
నితిన్ చేతికి బాలకృష్ణ సినిమా
యంగ్ హీరో నితిన్ నటనతో పాటు బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే నిర్మాతగా మారి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించిన నితిన్ వరుసగా భారీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంటున్నాడు. సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమా రిలీజ్ విషయంలో కూడా నితిన్ కీలకంగా మారాడు. తాజాగా టాలీవుడ్ హీరో సినిమా హక్కులను కూడా సొంతం చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచాడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఎంత మొత్తానికి రైట్స్ తీసుకున్నది వెల్లడించకపోయినా భారీగానే చెల్లించారన్న టాక్ వినిపిస్తోంది.
Happy 2 announce tht v vl b distributing d prestigious N.B.K gari 100film GAUTAMIPUTRA SATAKARNI 4 Nizam area..thanku krish n rajeev garu.
— nithiin (@actor_nithiin) 1 October 2016