
చారిత్రక పాత్రలో శ్రియ
బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలో హీరోయిన్ పాత్ర కోసం చాలా రోజులుగా వెతుకున్న చిత్రయూనిట్ ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఐతే తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ను బాలయ్యకు జోడిగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.
చాలా కాలం క్రితం చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన శ్రియను గౌతమీ పుత్రశాతకర్ణి సినిమాలో బాలయ్యకు జోడిగా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేని శ్రియ అయితే డేట్స్ సమస్య కూడా లేకుండా షూటింగ్ పూర్తి చేయొచ్చన ఆలోచనలో ఉన్నారు యూనిట్. చివరగా గోపాల గోపాల సినిమాలో నటించిన శ్రియ తరువాత మరే సినిమాను అంగీకరించలేదు.