
బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడు
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు సంబందించి టీజర్ ట్రైలర్లకు ముహూర్తం ఫిక్స్ చేశారు. తన సినిమాకు సంబందించిన ప్రతీ విషయాన్ని పంచాంగం ప్రకారమే ఫాలో అయ్యే నందమూరి అందగాడు వందో సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు.
ఇప్పటికే సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ దసరా సందర్భంగా మరో లుక్ని, ట్రైలర్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 9న సినిమాలో బాలయ్య గెటప్ రివీల్ చేసే పోస్టర్ను రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 11 ఉదయం 8 గంటలకి గౌతమీ పుత్ర శాతకర్ణి తొలి టీజర్ను రిలీజ్ చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమామాలిన మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. క్రియేటివ్ డైరెక్టర్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.