
పెళ్లి పీటలెక్కనున్న క్రిష్
మూస కమర్షియల్ సినిమాలకు భిన్నంగా గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో ఆకట్టుకున్న జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్, ప్రస్తుతం ఓ భారీ పీరియాడిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాతో పాటు ఇదే ఏడాది తన జీవితానికి సంబంధించిన మరో కీలకమైన అడుగు వేస్తున్నాడు క్రిష్.
చాలా రోజులుగా పెళ్లి చేసుకోవాలంటే కుటుంబ సభ్యులు చెపుతున్నా.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్న క్రిష్, చివరకు తల్లి మాటకు అంగీకరించాడు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రమ్యను వివాహమాడటానికి అంగీకరించాడు. ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న క్రిష్ త్వరలోనే ఓ ఇంటివాడవ్వనున్నాడు.