
వశిష్టి దేవిగా శ్రియ
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. భారీ బడ్జెట్తో దర్శకుడు క్రిష్ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. హీరోయిన్ ఎంపిక కోసం చాలా ఆలస్యం చేసిన చిత్రయూనిట్ ఫైనల్గా శ్రియను కన్ఫామ్ చేసింది. ఇటీవలే ప్రారంభమైన షెడ్యూల్లో గౌతమీ పుత్ర శాతకర్ణి యూనిట్తో జాయిన్ అయ్యిందీ అందాల భామ.
ఈ రోజు (ఆదివారం) శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని శ్రియ లుక్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రియ క్లోజప్తో రిలీజ్ అయిన ఈ పోస్టర్లో రాణి లుక్లో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు చిత్తరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.