ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు | Heroines interest skin show | Sakshi
Sakshi News home page

ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు

Published Thu, Mar 27 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు

ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు

ఇతర ప్రాంతాల నుంచి శృంగార తారల రాక అధికమవడంతో దక్షిణాది తారలు ఎక్స్‌పోజింగ్ కోసం సంకోచించడం లేదు. గతంలో బికినీ దుస్తులు ధరించేందుకు విముఖత చూపిన హీరోయిన్లు కూడా ప్రస్తుతం అంగాంగ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పాకిస్థాన్ నటి వీణా మాలిక్, బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, టాప్‌లెస్ నటీమణులు షెర్లిన్ చోప్రా, సన్నిలియోన్ వంటి తారల ఆకస్మిక చిత్రరంగ ప్రవేశం మిగతా హీరోయిన్లకు తలనొప్పిగా పరిణమించింది

బెడ్ రూం సీన్ అయినా, అర్ధనగ్న సన్నివేశమైనా అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటున్న సన్నీలియోన్ తదితరులు మిగతా భాషా చిత్రాల్లోను, దక్షిణాది చిత్రాల్లోను నటించేందుకు సిద్ధమవుతున్నారు. వీరి రాకతో తమ అవకాశాలు చేయిజారిపోకుండా ఉండేందుకు ఏ మేరకు దుస్తుల్లో పొదుపు పాటించాలో, బెడ్ రూం సన్నివేశాల్లో ఎలా జీవించాలో క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు. లిప్‌లాక్ సన్నివేశాలు సర్వసాధారణంగా మారాయి. కుటుంబ కథా చిత్రాల కథానాయకిగా ముద్రపడిన గుంకీ (గజరాజు) హీరోయిన్ లక్ష్మీమీనన్‌కు తన ఐదవ చిత్రంలోనే లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలాగే ఁనాన్ సిగప్పు మనిదన్* చిత్రం కోసం ఇటీవల లిప్ టు లిప్ సీన్ చిత్రీకరించారు. రేసు గుర్రర  చిత్రంలో శ్రుతిహాసన్ బెడ్‌రూం సీన్‌లో అసభ్యంగా నటించినట్లు మహిళా సంఘాలు నిరసనలు తెలిపాయి. ఁచంద్రా* చిత్రంలో నటి శ్రీయ జాకెట్ ధరించకుండా నటించారు. టాప్‌లెస్ నటీమణుల సినీ ప్రవేశం, సెక్స్ చిత్రాలను ప్రోత్సహించే విధంగా ఉందని, అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం లేదని చిత్రవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement