతువుల పాత్రలన్నిటికీ ప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు తమ గాత్రంతో ప్రాణం పోసి, కథాకథనంలోని భావోద్వేగాల్ని ప్రేక్షకులు అనుభవించేలా చేశారు. మొత్తానికి, ఒక హాలీవుడ్ సినిమా హాలీవుడ్లో రిలీజ్ కాకుండానే ఇన్ని కోట్ల వసూళ్ళు, ఇంత భారీ జనాదరణ పొందడం, అప్పుడే సీక్వెల్ ఆలోచనతో సిద్ధం కావడం విశేషమే కదూ! -
ఎదురుదెబ్బలను దాటుకుని..
ప్రతి వ్యక్తి జీవితంలో గెలుపు, ఓటములు తప్పనిసరి. అయితే కొందరిని ఓటమి ఎక్కువ కాలం పీడిస్తుంది. ఈ సమయంలో అలాంటివారిని చూసి ఇతరులు ఇక వారి పనైపోయిందనుకుంటారు. కానీ అలాంటి సమయంలోనే కొందరు ఓర్పుగా మరిన్ని ప్రయత్నాలు చేసి విజయాల బాట పడతారు. ఇలాంటివారు చరిత్రలో చాలా మంది కనిపిస్తారు. జీవితంలో ఆటుపోట్లు చవిచూసినప్పటికీ తిరిగి విజయాన్ని అందుకున్నవారి గురించి తెలుసుకుందాం.. వాల్ట్ డిస్నీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్కు అయిన డిస్నీల్యాండ్, సినీ నిర్మాణ సంస్థ డిస్నీ సహా అనేక కంపెనీలను స్థాపించింది వాల్ట్ డిస్నీ. ఈయన కూడా ప్రారంభంలో అనేక అపజయాలను ఎదుర్కొన్నాడు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓ న్యూస్ పేపర్లో కార్టూనిస్టుగా పనిచేస్తుండేవాడు. అయితే కార్టూన్ల విషయంలో సరిగ్గా పనిచేయడం లేదని, సృజనాత్మకత లోపించిందని ఎడిటర్ డిస్నీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరుసటి ఏడాది డిస్నీ ఆ ఉద్యోగం మానేసి ఓ సంస్థను స్థాపించాడు. సరైన ఆదాయం లేదని దాన్ని కూడా వదిలేసి మరో సంస్థలో చేరాడు. తర్వాత ఓ సొంత స్టూడియో స్థాపించాడు. అది కొంతకాలం విజయవంతంగా సాగినా చివరకు దివాళా తీసింది. ఇలా ఏ వ్యాపారం సరిగ్గా సాగకపోయేసరికి ఓ హాలీవుడ్ స్టూడియో స్థాపించాడు. ఇక్కడే ఓస్వాల్డ్ అనే లక్కీ ర్యాబిట్ క్యారెక్టర్‌ను సృష్టించాడు. ఈ సందర్భంగా తన నిర్మాతలు ఆ పాత్రను దొంగిలించి, డిస్నీతో పనిచేసే సిబ్బందిని సైతం లాగేసుకున్నాడు. అయినప్పటికీ తన దగ్గర మిగిలిన కొద్దిమంది సిబ్బందితోనే పనిచేసి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మిక్కీమౌస్ క్యారెక్టర్‌ను సృష్టించాడు. అది విజయవంతమవడంతో అప్పటినుంచి డిస్నీల్యాండ్ నిర్మాణం, ఇతర సంస్థల స్థాపన నిరాటంకంగా కొనసాగింది. మొదట ఏ వ్యాపారమూ కలిసి రాకున్నా చివరకు అంతర్జాతీయ స్థాయి డిస్నీల్యాండ్‌ను నిర్మించి చరిత్రలో నిలిచాడు వాల్ట్ డిస్నీ. క్రిస్ గార్డెనర్.. అమెరికాలో పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతున్న క్రిస్ గార్డెనర్ బాల్యం నుంచి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి మరో వివాహం చేసుకుంది. అయితే సవతి తండ్రి క్రిస్ తల్లిని, క్రిస్‌ను, అతడి సోదరులను హింసించేవాడు. పైగా క్రిస్ తల్లిపై సవతి తండ్రి అనేక ఆరోపణలు చేయడంతో ఆమె పలుమార్లు అక్రమంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటు తల్లి జైలు పాలవడం, పెంపుడు తండ్రి పట్టించుకోకపోవడంతో క్రిస్, అతడి తోబుట్టువుల ఆలనాపాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. దీంతో క్రిస్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు వేరే వారి ఇంట్లో ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత పెద్దయ్యాక వైవాహిక జీవితం కూడా ఆటుపోట్లకు గురైంది. అతడు మెడికల్ రంగంలో సేల్స్‌మెన్‌గా పనిచేయడంతో విబేధాలొచ్చి భార్య నుంచి విడిపోవాల్సి వచ్చింది. చివరకు ఏ దిక్కూ లేకుండా పోయిన క్రిస్ చిన్నచిన్న హొటళ్లు, పార్కులు, ఎయిర్‌పోర్టులు, పబ్లిక్ టాయ్లెట్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. తర్వాత పొద్దంతా ఓ బ్రోకరేజ్ సంస్థలో పనిచేస్తుండేవాడు. రాత్రిపూట ఓ ఇంటి చూరు కింద నిద్రపోయేందుకు పెద్ద క్యూలో నిలబడేవాడు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న క్రిస్ 1892లో డీన్ రైటర్ అనే బ్రోకరేజ్ సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరాడు. అనంతరం 1987లో గార్డెనర్ రిచ్ అండ్ కో అనే సంస్థను స్థాపించాడు. 2006లో తనకు ఆ సంస్థలో ఉన్న వాటాలో కొద్దిశాతం అమ్మడం ద్వారా క్రిస్ వందల కోట్ల రూపాయలు ఆర్జించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, చికాగోల్లో కార్యాలయాలున్నాయి. ఆయన జీవిత కథతో హాలీవుడ్లో సినిమా కూడా రూపొందింది. స్టీవెన్ స్పీల్బర్గ్.. జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ వంటి ప్రపంచవ్యాప్తంగా హిట్టైన సినిమాల్ని రూపొందించిన దర్శకడు స్టీవెన్ స్పీల్బర్గ్. సినిమా చరిత్రలోనే అద్భుతమైన సినిమాల్ని రూపొందించిన స్పీల్బర్గ్ విద్యార్థి దశలో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో సినిమాకు సంబంధించిన ఓ కోర్సు చేయాలనుకున్నాడు. కానీ అతడికి అన్నింట్లోనూ సీ గ్రేడ్ మార్కులే ఉండడంతో యూనివర్సిటీలో సీటు లభించలేదు. ఇలా మొత్తం మూడుసార్లు యూనివర్సిటీ స్పీల్బర్గ్ అప్లికేషన్‌ను తిరస్కరించింది. తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చేరాల్సి వచ్చింది. స్టూడెంట్‌గా ఉండగానే ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ హాలీవుడ్ స్టూడియోతో పనిచేసే అవకాశం వచ్చింది. అనంతరం షార్ట్‌ఫిల్ములు రూపొందించి తన సత్తా చాటాడు. దీంతో హాలీవుడ్ స్టూడియోస్ స్పీల్‌బర్గ్‌తో సినిమాలు రూపొందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఓ విద్యార్థిగానే తిరస్కరణకు గురైన అతడు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే చిత్రాలను రూపొందిస్తున్నాడు. బ్రియాన్ ఆక్టన్.. యాహూ, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థల్లో దశాబ్ద కాలంపైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం బ్రియాన్ ఆక్టన్ సొంతం. అయితే 2009లో ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో అతడికి మరెక్కడా ఉద్యోగం లభించలేదు. చివరకు అప్పుడే ప్రారంభమైన ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలు కూడా బ్రియాన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. చివరకు అతడ్ని తీసుకునేందుకు ఏ కంపెనీ ఆసక్తి చూపకపోవడంతో తన మాజీ సహోద్యోగులైన ఆలమ్, జాన్కోమ్, బ్లిట్లతో కలిసి క్లౌడ్ మెసేజింగ్ సంస్థను స్థాపించాడు. అలా అన్నిచోట్లా తిరస్కరణకు గురవ్వడం వల్ల స్థాపనకు దారితీసిన ఆ కంపెనీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. అదే వాట్సాప్. చివరకు బ్రియాన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా తిరస్కరించిన ఫేస్బుక్ సంస్థే కొంతకాలం తర్వాత బ్రియాన్ ఆధ్వర్యంలో స్థాపించిన వాట్సాప్‌ను 2014లో కొనుగోలు చేసింది. ఉద్యోగం కూడా ఇవ్వని సంస్థే అతడు స్థాపించిన సంస్థను కొనుగోలు చేసేలా చేయగలగడం విశేషం. -
సెల్ఫీ స్టిక్స్‌పై డిస్నీ నిషేధం..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పర్యాటకులు సందర్శించే డిస్నీ వరల్డ్ పార్కుల్లోకి సెల్ఫీ స్టిక్స్‌ని అనుమతించకూడదని ఆ సంస్థ నిర్ణయించింది. అనేక దేశాల్లో డిస్నీ వరల్డ్‌కి చెందిన వినోద కేంద్రాలున్నాయి. చిన్న పిల్లలతో సహా పెద్దలను సైతం ఆకట్టుకునేలా రూపొందిన ఈ పార్కుల్లో సందర్శకుల భద్రతా కారణాల రీత్యా సెల్ఫీ స్టిక్స్‌ని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వాల్ట్ డిస్నీ తెలిపింది. సందర్శకులకు మంచి అనుభూతిని మిగల్చాలనుకుంటున్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని సెల్ఫీ స్టిక్స్‌పై నిషేధం విధించామని ప్రకటించింది. ఇటీవల రోలర్ కోస్టర్‌లో తిరుగుతుండగా ఓ వ్యక్తి తన సెల్ఫీ స్టిక్‌ని విసిరేయడంతో కోస్టర్ గంటపాటు నిలిచిపోయింది. ఈ ఘటన తాజా నిర్ణయానికి కారణమైంది. సెల్ఫీస్టిక్: ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సెల్ఫీలు తీసుకునేందుకోసం ప్రత్యేకంగా రూపొందిన పరికరమే సెల్ఫీ స్టిక్. ఈ స్టిక్ లోహంతో తయారై దాదాపు 40 అంగుళాల పొడవుంటుంది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్, క్యాంపాక్ట్ కెమెరాలను ఈ స్టిక్స్‌కి అమర్చి ఫొటో తీసుకోవచ్చు. మామూలుగా తీసుకునే సెల్ఫీ కన్నా స్టిక్స్ వినియోగించి తీసుకునే సెల్ఫీలతో ఎక్కువ ప్రదేశాన్ని చిత్రీకరించొచ్చు. దీని వల్ల సెల్ఫీలో ఎక్కువ మంది రావడంతోపాటు, వెనుక ఉండే ప్రదేశం కూడా కనిపిస్తుంది.