Sriya
-
నా అందానికి అదే కారణం
నా అందానికి కారణం అదేనంటోంది నటి శ్రియ. కథానాయకిగా 15 వసంతాలను టచ్ చేసిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇప్పటికీ తన స్థానాన్ని పదిలం పరుచుకుంటూ వస్తోంది. ఇటీవలే రష్యాకు చెందిన తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ ఆండ్రును నిడారంబరంగా పెళ్లి చేసుకున్న శ్రియ నటనను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ అమ్మడు అరవిందస్వామితో కలిసి నటించిన నరకాసురన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా శ్రియతో చిన్న భేటీ. ప్ర: నరకాసురన్ ఏ తరహా చిత్రం? అందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? జ: నిజం చెప్పాలంటే ఇది దర్శకుడి చిత్రం. నాకు చిత్రం చూపించారు. చూశాక ఆశ్చర్యపోయాను. ఒక పజిల్‌ను ముక్కలు ముక్కలుగా పడేసి వాటిని మళ్లీ కరెక్ట్‌గా పేరుస్తారు. అలాంటి ఒక పజిల్ లాంటిదే ఈ చిత్ర కథ. పజిల్‌ను కరెక్ట్‌గా పెట్టకుంటే పరిపూర్ణ చిత్రం కాలేదు. అలానే ఇందులోని ప్రతి పాత్ర ఉంటుంది. నరకాసురన్ అనే పజిల్ ఆటలో నా పాత్రనే కాదు ఏ పాత్రను విడదీసి చెప్పలేం. అంత చక్కని స్క్రీన్ ప్లేతో కూడిన చిత్రం ఇది. చిత్ర కథ మధ్య నుంచి మొదలైనా తొలి ఐదు నిమిషాల చిత్రాన్ని చూడడం మిస్ అయినా చిత్రం అర్థం కాదు. అంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లేను దర్శకుడు నరేన్ రాసుకున్నారు. నా పాత్రతోనే కథ ముఖ్య మలుపు తిరుగుతుంది. అరవిందస్వామి ధృవ అనే పాత్రలో నటించారు. నేను ఆయన భార్యగా సీత అనే పాత్రలో నటించాను. చాలా అమాయకపు అమ్మాయిగా, ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని వినోదభరిత పాత్రలో నటించాను. అండర్‌ప్లే చేసి నటించే అవకాశం నాకీ చిత్రంలో లభించింది. తెలుగు చిత్రం మనం తరువాత అంతగా ప్రేమించి నటించిన చిత్రం నరకాసురన్. ప్ర: చిత్ర కథ గురించి? జ: కథ గురించి చెప్పడం కుదరదు గానీ, కాన్సెప్ట్ చెబుతాను. నరకాసురన్ ఊరు పేరు పేరు కాదు. ఊర్లో పలు ప్రాంతాలు ఉంటాయి. అందులో ఒక ప్రాంతం గురించి ప్రజల్లో ఉండే నమ్మకం. అది మత పరంగా చూసే వారు కావచ్చు, మర్మంతో కూడిన ప్రాంతంగా మరికొందరు చూడవచ్చు. అలాంటి పలువురు దృష్టి కోణాలను చిత్రాన్ని దర్శకుడు చక్కగా బ్యాలెన్స్ చేశారు. ప్ర: అరవిందస్వామితో కలిసి నటించిన అనుభవం గురించి? జ: ఆయనతో నటించడం చాలా సులభం అనిపించింది. అరవిందస్వామి నటించిన పలు చిత్రాలను నేను చూశాను. ఈ చిత్రంలోని కథా పాత్రకు నేను నప్పుతానని భావించింది అరవిందస్వామినే. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేయడానికి ఈ చిత్రం కోసం శ్రమించి నటించాను. ఆయనతో కలిసి నటించిన సన్నివేశాల్లో నేను ఇంకాస్త అందంగా కనిపించాననే భావన చిత్రం చూసిన వారికి కలుగుతుంది. ప్ర: గత 15 ఏళ్లుగా అదే రూపం.అదే అందం. ఇది శ్రియకు మాత్రమే ఏలా సాధ్యం? జ: ఎప్పుడూ నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటాను. నిత్యం శారీరక వ్యాయామాలు తప్పనిసరి. ఇక డాన్స్‌పై నాకున్న అమిత ప్రేమ నా అందానికి ప్రధాన కారణం అనుకుంటాను. మంచి కథక్ డాన్సర్ అని నన్ను నేను గౌరవించుకుంటాను. నిత్యం చేసే ధ్యానం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వీటిలో పాటు ఎక్కువగా పయనం చేస్తాను. పయనంలో కొత్త కొత్త వ్యక్తులను కలుసుకుంటాను. వారితో మాట్లాడతాను. ఇది మనసును, ఆలోచనలను ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది. -
శ్రియానుభవాలు
పదిహేనేళ్లు ఇండస్ట్రీ. వితౌట్ సింగిల్ బ్రేక్! మినిమమ్ పదిహేను మంది హీరోలతో చేసింది. వితౌట్ బ్రేక్! రోజుకో గాసిప్ పుట్టే ఇండస్ట్రీలో.. పదిహేను వసంతాలు. అన్ని క్యారెక్టర్లూ చేసింది. ఇంత క్యారెక్టర్ కూడా పోగొట్టుకోలేదు. ఇవిగోండి.. శ్రియానుభవాలు. హాయ్ శ్రియాగారూ.. పదేళ్ల క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు.. సీక్రెట్? మా అమ్మ నాన్నల జీన్స్ వల్లే ఇలా ఉన్నా. వాళ్లిద్దరూ స్లిమ్‌గా ఉంటారు. ఎంత తిన్నా బరువు పెరగను. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. యోగా చేస్తాను. నేను కథక్ డ్యాన్సర్‌ని. వీలున్నప్పు డల్లా ఇంట్లో కథక్ ప్రాక్టీస్ చేస్తాను. జిమ్ కంపల్సరీ. డైటింగ్ చేయను కానీ, ఏం తింటున్నాం అనే విషయంలో మాత్రం కేర్ తీసుకుంటాను. రైట్ ఫుడ్ తింటాను. రైట్ ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో రైట్ టైమ్‌కి ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే... త్వరలో రిలీజ్ కాబోతున్న ‘పైసా వసూల్’లో మీ క్యారెక్టర్ గురించి చెబుతారా? ఇందులో నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ని. స్వీట్ అండ్ సింపుల్ క్యారెక్టర్. ఒక మహిళా జర్నలిస్ట్ అంకితభావంతో పనిచేయాల్సి రావడం, అనుకున్నది సాధించాలన్న పట్టుదల వంటి అంశాలు నచ్చాయి. అందుకే ఈ పాత్రను ఎంజాయ్ చేశాను. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చేసిన పాత్రకు భిన్నమైనది ‘పైసా వసూల్’ పాత్ర. ఈ ట్రాన్స్ఫార్మేషన్ గురించి? ‘గౌతమిపుత్ర...’లో యువరాణిని. ‘పైసా వసూల్’లో నేటి తరం అమ్మాయిని. జర్నలిస్ట్‌ని. వెంట వెంటనే ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని క్యారెక్టర్స్ చేయడం థ్రిల్ అనిపించింది. ఏ ఆర్టిస్ట్‌కైనా ఇలా చేయడం ఓ చాలెంజ్. ఇలాంటి సవాళ్లు ఎన్ని వస్తే అంత హ్యాపీగా ఉంటా. పూరి జగన్నాథ్‌గారితో నాకిది ఫస్ట్ మూవీ. ఆయన టేకింగ్‌ని ఎంజాయ్ చేశాను. పదిహేనేళ్లుగా సినిమాలు చేస్తున్నారు.. ఇప్పుడు తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ. ఏమనిపిస్తోంది? వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనందపడే విషయాలు చాలా ఉన్నాయి. యాక్టింగ్‌ని ప్రేమిస్తాను. అయితే కెమేరా ముందు మాత్రమే. చేసే పని మీద ప్రేమ ఉన్నప్పుడు ఎన్నేళ్లుగా పని చేస్తున్నాం అనే లెక్కలు వేసుకోం. మీ కెరీర్‌ని ఎనలైజ్ చేస్తే, ఇండిపెండెంట్‌గా ఎదిగినట్లు అనిపిస్తుంది.. మీ అమ్మానాన్న ఎప్పుడూ మీ పక్కనే ఉంటూ గైడ్ చేయలేదు? మా అమ్మగారు కొన్నిసార్లు నా షూటింగ్ డేట్స్ చూశారు. అయితే మీరన్నట్లు అదే పనిగా పెట్టుకుని నన్ను గైడ్ చేయలేదు. నన్ను నమ్మారు. కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తూ డేట్స్ మేనేజ్ చేయడం కష్టం. నాకు మేనేజర్ ఉన్నారు. ఇంకా హెల్ప్ చేయడానికి నా చుట్టూ మనుషులు ఉన్నారు. ఏదేమైనా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఉంది. అందరి మీదా ఆధారపడి పైకి రావడం కన్నా ‘సెల్ఫ్ మేడ్’ అనిపించుకోవడంలో ఓ తృప్తి ఉంటుంది. ఈ జర్నీలో చేదు అనుభవాలు? హరిద్వార్‌లో సింపుల్ ఫ్యామిలీలో పుట్టాను. ఢిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజీలో బీఏ చేశాను. సినిమాలనేది నేను ఊహించలేదు. సడన్‌గా ఈ ప్రపంచంలోకి వచ్చాను. ముందు కొంచెం తికమకగానే అనిపించింది. లక్కీగా నాకెలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురవ్వలేదు. ఇప్పటివరకూ నేను పని చేసిన హీరోలు, డైరెక్టర్లు... అందరూ నాకు బాగానే సపోర్ట్ చేశారు. దాంతో ఇబ్బంది అనిపించలేదు. ఒకవేళ ఒక చిన్న చేదు అనుభవం ఎదురైనా అందులోంచి బయటకు రావడానికి కొంచెం టైమ్ పట్టేది. ఈ లాంగ్ జర్నీలో అలాంటి ‘టైమ్’ రాకపోవడం నా లక్. అఫ్కోర్స్ కొన్ని చిన్ని చిన్ని చేదు అనుభవాలు ఉన్నాయనుకోండి. ఏది ఏమైనా ఆ దేవుడు చల్లగా చూస్తున్నాడనుకుంటున్నా. చేదు అనుభవాలు అన్నారు... ఉదాహరణకు? కెరీర్లో ‘ఫ్లాప్’కి మించిన చేదు అనుభవం మరొకటి ఉండదు. ఫ్లాప్ మూవీస్ నా లిస్టులో చాలానే ఉన్నాయి. మొదట్లో తేరుకోవడానికి టైమ్ పట్టేది. రాను రాను హిట్టూ ఫ్లాప్స్కి అతీతంగా రియాక్ట్ అవ్వడం మొదలైంది. చెప్పిన టైమ్‌కి శ్రియ షూటింగ్‌కి రాలేదు... ఫలానా హీరోతో ఎఫైర్ అనే వార్తలు రాలేదు. గాసిప్స్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏమీ చేయనప్పుడు ఎందుకు మేనేజ్ చేయాలి? టైమింగ్స్ వైజ్‌గా పర్ఫెక్ట్గా ఉంటాను. షూటింగ్ స్పాట్లో ఇబ్బంది పెట్టను. ఎవరితోనూ ఎఫైర్లు లేవు. అందుకే నా గురించి వార్తలు రావు. అలాగే సినిమాల్లో చేసే క్యారెక్టర్ని బట్టి ఆ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ‘ఇలా ఉంటుంది’ అని కొందరు ఎనలైజ్ చేస్తుంటారు.. దాని గురించి? అది నిజమే. సినిమాల్లో వెస్ట్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తే... విడిగా అలాంటివే వేసుకుంటామని అనుకుంటారు. ప్రతిరోజూ పార్టీకి వెళతామని ఫిక్స్ అయిపోతారు. ఒకవేళ చీరల్లో కనిపిస్తే సాధ్వి అంటారు. సినిమాల్లో ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు ప్రవర్తిస్తాం. రియల్‌గా మేం వేరేలా ఉంటాం. ఆన్ స్క్రీన్ మమ్మల్ని చూసి, ఆఫ్ ది స్క్రీన్ కూడా అలానే ఉంటామని ఊహించు కునేవాళ్ల ఆలోచనా విధానం మారాలి. ఈ ప్రపంచంలోనే మీరెక్కువగా ఇష్పడే వ్యక్తి? మా అమ్మగారు. నన్ను పెంచి, పెద్ద చేసి, నేనింతవరకూ రావడానికి కారణం తను. కూతురి జీవితం బాగుండాలని తపన పడింది. అమ్మ గురించి మాట్లాడ్డానికి రోజులు చాలవు. నేను చదువుకునేటప్పుడు తనూ స్టూడెంట్ అయింది. నా మానాన నన్ను వదిలేయకుండా పక్కనే కూర్చుని చదివించేది. నాతో పాటు డ్యాన్స్ స్కూల్‌కి వచ్చేది. హీరోయిన్ అయినప్పుడు తోడుగా షూటింగ్ స్పాట్‌కి వచ్చింది. ‘స్పా’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ మొదలుపెడతానన్నప్పుడు సపోర్ట్ చేసింది. నేనివాళ ఇలా ఉన్నానంటే తనే కారణం. ఇప్పటివరకూ మీ ‘మిస్టర్ రైట్’ మీకు తారసపడలేదా? (నవ్వుతూ). తక్కువ టైమ్‌లోనే తను నా లైఫ్‌లోకి వస్తాడన్న నమ్మకం ఉంది. ఎలాంటి లక్షణాలున్న అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నారు? అతను నాకు మంచి ఫ్రెండ్‌లా ఉండాలి. అతనితో నా మిగతా జీవితాన్ని సాఫీగా గడప గలగాలి. మానసికంగా, ఆధ్యాత్మికంగానూ అతనితో నా ప్రయాణం బాగుండాలి. ఫైనల్లీ... పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? మహిళల జీవితంలో పెళ్లి, పిల్లలు అనేది చాలా ముఖ్యమైన విషయం. జరగాల్సి నప్పుడు తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతానికి చేసే పనిని నేను లవ్ చేస్తున్నాను. సెప్టెంబర్ 11న మీ బర్త్‌డే.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? (నవ్వుతూ). ఇంకా చాలా టైమ్ ఉంది. ఏమీ అనుకోలేదు. అయితే ఒకటి మాత్రం నమ్ముతాను. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అనేది చాలా ముఖ్యమైనది. నా గత పుట్టినరోజున మా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు. పోయిన ఏడాది సెప్టెంబర్ 5న వినాయక చవితి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. నా బర్త్‌డే నాడు మా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు. అందుకని ఆ రోజున గణపతికి పూజ చేశాను. ఇప్పటివరకూ జరుపుకున్న వాటిలో బెస్ట్ బర్త్‌డే? నా చిన్ననాటి పుట్టినరోజులు బెస్ట్. ఎందుకంటే అమ్మ చాలా హడావిడి చేసేది. కేక్ కట్ చేయించేది. నాకు శాండ్విచెస్ ఇష్టం. బర్త్‌డే నాడు తప్పనిసరిగా అవి చేసేది. నా స్నేహితులు మా ఇంటికి వచ్చేవారు. సింపుల్‌గా చేసినా బాగా అనిపించింది. ఇప్పుడూ అమ్మ హడావిడి చేస్తుంది కానీ, చిన్నప్పుడు ఉన్నంత ఎగ్జయిట్మెంట్ ఉండదు కదా. సమాజంలో మద్యం, డ్రగ్స్, సిగరెట్స్ అంటూ.. చెడు వీరవిహారం చేస్తోంది... పిల్లలకు మీరిచ్చే సలహా? జీవితానికి హాని చేసేవాటి పట్ల ఎట్రాక్ట్ కావడం మంచిది కాదు. చదువు మీద ఏకాగ్రత చూపించాలి. కెరీర్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ కెరీర్ పట్ల బాధ్యతగా ఉండాలి. కుటుంబంలో ఒక్కరు చెడు అలవాట్లకు బానిస అయినా అందరూ బాధపడాల్సి వస్తుంది. చెడు అలవాట్లు ఉంటే... వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయినా దూరం కాలేకపోతున్నారంటే... డాక్టర్ని సంప్రదించాలి. ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నింటికన్నా జీవితం ముఖ్యమైనది. వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ పండగకి సంబంధించిన చిన్నప్పటి గుర్తులేమైనా ఉన్నాయా? ఒకే ఒక్క ఇన్సిడెంట్ అంటే చెప్పలేను. వినాయక చవితి అంటే మా ఇంట్లో సందడిగా ఉంటుంది. హరిద్వార్, ఢిల్లీ, ఆ తర్వాత ముంబైలో... ఇలా ఎక్కడ ఉన్నా పండగ చేసుకోవడం అలవాటు. స్వాతంత్య్రం రాక ముందు ప్రజలు స్వాతంత్య్ర సాధన కోసం బోల్డన్ని చర్చా వేదికలు పెట్టుకునేవాళ్లు. అందరూ కలసి మంచీ చెడూ మాట్లాడుకునేవాళ్లు. స్వాతంత్య్రం సాధించాక అలాంటి మీటింగ్స్ తగ్గాయి. క్రమంగా ఎవరి దారిన వాళ్లు బతకడం మొదలైంది. కానీ, ఇలాంటి పండగలు అందర్నీ కలుపుతాయి. గణేశుణ్ణి ప్రతిష్టించి, భారీ పందిళ్లు వేసి, ఏడు, తొమ్మిది రోజులు వైభవంగా పూజలు జరిపి, నిమజ్జనం చేసేవరకూ.. అందరూ కలుస్తారు. ప్రసాదాలు పంచుతారు. మనుషులను దగ్గర చేసే ఈ పండగ అంటే ఇష్టం. మట్టి గణేశుడినే పూజించారా? పర్యావరణానికి హాని కలిగించకూడదు. అందుకే మట్టి గణపతిని పూజించా. మా ఇంట్లో ఉన్న వాటర్ ఫౌంటెన్‌లో నిమజ్జనం చేయడం అలవాటు. నాగార్జునగారు ఫస్ట్ సూపర్ స్టార్ మీ సెకండ్ సినిమా (‘సంతోషం’)కే నాగార్జునగారి సరసన నటించారు. ఆ తర్వాత ఆయనతో ‘నేనున్నాను’, ‘మనం’ సినిమాల్లో జతకట్టారు.. ‘ఊపిరి’లోనూ నాగ్‌తో కాసేపు కనిపించారు..ఈ 29న ఆయన బర్త్‌డే. నాగ్ గురించి కొన్ని విశేషాలు? నా ఫస్ట్ సూపర్‌స్టార్ నాగార్జునగారే. ఆయన సినిమాలు చూస్తూ పెరిగినదాన్ని. సౌత్ మూవీస్ హిందీలో రిలీజయ్యేవి. అలా ‘శివ’ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు చాలా చిన్నపిల్లని. భవిష్యత్తు గురించి ఎలాంటి ఊహలు లేవు. కట్ చేస్తే... ఆయన పక్కన హీరోయిన్గా నటించగలిగాను. అది కూడా నా సెకండ్ సినిమాకే. ‘సంతోషం’ నా కెరీర్‌కి సంతోషాన్నిచ్చిన మూవీ. ఆ సినిమా తర్వాత నేను ఫుల్ బిజీ. నాగ్ వైఫ్ అమలగారితో మీ ఈక్వేషన్? అమలగారు లవ్లీ. నాతో సన్నిహితంగా ఉంటారు. ఆమె సలహా మేరకే నేను విపశ్శన యోగ చేశాను. నా లైఫ్‌లో నేను అందుకున్న మంచి సలహాలలో అమలగారి నుంచి ఈ సలహా ఒకటి. విపశ్శన ధ్యానం చేశాక నేను మారాను. అంతకు ముందు కన్నా ప్రశాంతంగా ఉంటోంది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగు తున్నాను. నాగార్జునగారి పక్కన నటించినప్పుడు సినిమాల వైజ్‌గా మీరు కిడ్. ఎలా అనిపించింది? భయం అనిపించలేదు. ఎందుకంటే, నాగార్జునగారు తానో స్టార్ అనే ఫీలింగ్‌తో మాట్లాడేవారు కాదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. యూనిట్ మొత్తం అలానే ఉండేది. దాంతో సంతోషంగా పని చేశా. నా కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నాగ్ సార్‌తో చేసిన సినిమాలు ఉన్నాయి. ఆయనకు ‘సాక్షి’ ద్వారా మనస్ఫూర్తిగా బర్త్‌డే విషెస్ చెబుతున్నా. – డి.జి. భవాని -
సినిమాల్లోకి రాకముందు చరణ్, శ్రియ..!
-
సినిమాల్లోకి రాకముందే చరణ్, శ్రియ..!
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న రామ్ చరణ్, ఆ స్థానం కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాలోకి రాకముందు యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అలా శిక్షణలో ఉన్న సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చరణ్ ముంబైలోని యాక్టింగ్ ఇన్సిస్టిట్యూట్ లో ఉండగా తీసినదని తెలుస్తోంది. అప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న శ్రియ, ఇన్సిస్టిట్యూట్ ను విజిట్ చేసిన సమయంలో చరణ్ ఆమెతో కలిసి ఓ సీన్ లో నటించాడు. దాదాపు పదేళ్ల క్రితం తీసిన ఈ వీడియోలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాస్త కంగారుగా పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. శ్రియ మాత్రం తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సరసన నటించిన శ్రియతో చరణ్ సినిమాల్లోకి రాకముందే రొమాంటిక్ సీన్ లో నటించేశాడు. -
'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ రివ్యూ
టైటిల్ : గౌతమిపుత్ర శాతకర్ణి జానర్ : హిస్టారికల్ మూవీ తారాగణం : బాలకృష్ణ, శ్రియ, హేమామాలిని, కబీర్ బేడీ, శివరాజ్ కుమార్ సంగీతం : చిరంతన్ భట్ దర్శకత్వం : క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) నిర్మాత : వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రక కథాంశం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ వందో సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను గౌతమిపుత్ర శాతకర్ణి అందుకుందా..? అంత ఘనమైన చరిత్రను కేవలం 79 రోజుల్లోనే తెరకెక్కించిన క్రిష్.. ఆకట్టుకున్నాడా..? కథ : శాతకర్ణి (బాలకృష్ణ) అమరావతి రాజ్య రాకుమారుడు. ఉగ్గుపాలతోనే వీరత్వాన్నీ పుణికి పుచ్చుకున్న మహావీరుడు. యుద్ధానికని తన తండ్రి తరచూ కదనరంగానికి వెళుతున్నాడని.. అసలు అంతా ఒకే రాజ్యమైతే యుద్ధం చేయాల్సిన అవసరమే రాదని, అఖండ భారతాన్ని ఒకే రాజ్యంగా చేస్తానని చిన్నతనంలోనే తల్లి గౌతమి బాలాశ్రీ(హేమామాలిని)కి మాట ఇస్తాడు. అందుకోసం అతడు జైత్రయాత్ర మొదలుపెడతాడు. శాతకర్ణి పరాక్రమానికి యావత్ దక్షిణ భారతం దాసోహం అంటుంది. తరువాత శాతకర్ణి చూపు ఉత్తరభాతరం మీద పడుతుంది. ఇతర రాజ్యాల రాకుమారులను ఎత్తుకెళ్లి ఆ రాజులను తన సామంతులుగా చేసుకునే నహపానుడు ఉత్తర భారతాన్ని పాలిస్తుంటాడు. శాతకర్ణి, సైన్యం తనవైపుగా వస్తుందని తెలుసుకున్న నహపానుడు శాతకర్ణి కొడుకును కదన రంగానికి తీసుకురమ్మని కబురు పంపుతాడు. అందుకు శాతకర్ణి భార్య వాశిష్టి దేవి (శ్రియ) అంగీకరించకపోయినా, శాతకర్ణి పసిబాలుడైన కొడుకుతో కలిసి యుద్ధానికి సిద్ధమవుతాడు. నహపానుడిని గెలిచి అఖండ భారతాన్ని ఒకే రాజ్యంగా మారుస్తాడు. శాతకర్ణి విజయానికి గుర్తుగా అతని తల్లి గౌతమి బాలాశ్రీ(హేమామాలిని) రాజసూయ యాగం తలపెడుతుంది. ఆ యాగంలోనే తనకు ఇంతటి వీరత్వాన్ని అందించిన తల్లి పేరును తన పేరుకు ముందుకు చేర్చుకొని గౌతమిపుత్ర శాతకర్ణి అవుతాడు. యావత్ భరతఖండం ఒకే రాజ్యంగా ఏర్పడిన ఆ రోజును శాలివాహన శఖ ఆరంభంగా, యుగాదిగా ప్రకటిస్తాడు. దేశంలోని అన్ని రాజ్యాలు ఏకమైనా పరాయి దేశాల నుంచి ముప్పు మాత్రం అలాగే ఉంటుంది. సామాంతులను వశపరుచుకున్న యవన సామ్రాట్ డిమెత్రీస్, శాతకర్ణిపై యుద్ధం ప్రకటిస్తాడు. దొంగచాటుగా శాతకర్ణిని హతమార్చి తిరిగి భారతభూమిని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటాడు. ఈ కుట్రను శాతకర్ణి ఎలా జయించాడు..? అఖండ భారతం కోసం శాతకర్ణి కన్న కల నెరవేరిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రాన్ని ఎంపిక చేసుకున్న బాలకృష్ణ మరోసారి జానపద పౌరణిక పాత్రలకు తానే సరైన నటుడని నిరూపించుకున్నాడు. ఆహార్యంలోనూ, రాజసంలోనూ మహారాజులానే కనిపించి ఆకట్టుకున్నాడు. భారీ యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటన అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. చారిత్రక కథాంశమే అయినా ఎక్కడ తననుంచి అభిమానులు ఆశించే అంశాలు మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు బాలకృష్ణ. రాణీ వాశిష్టీ దేవిగా శ్రియ మెప్పించింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా పసిబాలుడైన కొడుకును యుద్ధరంగానికి పంపమని భర్త అడినప్పుడు, తిరిగి వస్తాడో రాడో తెలియని సమయంలో భర్తను యుద్ధానికి సాగనంపుతున్నప్పుడు శ్రియ చూపించిన హవాభావాలు అద్భుతం. రాజమాత గౌతమి బాలాశ్రీ పాత్రలో హేమామాలిని హుందాగా కనిపించింది. ఆమె స్టార్ డమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇతర నటీనటులు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు యంగ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన క్రిష్ తొలిసారిగా ఓ సీనియర్ స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించి ఘన విజయం సాధించాడు. బాలయ్య వందో సినిమాగా చారిత్రక కథాంశాన్ని చెప్పి ఒప్పించిన క్రిష్ అక్కడే విజయం సాధించాడు. ఎన్నో యుద్ధాలు చేసిన ఓ మహా చక్రవర్తి కథను కేవలం 79 రోజుల్లో తెరకెక్కించిన క్రిష్ సినిమా నిర్మాణం, దర్శకత్వంలో మీద తనకు ఎంత పట్టు ఉందో నిరూపించింది. అంత తక్కువ సమయంలో సినిమాను తెరకెక్కించినా ఎక్కడా హడావిడి పూర్తి చేసినట్టుగా కనిపించకుండా ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఎక్కవగా విజువల్ ఎఫెక్ట్స్ జోలికి వెల్లకుండా వీలైనంత వరకు ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు త్వరగా పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు. అయితే లోకేషన్లుగా క్రిష్ ఎంచుకున్న రాజప్రాసాదాలు, యుద్ధ రంగాలు.. అలనాటి శాతకర్ణి వైభవాన్ని కళ్లకు కట్టాయి. క్రిష్ ఊహలకు రూపమివ్వటంలో సినిమాటోగ్రాఫర్ జ్ఞాణశేఖర్ విజయం సాధించాడు. ప్రతీ ఫ్రేమ్ లోనూ శాతవాహనుల రాజసం కనిపించేలా తెరకెక్కించాడు. చిరంతన్ భట్ సంగీతం, సూరజ్,రామకృష్ణల ఎడిటింగ్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని మరింత పెంచాయి. ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ నటన క్రిష్ కథా స్క్రీన్‌ప్లే మాటలు మైనస్ పాయింట్స్ : క్రిష్ మార్క్ డ్రామా లేకపోవటం ఓవరాల్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి... తెలుగు వారు గర్వంగా చెప్పుకోవాల్సిన ఘన చరిత్రకు అద్భుత దృశ్యరూపం - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
వశిష్టి దేవిగా శ్రియ
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. భారీ బడ్జెట్‌తో దర్శకుడు క్రిష్ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. హీరోయిన్ ఎంపిక కోసం చాలా ఆలస్యం చేసిన చిత్రయూనిట్ ఫైనల్‌గా శ్రియను కన్ఫామ్ చేసింది. ఇటీవలే ప్రారంభమైన షెడ్యూల్లో గౌతమీ పుత్ర శాతకర్ణి యూనిట్‌తో జాయిన్ అయ్యిందీ అందాల భామ. ఈ రోజు (ఆదివారం) శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని శ్రియ లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రియ క్లోజప్తో రిలీజ్ అయిన ఈ పోస్టర్లో రాణి లుక్‌లో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు చిత్తరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
లారీ ప్రమాదం: నుజ్జునుజ్జైన చిన్నారులు
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృత్యవాత పడ్డారు. వివరాలు... విజ్ఞాన్ జ్యోతి స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలను తాతయ్య స్కూటీపై ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీయ (10), హర్షిత (6) నుజ్జునుజ్జయి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తాతయ్య బాలయ్య (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తెగిపడిన అవయవాలతో ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. -
సీనియర్ హీరోయిన్‌కి గోల్డెన్ ఛాన్స్
టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి 2లో నటించనుందట. తొలి భాగంతో ఘనవిజయం సాధించిన బాహుబలి యూనిట్ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తోంది. బాహుబలి చిత్రంలో నెగెటివ్ రోల్లో భల్లాలదేవుడిగా నటించిన రానాకు జోడీగా రెండో భాగంలో శ్రియ నటించనుందట. తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. కథలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఈ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన యూనిట్ సభ్యులు ఈ పాత్రకు శ్రియను ఎంపిక చేశారు. అయితే ఇప్పటివరకు బాహుబలి సినిమాలో శ్రియ పాత్రపై యూనిట్ సభ్యుల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేయకపోయినా, బాహుబలి 2లో శ్రియ అంటూ టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బాహుబలి 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రీలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. -
'ఊపిరి'లో మరో గెస్ట్
సీనియర్ హీరోలు కథ ఎంపికలో తడబడుతుంటే, నాగార్జున మాత్రం ప్రయోగాత్మక చిత్రాలతో సత్తా చాటుతున్నాడు. సంక్రాంతి బరిలో 'సొగ్గాడే చిన్ని నాయనా' తో సూపర్ హిట్ కొట్టిన నాగ్, ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో కలిసి ఊపిరి చిత్రంలోనటిస్తున్నాడు. ది ఇంటచబుల్స్ అనే ఫ్రెంచ్ మూవీ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీల్ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు నాగ్. నాగార్జున, కార్తీ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. అనుష్క, అడవిశేష్, నోరా ఫతేహి, సౌత్ ఆఫ్రికన్ మోడల్ గాబ్రియల్ లు అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో గ్లామర్ యాడ్ అయ్యింది. ఒరిజినల్ వర్షన్ లో నాగ్ పాత్రకు హీరోయిన్ లేకపోయినా, నాగ్ ఇమేజ్ దృష్ట్యా ఊపిరి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ను యాడ్ చేశారు. ఆ పాత్రకు గతంలో నాగార్జున సరసన సంతోషం సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రియను ఎంపిక చేసారు. తెలుగు, తమిళ భాషల్లో పివిపి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది. -
భల్లాలదేవ భార్యగా..!
టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2లో నటించనుందట. తొలి భాగంతో ఘనవిజయం సాధించిన బాహుబలి యూనిట్ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తోంది. బాహుబలి చిత్రంలో నెగెటివ్ రోల్లో భల్లాలదేవగా నటించిన రానాకు జోడిగా రెండో భాగంలో శ్రియ నటించనుందట. తొలి భాగంలో రానాకు కొడుకు పాత్రను మాత్రమే చూపించిన రాజమౌళి రెండో భాగంలో భల్లాలదేవ భార్యను కూడా చూపించనున్నాడు. కథలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఈ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన యూనిట్ సభ్యులు ఈ పాత్రకు శ్రియను ఎంపిక చేశారట. అయితే ఇప్పటి వరకు బాహుబలి సినిమాలో శ్రియ పాత్రపై యూనిట్ సభ్యుల అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయకపోయినా, బాహుబలి 2లో శ్రియ అంటూ టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, రానాలు లీడ్ రోల్లో నటించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ 2016 జూలై నాటికి బాహుబలి 2ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. -
శ్రియ.. అవకాశాల్లేవేల?
-
ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు
ఇతర ప్రాంతాల నుంచి శృంగార తారల రాక అధికమవడంతో దక్షిణాది తారలు ఎక్స్పోజింగ్ కోసం సంకోచించడం లేదు. గతంలో బికినీ దుస్తులు ధరించేందుకు విముఖత చూపిన హీరోయిన్లు కూడా ప్రస్తుతం అంగాంగ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పాకిస్థాన్ నటి వీణా మాలిక్, బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, టాప్‌లెస్ నటీమణులు షెర్లిన్ చోప్రా, సన్నిలియోన్ వంటి తారల ఆకస్మిక చిత్రరంగ ప్రవేశం మిగతా హీరోయిన్లకు తలనొప్పిగా పరిణమించింది బెడ్ రూం సీన్ అయినా, అర్ధనగ్న సన్నివేశమైనా అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటున్న సన్నీలియోన్ తదితరులు మిగతా భాషా చిత్రాల్లోను, దక్షిణాది చిత్రాల్లోను నటించేందుకు సిద్ధమవుతున్నారు. వీరి రాకతో తమ అవకాశాలు చేయిజారిపోకుండా ఉండేందుకు ఏ మేరకు దుస్తుల్లో పొదుపు పాటించాలో, బెడ్ రూం సన్నివేశాల్లో ఎలా జీవించాలో క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు. లిప్‌లాక్ సన్నివేశాలు సర్వసాధారణంగా మారాయి. కుటుంబ కథా చిత్రాల కథానాయకిగా ముద్రపడిన గుంకీ (గజరాజు) హీరోయిన్ లక్ష్మీమీనన్‌కు తన ఐదవ చిత్రంలోనే లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఁనాన్ సిగప్పు మనిదన్* చిత్రం కోసం ఇటీవల లిప్ టు లిప్ సీన్ చిత్రీకరించారు. రేసు గుర్రర చిత్రంలో శ్రుతిహాసన్ బెడ్రూం సీన్లో అసభ్యంగా నటించినట్లు మహిళా సంఘాలు నిరసనలు తెలిపాయి. ఁచంద్రా* చిత్రంలో నటి శ్రీయ జాకెట్ ధరించకుండా నటించారు. టాప్‌లెస్ నటీమణుల సినీ ప్రవేశం, సెక్స్ చిత్రాలను ప్రోత్సహించే విధంగా ఉందని, అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం లేదని చిత్రవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
మాలీవుడ్‌లో భంగపడ్డ శ్రియ
-
చిన్నారి శ్రియ హత్యకేసులో తీర్పు వెల్లడి
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శ్రీయ