gauthami puthra sathakarni
-
పూరి నెక్ట్స్ సినిమా బాలయ్యతోనా..?
ఇజం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్, తన నెక్ట్స్ సినిమాను ఎలాగైన ఓ స్టార్ హీరోతో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ లకు కథలు వినిపించినా.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. దీంతో ఇతర హీరోల మీద దృష్టి పెట్టాడు. యంగ్ జనరేషన్ హీరోలతో సెట్ కాకపోతే సీనియర్ హీరోలతో అయినా సినిమా చేయాలని భావిస్తున్న పూరి క్రేజీ కాంబినేషన్ కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తన వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. వీలైనంత త్వరగా బాలయ్యకు కథ చెప్పి ఓకె చేయించుకోవాలని భావిస్తున్నాడు. అయితే గౌతమీ పుత్ర శాతకర్ణి తరువాత రైతు, ఆదిత్య 999, రామారావుగారు లాంటి సినిమాలకు కమిట్ అయిన బాలయ్య పూరి టైం ఎప్పుడు ఇస్తాడో చూడాలి. -
బాలయ్య శాతకర్ణి టీజర్ వచ్చేసింది
-
బాలయ్య శాతకర్ణి లుక్ వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఇది బాలయ్య వందో సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో బాలయ్య లుక్ రివీల్ అయ్యింది. దసరా సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ శనివారం బాలయ్య సింహాసనం మీద కూర్చున్న రాయల్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే పౌరాణాక జానపద పాత్రల్లో అలరించిన బాలయ్య ఈ చారిత్రక పాత్రలోనే ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు నందమూరి అభిమానులు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడు
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు సంబందించి టీజర్ ట్రైలర్లకు ముహూర్తం ఫిక్స్ చేశారు. తన సినిమాకు సంబందించిన ప్రతీ విషయాన్ని పంచాంగం ప్రకారమే ఫాలో అయ్యే నందమూరి అందగాడు వందో సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ దసరా సందర్భంగా మరో లుక్‌ని, ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 9న సినిమాలో బాలయ్య గెటప్ రివీల్ చేసే పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 11 ఉదయం 8 గంటలకి గౌతమీ పుత్ర శాతకర్ణి తొలి టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమామాలిన మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. క్రియేటివ్ డైరెక్టర్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
నితిన్ చేతికి బాలకృష్ణ సినిమా
యంగ్ హీరో నితిన్ నటనతో పాటు బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే నిర్మాతగా మారి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించిన నితిన్ వరుసగా భారీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంటున్నాడు. సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమా రిలీజ్ విషయంలో కూడా నితిన్ కీలకంగా మారాడు. తాజాగా టాలీవుడ్ హీరో సినిమా హక్కులను కూడా సొంతం చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఎంత మొత్తానికి రైట్స్ తీసుకున్నది వెల్లడించకపోయినా భారీగానే చెల్లించారన్న టాక్ వినిపిస్తోంది. Happy 2 announce tht v vl b distributing d prestigious N.B.K gari 100film GAUTAMIPUTRA SATAKARNI 4 Nizam area..thanku krish n rajeev garu. — nithiin (@actor_nithiin) 1 October 2016 -
బాలయ్య అభిమానులకు దసరా కానుక
-
బాలయ్య అభిమానులకు దసరా కానుక
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావటంతో మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హేమమాళిని, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల క్రిష్ పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకున్న యూనిట్, ప్రస్తుతం తిరిగి షూటింగ్ కార్యక్రమాలతో బిజీ అయ్యింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ సృష్టించిన గౌతమీ పుత్ర శాతకర్ణి టీం దసరా సందర్భంగా అభిమానులకు మరో కానుకను ఇచ్చేందుకు రెడీ అవుతోంది. చారిత్రక నేపథ్యంతో భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. క్రిష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కంచె ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
వశిష్టి దేవిగా శ్రియ
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. భారీ బడ్జెట్‌తో దర్శకుడు క్రిష్ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. హీరోయిన్ ఎంపిక కోసం చాలా ఆలస్యం చేసిన చిత్రయూనిట్ ఫైనల్‌గా శ్రియను కన్ఫామ్ చేసింది. ఇటీవలే ప్రారంభమైన షెడ్యూల్లో గౌతమీ పుత్ర శాతకర్ణి యూనిట్‌తో జాయిన్ అయ్యిందీ అందాల భామ. ఈ రోజు (ఆదివారం) శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని శ్రియ లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రియ క్లోజప్తో రిలీజ్ అయిన ఈ పోస్టర్లో రాణి లుక్‌లో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు చిత్తరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
డ్రీమ్‌గర్ల్‌కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి పేరుతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమాలో కీలకమైన శాతకర్ణి తల్లి పాత్రకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినిని తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ విజయం లాంటి తెలుగు సినిమాల్లో మాత్రమే నటించిన హేమామాలిని మరోసారి నందమూరి హీరో కోసమే తెలుగు సినిమాను అంగీకరించారు. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లోని పురాతన కోటలో ఈ సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లో పాల్గొంటున్న హేమకు బాలయ్య స్పెషల్ గిఫ్ట్‌ను అందించాడట. తను ప్రతినిధ్యం వహిస్తున్న హిందూపురం లో నేసిన లేపాక్షి చీరను హేమామాలినికి గిఫ్ట్ ఇచ్చాడు. గమ్యం, కంచె లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కంచె సినిమాకు సంగీతం అందించిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
బాలయ్య సినిమా నుంచి దేవీ శ్రీ అవుట్..?
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా నుంచి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తప్పకున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకుంది. అయితే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినా.. డబ్బింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్న బాలయ్య టీం.. దేవీ శ్రీ ప్రసాద్‌ను త్వరగా పాటలు పూర్తి చేసి ఇవ్వాలని కోరారట. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి హడావిడిగా మ్యూజిక్ చేస్తే చెడ్డ పేరు వస్తుందేమో అన్న అనుమానంతో దేవీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా గౌతమీ పుత్ర శాతకర్ణి టీం నుంచి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తప్పకున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. -
సంక్రాంతి బరిలో.. మళ్లీ ఆ ముగ్గురు
ఇన్నాళ్లు ఒకేసమయంలో రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఈ ఏడాది సంక్రాంతి నుంచి సీన్ మారిపోయింది. ఒకేసారి రెండు మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని ప్రూవ్ అయ్యింది. అంతేకాదు సరైన కంటెంట్ ఉంటే అంత కాంపీటీషన్లో కూడా ఓ చిన్న సినిమా సత్తా చాటగలదని నిరూపించాడు శర్వానంద్. నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన, డిక్టేటర్ లాంటి భారీ చిత్రాల రిలీజ్ సమయంలో ఎక్స్‌ప్రెస్ రాజాగా వచ్చి సక్సెస్ సాధించాడు. అందుకే మరోసారి అదే సాహసానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి బాలయ్య, నాగార్జునలు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. బాలయ్య గౌతమీ పుత్రశాతకర్ణిగా, నాగార్జున ఓం నమో వేంకటేశాయ సినిమాతో పరమ భక్తుడు హాథీరాం బాబాగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మరోసారి ఢీ అనేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి.. మరోసారి సత్తా చాటలని ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. దిల్ రాజుకు కూడా ఈ సీజన్లో మంచి రికార్డ్ ఉండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న క్రిష్
మూస కమర్షియల్ సినిమాలకు భిన్నంగా గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో ఆకట్టుకున్న జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్, ప్రస్తుతం ఓ భారీ పీరియాడిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాతో పాటు ఇదే ఏడాది తన జీవితానికి సంబంధించిన మరో కీలకమైన అడుగు వేస్తున్నాడు క్రిష్. చాలా రోజులుగా పెళ్లి చేసుకోవాలంటే కుటుంబ సభ్యులు చెపుతున్నా.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్న క్రిష్, చివరకు తల్లి మాటకు అంగీకరించాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రమ్యను వివాహమాడటానికి అంగీకరించాడు. ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న క్రిష్ త్వరలోనే ఓ ఇంటివాడవ్వనున్నాడు. -
చారిత్రక పాత్రలో శ్రియ
బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలో హీరోయిన్ పాత్ర కోసం చాలా రోజులుగా వెతుకున్న చిత్రయూనిట్ ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఐతే తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ను బాలయ్యకు జోడిగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. చాలా కాలం క్రితం చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన శ్రియను గౌతమీ పుత్రశాతకర్ణి సినిమాలో బాలయ్యకు జోడిగా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేని శ్రియ అయితే డేట్స్ సమస్య కూడా లేకుండా షూటింగ్ పూర్తి చేయొచ్చన ఆలోచనలో ఉన్నారు యూనిట్. చివరగా గోపాల గోపాల సినిమాలో నటించిన శ్రియ తరువాత మరే సినిమాను అంగీకరించలేదు.