Exposing
-
ఛీ! విమానంలో అదేం పని...ఏడాది జైలు శిక్ష
విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌కి చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్‌కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు(ఏఎఫ్‌పీ) అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్ ఎయిర్పోర్ట్ పోలీస్ కమాండర్ మార్క్ కోల్‌బ్రాన్ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
‘‘నీ డ్రెస్ చాలా చిన్నగా ఉంది.. ఈ టీ షర్ట్ తీసుకో’’
వాషింగ్టన్: ఆడవాళ్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే చాలు వెంటనే అందరి దృష్టి వారి వస్త్రధారణ మీదకు వెళ్తుంది. సందు దొరికితే చాలు మహిళల దుస్తులు, నడక, నడత గురించి అనర్గళంగా ఉపన్యసించే వారు మన సమాజంలో కోకొల్లలు. అప్పుడప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ వ్యక్తులు కూడా వచ్చి చేరుతుంటారు. కంపెనీలు కూడా ఇలాంటి విషయాల్లో అనుచితంగా ప్రవర్తించి.. ఆపై లెంపలు వేసుకుంటాయి. తాజాగా ప్రసిద్ధ సంస్థ డిస్నీ వరల్డ్ ఈ జాబితాలో చేరింది. పార్క్‌కి వచ్చిన ఓ మహిళ డ్రెస్ చాలా చిన్నగా.. అసభ్యంగా ఉందని.. ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిందని భావించిన కంపెనీ ఆమెను లోపలికి అనుమతించలేదు. అంతేకాక తన గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఓ టీషర్ట్‌ని ఉచితంగా ఇచ్చి.. తన పెద్ద మనసుతో పాటు.. మహిళలు కనిపిస్తే చాలు మా చూపులు వారి శరీర భాగాల మీదనే ఉంటాయనే తన వక్రబుద్ధిని పరోక్షంగా ప్రకటించింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి మహిళ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. అమండ డిమియో అనే టిక్‌టాక్ యూజర్‌కు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమెకు 8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె డిస్నీ పార్క్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె చాలా చిన్నగా ఉన్న క్రాప్‌టాప్ ధరించింది. అమండ డ్రెస్ అసభ్యంగా, అశ్లీలంగా ఉందని భావించిన పార్క్ యాజమాన్యం ఆమెను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఓ టికెట్‌ని ఇచ్చింది. దాని మీద పక్కనే ఉన్న తమ గిఫ్ట్ షాప్ నుంచి ఆమెకు ఉచితంగా ఓ టీ షర్ట్ పొందవచ్చని రాసి ఉంది. పార్క్ యాజమాన్యం తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన అమండ ఏం మాట్లాడకుండా గిఫ్ట్ షాప్‌కి వెళ్లి.. టీషర్ట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎదురైన ఈ అనుభవం గురించి వివరిస్తూ ఓ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్ డిస్నీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. మీరు ఎక్స్పోజ్ చేసేలా చిన్న దుస్తులు ధరించి మ్యాజిక్ కింగ్‌డమ్‌లోకి ప్రవేశిస్తే.. వారు మీకు ఒక టికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్‌లో ఇస్తే.. మీకు 75 డాలర్లు విలువ చేసే టీ షర్ట్ ఫ్రీగా ఇస్తారు’’ అని వీడియో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరవలవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది ఈ ట్రిక్ని ఉపయోగించుకున్నట్లు కామెంట్స్ చేశారు. చదవండి: భారత్‌లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా? వైరల్ స్టోరీ: లైఫ్ ఈజ్ వెరీ ఈజీ -
ఇంటర్వెల్లో అర్థమవుతుంది
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘అంతకు మించి’. మా చిత్రం పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ రష్మీ ఎక్స్పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆమె నటన గురించి మాట్లాడతారు’’ అని దర్శకుడు జానీ అన్నారు. జై హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అంతకు మించి’. రష్మీ గౌతమ్ కథానాయిక. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో–నిర్మాత జై మాట్లాడుతూ– ‘‘అంతకు మించి’ సినిమా లాస్ట్ టూ రీల్స్‌లో ప్రేక్షకులు కచ్చితంగా భయపడతారు. ఈ సినిమాకు ‘అంతకు మించి’ టైటిల్ ఎందుకు పెట్టామో ఇంటర్వెల్లో అర్థం అవుతుంది. రష్మీగారు తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు’’ అన్నారు. ‘‘కేక్‌లా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సినిమా ఉంటుంది’’ అన్నారు రష్మీ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భానుప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం. -
ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు
ఇతర ప్రాంతాల నుంచి శృంగార తారల రాక అధికమవడంతో దక్షిణాది తారలు ఎక్స్పోజింగ్ కోసం సంకోచించడం లేదు. గతంలో బికినీ దుస్తులు ధరించేందుకు విముఖత చూపిన హీరోయిన్లు కూడా ప్రస్తుతం అంగాంగ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పాకిస్థాన్ నటి వీణా మాలిక్, బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, టాప్‌లెస్ నటీమణులు షెర్లిన్ చోప్రా, సన్నిలియోన్ వంటి తారల ఆకస్మిక చిత్రరంగ ప్రవేశం మిగతా హీరోయిన్లకు తలనొప్పిగా పరిణమించింది బెడ్ రూం సీన్ అయినా, అర్ధనగ్న సన్నివేశమైనా అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటున్న సన్నీలియోన్ తదితరులు మిగతా భాషా చిత్రాల్లోను, దక్షిణాది చిత్రాల్లోను నటించేందుకు సిద్ధమవుతున్నారు. వీరి రాకతో తమ అవకాశాలు చేయిజారిపోకుండా ఉండేందుకు ఏ మేరకు దుస్తుల్లో పొదుపు పాటించాలో, బెడ్ రూం సన్నివేశాల్లో ఎలా జీవించాలో క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు. లిప్‌లాక్ సన్నివేశాలు సర్వసాధారణంగా మారాయి. కుటుంబ కథా చిత్రాల కథానాయకిగా ముద్రపడిన గుంకీ (గజరాజు) హీరోయిన్ లక్ష్మీమీనన్‌కు తన ఐదవ చిత్రంలోనే లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఁనాన్ సిగప్పు మనిదన్* చిత్రం కోసం ఇటీవల లిప్ టు లిప్ సీన్ చిత్రీకరించారు. రేసు గుర్రర చిత్రంలో శ్రుతిహాసన్ బెడ్రూం సీన్లో అసభ్యంగా నటించినట్లు మహిళా సంఘాలు నిరసనలు తెలిపాయి. ఁచంద్రా* చిత్రంలో నటి శ్రీయ జాకెట్ ధరించకుండా నటించారు. టాప్‌లెస్ నటీమణుల సినీ ప్రవేశం, సెక్స్ చిత్రాలను ప్రోత్సహించే విధంగా ఉందని, అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం లేదని చిత్రవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.