సినిమాల్లోకి రాకముందే చరణ్, శ్రియ..! | Ram Charan, sriya perform together in acting school | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి రాకముందే చరణ్, శ్రియ..!

Jul 25 2017 12:56 PM | Updated on Sep 5 2017 4:51 PM

సినిమాల్లోకి రాకముందే చరణ్, శ్రియ..!

సినిమాల్లోకి రాకముందే చరణ్, శ్రియ..!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న రామ్ చరణ్, ఆ స్థానం కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాలోకి రాకముందు

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న రామ్ చరణ్, ఆ స్థానం కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాలోకి రాకముందు యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.  అలా శిక్షణలో ఉన్న సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చరణ్ ముంబైలోని యాక్టింగ్ ఇన్సిస్టిట్యూట్ లో ఉండగా తీసినదని తెలుస్తోంది.

అప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న శ్రియ, ఇన్సిస్టిట్యూట్ ను విజిట్ చేసిన  సమయంలో చరణ్ ఆమెతో కలిసి ఓ సీన్ లో నటించాడు. దాదాపు పదేళ్ల క్రితం తీసిన ఈ వీడియోలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాస్త కంగారుగా పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. శ్రియ మాత్రం తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సరసన నటించిన శ్రియతో చరణ్ సినిమాల్లోకి రాకముందే రొమాంటిక్ సీన్ లో నటించేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement