వాషింగ్టన్: ఆడవాళ్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే చాలు వెంటనే అందరి దృష్టి వారి వస్త్రధారణ మీదకు వెళ్తుంది. సందు దొరికితే చాలు మహిళల దుస్తులు, నడక, నడత గురించి అనర్గళంగా ఉపన్యసించే వారు మన సమాజంలో కోకొల్లలు. అప్పుడప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ వ్యక్తులు కూడా వచ్చి చేరుతుంటారు. కంపెనీలు కూడా ఇలాంటి విషయాల్లో అనుచితంగా ప్రవర్తించి.. ఆపై లెంపలు వేసుకుంటాయి.
తాజాగా ప్రసిద్ధ సంస్థ డిస్నీ వరల్డ్ ఈ జాబితాలో చేరింది. పార్క్‌కి వచ్చిన ఓ మహిళ డ్రెస్ చాలా చిన్నగా.. అసభ్యంగా ఉందని.. ఎక్స్‌పోజింగ్ ఎక్కువ అయిందని భావించిన కంపెనీ ఆమెను లోపలికి అనుమతించలేదు. అంతేకాక తన గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఓ టీషర్ట్‌ని ఉచితంగా ఇచ్చి.. తన పెద్ద మనసుతో పాటు.. మహిళలు కనిపిస్తే చాలు మా చూపులు వారి శరీర భాగాల మీదనే ఉంటాయనే తన వక్రబుద్ధిని పరోక్షంగా ప్రకటించింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి మహిళ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
ఆ వివరాలు.. అమండ డిమియో అనే టిక్‌టాక్ యూజర్‌కు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమెకు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె డిస్నీ పార్క్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె చాలా చిన్నగా ఉన్న క్రాప్‌టాప్ ధరించింది. అమండ డ్రెస్ అసభ్యంగా, అశ్లీలంగా ఉందని భావించిన పార్క్ యాజమాన్యం ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఓ టికెట్‌ని ఇచ్చింది. దాని మీద పక్కనే ఉన్న తమ గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఉచితంగా ఓ టీ షర్ట్ పొందవచ్చని రాసి ఉంది.
పార్క్ యాజమాన్యం తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన అమండ ఏం మాట్లాడకుండా గిఫ్ట్ షాప్‌కి వెళ్లి.. టీషర్ట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎదురైన ఈ అనుభవం గురించి వివరిస్తూ ఓ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్ డిస్నీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. మీరు ఎక్స్‌పోజ్ చేసేలా చిన్న దుస్తులు ధరించి మ్యాజిక్ కింగ్‌డమ్‌లోకి ప్రవేశిస్తే.. వారు మీకు ఒక టికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్‌లో ఇస్తే.. మీకు 75 డాలర్లు విలువ చేసే టీ షర్ట్ ఫ్రీగా ఇస్తారు’’ అని వీడియో తెలిపింది.
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరవలవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది ఈ ట్రిక్‌ని ఉపయోగించుకున్నట్లు కామెంట్స్ చేశారు.
చదవండి:
భారత్‌లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా?
వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ
Comments
Please login to add a commentAdd a comment